
ఉక్కునగరం(గాజువాక): వైజాగ్ స్టీల్‌ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన ఉప కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.ఇంతకుముందు సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన పి.కె.రథ్ ఈ ఏడాది మే 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత అప్పటి డైరెక్టర్ (పర్సనల్) కె.సి.దాస్ ఇన్‌చార్జి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన జూన్ 30న పదవీ విరమణ చేయడంతో ప్రస్తుత డైరెక్టర్ (కమర్షియల్) డి.కె.మహంతి ఇన్‌చార్జ్ సీఎండీ బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ఆదేశాలు అందుకున్న నూతన సీఎండీ అతుల్ భట్ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment