బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అనుమతి లేని దిగుమతులకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి చేసింది. నాసిరకం వస్తువులు మార్కెట్‌లోకి వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుత విధానం ప్రకారం..అన్ని ప్రమాణాలకు లోబడి ఉన్న సరైన అర్హత కలిగిన విదేశీ ఉక్కు పరిశ్రమల ఉత్పత్తులకు బీఐఎస్ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది. బీఐఎస్, ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించిన సరుకును మార్కెట్లో విక్రయించేందుకు అనుమతిస్తారు. కానీ కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెక్నికల్ కమిటీ సదరు ప్రమాణాల ప్రకారం ధ్రువీకరించి దిగుమతి చేసే వీలుంది.
దేశవ్యాప్తంగా ఏప్రిల్-ఆగస్టు మధ్య 7.68 మిలియన్ టన్నుల ఐరన్, స్టీల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నారు. ఇది గతేడాదితో పోలిస్తే 4.82 మిలియన్ టన్నులు నుంచి 59.45శాతం పెరిగింది. వియత్నాం, జపాన్, చైనా నుంచి భారీ పరిమాణంలో ఎగుమతి చేసుకుంటున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. దాంతో ధరలు ప్రభావితం అవుతున్నట్లు తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment