Steel Ministry
-
విదేశీ స్టీల్‌పై ‘ఉక్కు’పాదం.. దిగుమతులపై 25 శాతం సుంకం
న్యూఢిల్లీ: కొన్ని రకాల స్టీల్ దిగుమతులపై 25 శాతం సుంకం విధింపునకు కేంద్ర ఉక్కు శాఖ ప్రతిపాదించింది. కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డీ కుమారస్వామి, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మధ్య ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ ప్రతిపాదన వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి సెయిల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏఎంఎన్ఎస్ ఇండియా కంపెనీల ప్రతినిధులు సైతం హాజరయ్యారు.దీనిపై మంత్రి గోయల్ ఎక్స్ వేదికపై ట్వీట్ చేశారు. ‘‘స్టీల్, మెటలర్జికల్ కోక్ పరిశ్రమల భాగస్వాములు, నా సహచరుడు, భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామితో కలసి సమావేశం నిర్వహించాం. దేశాభివృద్ధిలో ఈ రెండు శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్పత్తి, నాణ్యత పెంపుతోపాటు అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని పెంచే మార్గాలపై చర్చించాం’’అని గోయల్ తన ట్వీట్లో వెల్లడించారు.మంత్రి కుమారస్వామి సైతం ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై స్పందించారు. రెండు శాఖల మధ్య సహకారం, దేశీ స్టీల్, భారీ పరిశ్రమలకు సంబంధించి వ్యాపార నిర్వహణను సులభతరం చేసే మార్గాలపై చర్చించినట్టు చెప్పారు. ఇదే భేటీలో స్టీల్ దిగుమతులపై 25 శాతం రక్షణాత్మక సుంకం విధించాలని భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ కోరింది. కొన్ని దేశాల నుంచి చౌకగా వచ్చి పడుతున్న దిగుమతులు తమకు సమస్యగా మారినట్టు దేశీ కంపెనీలు ఎప్పటి నుంచో కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నాయి. దిగుమతి సుంకాల పెంపుతో దేశీ పరిశ్రమను కాపాడాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో ఉక్కు శాఖ ప్రతిపాదన కార్యరూపం దాలుస్తుందేమో చూడాల్సి ఉంది. పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు.. దేశంలోకి వస్తున్న స్టీల్ దిగుమతుల్లో 62 శాతం మేర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కలిగిన దేశాల నుంచే ఉంటున్నాయని, వీటికి ఎలాంటి సుంకం వర్తించడం లేదని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ గత నెలలో చెప్పడం గమనార్హం. కనుక దిగుమతి సుంకాలను పెంచినప్పటికీ ఈ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఎంలాంటి ప్రభావం ఉండదన్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యపై తమకు అవగాహన ఉన్నట్టు చెప్పారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 5.51 మిలియన్ టన్నుల స్టీల్ దిగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 3.66 మిలియన్ టన్నుల కంటే 60 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చైనా నుంచి స్టీల్ దిగుమతులు 1.85 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో చైనా నుంచి 1.0 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు దిగుమతయ్యాయి. -
ఇకపై వాటి దిగుమతులకు ఆమోదం తప్పనిసరి
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అనుమతి లేని దిగుమతులకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి చేసింది. నాసిరకం వస్తువులు మార్కెట్లోకి వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత విధానం ప్రకారం..అన్ని ప్రమాణాలకు లోబడి ఉన్న సరైన అర్హత కలిగిన విదేశీ ఉక్కు పరిశ్రమల ఉత్పత్తులకు బీఐఎస్ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది. బీఐఎస్, ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించిన సరుకును మార్కెట్లో విక్రయించేందుకు అనుమతిస్తారు. కానీ కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెక్నికల్ కమిటీ సదరు ప్రమాణాల ప్రకారం ధ్రువీకరించి దిగుమతి చేసే వీలుంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్-ఆగస్టు మధ్య 7.68 మిలియన్ టన్నుల ఐరన్, స్టీల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నారు. ఇది గతేడాదితో పోలిస్తే 4.82 మిలియన్ టన్నులు నుంచి 59.45శాతం పెరిగింది. వియత్నాం, జపాన్, చైనా నుంచి భారీ పరిమాణంలో ఎగుమతి చేసుకుంటున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. దాంతో ధరలు ప్రభావితం అవుతున్నట్లు తెలుస్తుంది. -
వైజాగ్ స్టీల్ సీఎండీగా అతుల్ భట్
ఉక్కునగరం(గాజువాక): వైజాగ్ స్టీల్‌ప్లాంట్ సీఎండీగా అతుల్ భట్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన ఉప కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.ఇంతకుముందు సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన పి.కె.రథ్ ఈ ఏడాది మే 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత అప్పటి డైరెక్టర్ (పర్సనల్) కె.సి.దాస్ ఇన్చార్జి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన జూన్ 30న పదవీ విరమణ చేయడంతో ప్రస్తుత డైరెక్టర్ (కమర్షియల్) డి.కె.మహంతి ఇన్చార్జ్ సీఎండీ బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక ఆదేశాలు అందుకున్న నూతన సీఎండీ అతుల్ భట్ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది. -
కడప స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ఉక్కుశాఖ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : కడప స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మూతలు ఆడుతున్నాయి. అందుబాటులో ఉన్న ఇనుప ఖనిజం, మైనింగ్ లీజు వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదంటూ కేంద్ర ఉక్కు శాఖ మళ్లీ పాత పాటే పాడింది. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన కేంద్ర ఉక్కుశాఖ సాంకేతిక నివేదిక ఇవ్వాలని మెకాన్ సంస్థను ఆదేశించింది. ఇప్పటికే మెకాన్ సంస్థ ముసాయిదా నివేదిక ఉక్కు శాఖకు అందేజేసింది. సాంకేతిక నివేదికపై వివిధ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఇనుప ఖనిజం నిల్వలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ పేర్కొంది. మైనింగ్ లీజు, అందుబాటులో ఉన్న ఇనుప ఖనిజం వివరాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలని మెకాన్ సంస్థను ఆదేశించింది. ఆ వివరాల ఆధారంగానే సాధ్యాసాధ్యాల నివేదిక రిపోర్టు తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు , సంయుక్త భాగస్వామ్యం తదితర మార్గాల్లో పెట్టుబడి అంశాలను కూడా అధ్యయనం చేయాలని ఉక్కు శాఖ టాస్క్ ఫోర్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. -
రూపీ కోసం వాటిపై సుంకాలు పెంపు
న్యూఢిల్లీ : రోజు రోజుకు అంతకంతకు క్షీణిస్తున్న రూపాయిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. కొన్ని స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 15 శాతం పెంచాలని స్టీల్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఈ రేట్లు 5 శాతం నుంచి 12.5 శాతం మధ్యలో ఉన్నాయి. దీంతో రూపాయికి కాస్త మద్దతు ఇవ్వొచ్చని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనతో అవసరం లేని దిగుమతులను తగ్గించి, డాలర్లు తరలి వెళ్లడాన్ని ఆపివేయొచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయంపై వాణిజ్య మంత్రిత్వ శాఖతో నేడు చర్చోపచర్చలు జరుపనున్నారు. దేశీయ స్టీల్ ఉత్పత్తిని ప్రోత్సహించి, మేకిన్ ఇండియాకు ఊతమిచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడనున్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై వెంటనే స్పందించేందుకు స్టీల్, ట్రేడ్ మంత్రిత్వ శాఖలు అంగీకరించలేదు. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో, నికర స్టీల్ దిగుమతులు రెండేళ్లలో తొలిసారి 2.1 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇవి 15 శాతం పెంపు. మార్చితో ముగిసిన 2017-18 ఆర్థిక సంవత్సరంలో స్టీల్ దిగుమతులు 8.4 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. వీటిలో 45 శాతం జపాన్, దక్షిణ కొరియా నుంచి వచ్చినవే. ఆయా దేశాలతో భారత్‌కు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలున్నాయి. నార్త్ ఆసియన్ దేశాల నుంచి స్టీల్‌ను దిగుమతి చేసుకుంటే, ఎలాంటి సుంకాలు వర్తించవు. కానీ ఇతర స్టీల్ సరఫరా దేశాలు చైనా, దక్షిణాఫ్రికా, మలేషియా, రష్యా, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే మాత్రం సుంకాలను భరించాల్సి ఉంటుంది. స్టీల్‌తో పాటు ప్రభుత్వం బంగారం, హై-ఎండ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆంక్షలు విధించేందుకు చూస్తోంది. భారత్, ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం కొనుగోలుదారు. ఆగస్టులో దీని దిగుమతులు 90 శాతం పెరిగి, 3.64 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు చిత్తశుద్ధితో, నిరంతరంగా కృషి చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 12న టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఇరు రాష్ట్రాలలోని బయ్యారం, కడపలలో ఉక్కు పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై సాధ్యమయ్యే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. 2016 సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సమగ్ర చర్చ జరిపినట్లు పేర్కొంది. జూన్ 12న జరిగిన 6వ సమావేశంలో మెకాన్‌తో కలిసి ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు ఫీజిబిలిటి రిపోర్ట్ తయారు చేయాలని కోరినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం స్టీల్ అథారిటి ఆఫ్ ఇండియా (ఎస్ఏఐఎల్) ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సాధ్యమమ్యే అంశాలపై 2014 డిసెంబర్ 2న ఫిజిబిలిటి రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం రెండు ప్రాంతాల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆర్థికంగా అనుకూలం కాదని తేలిందన్నారు. -
విశాఖ ఉక్కు లాభం రూ.62 కోట్లు
ఉక్కునగరం(విశాఖ) : విశాఖ స్టీల్‌ప్లాంట్ గత ఆర్దిక సంవత్సరంలో అనేక ఒడుదొడుకులను ఎదుర్కొని రూ. 11,665 కోట్లు టర్నోవర్‌తో రూ.62 కోట్లు నికరలాభం(పన్నున్నీ పోను) అర్జించింది. మంగళవారం స్టీల్‌ప్లాంట్ సిఎండి పి. మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సంస్ద 33వ వార్షిక సాధారణ సమావేశం(ఎజిఎం)లో ఆడిట్ నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా సిఎండి మధుసూదన్ మాట్లాడుతూ గత ఏడాది సంభవించిన హుదూద్ తుఫాన్ ప్రభావం ప్లాంట్‌పై పడి పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు. యాజమాన్యం, ఉద్యోగుల సమిష్టి కృషితో అతి తక్కువ సమయంలో ఉత్పత్తిని సాధారణ స్దితికి తీసుకురావడంతో పాటు క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో 3 శాతం వృద్దిని నమోదు చేయగలిగామన్నారు. చైనా నుంచి పొడవు ఉత్పత్తుల దిగుమతులు 202 శాతం పెరగడం వల్ల విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై దాని ప్రభావం పడి గత ఏడాది రెండవ అర్దభాగంలో లాభాలు తగ్గాయన్నారు. అయినా పూర్తి ఏడాదిలో రూ.865 కోట్లు విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేసి 16శాతం వృద్ది నమోదు చేసామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇంటీరియం డివిడెండ్ రూపేణా రూ.14 కోట్లు, ప్రిఫరెన్స్ షేర్లపై వడ్డీ కింద రూ.11.35 కోట్లు చెల్లించామన్నారు. రాష్ట్రపతి ప్రతినిధిగా ఉక్కు మంత్రిత్వ శాఖ డైరక్టర్ మహాబిర్ ప్రసాద్ హాజరైన ఈ కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ డైరక్టర్లు పి.సి.మహాపాత్ర, డాక్టర్ జి.బి.ఎస్.ప్రసాద్, డి.ఎన్.రావు, టి.వి.ఎస్.కృష్ణకుమార్, ఆడిట్ కమిటీ చైర్మన్ ప్రోఫెసర్ ఎస్.కె.గార్గ్ తదితరులు పాల్గొన్నారు.