
న్యూఢిల్లీ: రిటైల్ చైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. అక్టోబర్ 4న ప్రారంభమయ్యే ఇష్యూకి రూ. 56–59 ధరల శ్రేణిని ప్రకటించింది. 7న ముగియనున్న ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండుతో కంపెనీ వినియోగ వస్తువుల విక్రయ స్టోర్లను నిర్వహిస్తోంది.
రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 254 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పవన్ కుమార్ బజాజ్, కరణ్ బజాజ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కంపెనీకి 36 పట్టణాలలో 112 మల్టీబ్రాండ్ ఔట్‌లెట్స్ ఉన్నాయి.
చదవండి: మామూలు లక్ కాదండోయ్, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు!