BIS
-
వెండి ఆభరణాలకూ హాల్ మార్కింగ్
న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలకు తప్పనిసరి హాల్ మార్కింగ్ విజయవంతం కావడంతో వెండి ఆభరణాలు, కళాకృతులకు సైతం ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయడాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలంటూ భారతీయ ప్రమాణాల సంస్థను (బీఐఎస్) కోరినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ‘బంగారం మాదిరే వెండికీ హాల్ మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలంటూ వినియోగదారుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోండి’ అని బీఐఎస్ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంత్రి జోషి కోరారు. ఈ దిశగా కార్యాచరణను ప్రభుత్వం ఇప్పటికే మొదలు పెట్టిందని చెప్పారు. ‘అమలు సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని, వినియోగదారులు, ఆభరణాల డీలర్ల స్పందనలను తెలుసుకోవాలని కోరాను. భాగస్వాములు అందరితో మాట్లాడిన తర్వాతే ప్రక్రియ మొదలు పెడతాం’అని తెలిపారు. కాగా, మూడు నుంచి ఆరు నెలల్లో వెండికి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ చెప్పారు. -
మరిన్ని జిల్లాల్లో ‘తప్పనిసరి హాల్‌మార్కింగ్’
బంగారు ఉత్పత్తులకు అందించే హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ)ను మరో 18 జిల్లాల్లో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానంతో 40 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు, వస్తువులు ఈ గుర్తింపు పొందాయి. ఇది మార్కెట్లో బంగారు ఉత్పత్తులకు సంబంధించి వినియోగదారుల విశ్వాసాన్ని, ఉత్పత్తుల పారదర్శకతను పెంపొందిస్తుందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.‘గోల్డ్ జువెల్లరీ అండ్ గోల్డ్ ఆర్ట్ఫ్యాక్ట్స్ ఎమెండమెంట్ ఆర్డర్-2024’ ప్రకారం బంగారు ఉత్పత్తులపై తప్పనిసరి హాల్‌మార్కింగ్ ఉండాలి. అందులో భాగంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆధ్వర్యంలో నవంబర్ 5, 2024 నుంచి హెచ్యూఐటీ నాలుగో దశను ప్రారంభించింది. ఇందులో అదనంగా 18 జిల్లాలను చేర్చారు. అందుకోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్తగా చేరిన జిల్లాలతో కలిపి తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం అమలులో ఉన్న జిల్లాల సంఖ్య 361కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని జిల్లాల్లో తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం అమల్లోకి వచ్చినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.ఇదీ చదవండి: 17,000 మంది ఉద్యోగుల తొలగింపు!తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం ప్రారంభమైన జూన్ 23, 2021 నుంచి నమోదిత నగల వ్యాపారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ విధానం అమలు ప్రారంభంలో వీరి సంఖ్య 34,647గా ఉండేది. ప్రస్తుతం అది దాదాపు ఐదురెట్లు పెరిగి 1,94,039కు చేరింది. హాల్‌మార్కింగ్ కేంద్రాల సంఖ్య 945 నుంచి 1,622కి పెరిగింది. -
ఎలక్ట్రిక్ వాహనాల్లో సేఫ్టీ కోసం కొత్త స్టాండర్డ్స్: బీఐఎస్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో.. వాహన తయారీ సంస్థలు కొత్త ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో భద్రతను పెంచడానికి 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' (BIS) రెండు కొత్త ప్రమాణాలను ప్రవేశపెట్టింది.బీఐఎస్ ప్రవేశపెట్టిన రెండు కొత్త ప్రమాణాలలో ఒకటి 'IS 18590:2024'.. మరొకటి IS 18606:2024. అన్ని వర్గాల ఎలక్ట్రిక్ వాహనాల్లో భద్రతను పెంచడమే లక్యంగా వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కంపెనీలు ఉత్పత్తి చేసే వాహనాల్లో మరింత భద్రతను పెంచాలని బీఐఎస్ ప్రమాణాలు చెబుతున్నాయి.కారులో ప్రయాణికుల సేఫ్టీ మాత్రమే కాకుండా.. బ్యాటరీల భద్రతకు కూడా పెద్దపీట వేయాలని బీఐఎస్ చెబుతోంది. ప్రస్తుతం దేశంలో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ మాత్రమే కాకుండా పెద్ద ట్రక్కులు, రిక్షాలు మొదలైనవన్నీ కూడా ఈవీల రూపంలో లభిస్తున్నాయి. కాబట్టి వీటి వినియోగం కూడా ఎక్కువవుతోంది.బీఐఎస్ IS 18294:2023 ప్రమాణాల ప్రకారం.. కంపెనీలే వాహనాలకు ప్రత్యేకంగా భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేస్తాయి. ఇవన్నీ వాహన నిర్మాణం, కార్యాచరణ వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. కొత్త భద్రతా ఫీచర్స్ అన్నీ కూడా డ్రైవర్లు మరియు ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయి.కొత్తగా అమలులోకి ప్రవేశపెట్టిన కొత్త భద్రతా ప్రమాణాలతో కలిపి మొత్తం 30 బీఐఎస్ భారతీయ ప్రమాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన, సమర్థవంతమైన రవాణా వ్యవస్థకు నడపడంలో ఈ ప్రమాణాలు చాలా కీలకమైనవిగా ఉంటాయి.BIS just upped the safety game for EVs with new standards focusing on powertrains and batteries.This means more secure #electric cars, bikes, and even #rickshaws!BIS is passionate about making #EVs a safe and #sustainable way to travel.#IndianStandards @jagograhakjago pic.twitter.com/sbM8pkzqk8— Bureau of Indian Standards (@IndianStandards) June 25, 2024 -
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
దేశంలో ఫర్నిచర్ ధరలు వచ్చే ఏడాది పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ప్లైవుడ్ తయారీదారులందరికీ ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తా సంస్థ ‘మింట్’ నివేదించింది. బాయిలింగ్ వాటర్ ప్రూఫ్‌గా ప్రచారం చేసే ప్లైవుడ్‌కు ఆ మేరకు ఐఎస్ఐ సర్టిఫికేషన్ కూడా అవసరముంటుందని ఇద్దరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.ఫర్నిచర్, ఇతర వస్తువుల్లో ఉపయోగించే ప్లైవుడ్ నాణ్యత, మన్నికను మెరుగుపరచడం, సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా అవి ఎక్కువ కాలం ఉండేలా చూడటం లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, నేపాల్ నుంచి నాసిరకం ప్లైవుడ్ దిగుమతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త ప్రమాణాల ప్రకారం ప్లైవుడ్ తయారీదారులు అన్ని గ్రేడ్ల ప్లైవుడ్‌కు ఫంగల్ నిరోధకత కోసం మైకోలాజికల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.ఈ నిబంధనపై ప్లైవుడ్ మేకర్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త ప్రమాణాలు ప్లైవుడ్ నాణ్యతను మెరుగుపరుస్తాయని, వినియోగదారులతో పాటు తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని కొందరు చెబుతుండగా మరికొందరు దీన్ని ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు.అయితే ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది ప్లైవుడ్ ధరలు 15 శాతం పెరుగుతాయని ఆల్ ఇండియా ప్లైవుడ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ నరేష్ తివారీ తెలిపారు. నాసిరకం ప్లైవుడ్ ఉత్పత్తుల దిగుమతిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్లైవుడ్ తయారీదారులందరూ బీఐఎస్ నిబంధనలను పాటించాలని కోరారు. కాగా దీనిపై అటు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి గానీ, బీఐఎస్ ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. -
బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే..
నాణ్యత కొనుగోలుదారుడి హక్కు అని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) చెబుతోంది. ఈ క్రమంలో వివిధ వస్తువులు, ఉత్పత్తులు, పరికరాలు సహా అన్నీ బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండాల్సిందేనని అధికారులు తెలిపారు. దేశ ప్రజలు నిత్యం వినియోగించే దాదాపు 344 వస్తువులకు విధిగా బీఐఎస్ నాణ్యత గుర్తు ఉండాల్సిందేనని స్పష్టం సంస్థ స్పష్టం చేసింది. విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న మొబైల్ఫోన్లు సహా అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులకు బీఐఎస్ గుర్తింపు తప్పనిసరని తెలిపింది. బీఐఎస్ ఇప్పటి వరకూ సుమారు 20 వేల ప్రమాణాలను ధ్రువీకరించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిసింది. నాణ్యత లేని వస్తువుల దిగుమతిని అరికట్టడానికి, దేశీయ తయారీని పెంచడానికి ప్రభుత్వం స్విచ్, సాకెట్, కేబుల్ ట్రంక్.. వంటి ఎలక్ట్రికల్ వస్తువులకు నాణ్యత నిబంధనలను తప్పనిసరి చేసింది. ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2023ని ఈ ఏడాది జనవరి 1న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) జారీ చేసింది. ఈ ఆర్డర్ ప్రకారం ఎలక్ట్రిక్ వస్తువులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) గుర్తు తప్పనిసరి చేసింది. లేదంటే వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం సాధ్యం కాదు. ఆర్డర్ వెలువడిన ఆరు నెలల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయిని డీపీఐఐటీ తెలిపింది. ఎంఎస్ఎంఈ రంగాన్ని రక్షించడానికి అధికారులు నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినట్లు తెలుస్తుంది. చిన్న పరిశ్రమలకు అదనంగా తొమ్మిది నెలలు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లు 12 నెలల తర్వాత నిబంధనల పరిధిలోకి వస్తాయని సమాచారం. బీఐఎస్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తే, మొదటి నేరానికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష లేదా కనీసం రూ.2 లక్షల జరిమానా విధించవచ్చు. రెండో, తదుపరి నేరాల విషయంలో మరింత కఠిన శిక్షలు ఉంటాయి. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిచిన్న ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే? బీఐఎస్ ప్రమాణాలను ఎలా నిర్ధారిస్తుందంటే.. తయారీదారులు, ప్రయోగశాలలు, సంబంధిత సైంటిస్టులు, నియంత్రణ సంస్థలు, వినియోగదారులు, ఆ రంగంలోని నిపుణులు కమిటీగా ఏర్పడి ప్రమాణాల ముసాయిదాను రూపొందిస్తారు. ఆపై భారతీయ ప్రమాణాలను తయారుచేస్తారు. ఏదైనా సంస్థ తయారు చేసిన వస్తువు నమూనా (శాంపిల్) తీసుకుని ప్రయోగశాలల్లో పరిశీలించి బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాలు ఉంటే ఐఎస్ఐ మార్కు వినియోగానికి లైసెన్స్ కేటాయిస్తారు. -
ప్రమాణాలపై అవగాహన అవసరం: బీఐఎస్ సదస్సులో వక్తలు
సాక్షి, హైదరాబాద్: భారతీయ ప్రమాణాలు, నాణ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యా సంస్థల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఏర్పాటు చేసిన స్టాండర్డ్స్ క్లబ్బుల ద్వారా విస్తృత ప్రయోజనాలున్నాయని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణలోని పలు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో బీఐఎస్ ఏర్పాటు చేసిన రెండురోజుల శిక్షణ సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లో ముగిసింది. సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథులుగా సాంకేతిక విద్య బోర్డు కార్యదర్శి పుల్లయ్య, బీఐఎస్ సౌత్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ యూఎస్పీ యాదవ్, సాంకేతిక విద్యాశాఖ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ఏ. స్వామి హాజరయ్యారు. ఈ సమావేశంలో స్వామి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు మెరుగైన భవితను అందించే ఇలాంటి కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. భారతీయ ప్రమాణాలు, నాణ్యతపై విద్యార్థి దశలోనే స్పష్టమైన అవగాహన కల్పించడం ద్వారా నాణ్యమైన సమాజం ఏర్పడుతుందని స్వామి అభిప్రాయపడ్డారు. అనంతరం బీఐఎస్ డీడీజీఎస్ యూఎస్పీ యాదవ్ మాట్లాడుతూ మన నిత్య జీవితంలో కీలక భూమిక వహిస్తున్న భారతీయ ప్రమాణాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు బీఐఎస్ విస్తృత కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగానే బీఐఎస్ స్టాండర్డ్స్ క్లబ్బులు విద్యార్థుల్లో కొత్త నైపుణ్యాల్ని రూపొందించేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. ఇదీచదవండి..కాళేశ్వరంపై ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం -
ఇకపై వాటి దిగుమతులకు ఆమోదం తప్పనిసరి
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అనుమతి లేని దిగుమతులకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి చేసింది. నాసిరకం వస్తువులు మార్కెట్లోకి వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత విధానం ప్రకారం..అన్ని ప్రమాణాలకు లోబడి ఉన్న సరైన అర్హత కలిగిన విదేశీ ఉక్కు పరిశ్రమల ఉత్పత్తులకు బీఐఎస్ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది. బీఐఎస్, ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించిన సరుకును మార్కెట్లో విక్రయించేందుకు అనుమతిస్తారు. కానీ కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెక్నికల్ కమిటీ సదరు ప్రమాణాల ప్రకారం ధ్రువీకరించి దిగుమతి చేసే వీలుంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్-ఆగస్టు మధ్య 7.68 మిలియన్ టన్నుల ఐరన్, స్టీల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నారు. ఇది గతేడాదితో పోలిస్తే 4.82 మిలియన్ టన్నులు నుంచి 59.45శాతం పెరిగింది. వియత్నాం, జపాన్, చైనా నుంచి భారీ పరిమాణంలో ఎగుమతి చేసుకుంటున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. దాంతో ధరలు ప్రభావితం అవుతున్నట్లు తెలుస్తుంది. -
సీలింగ్ ఫ్యాన్లకు కొత్త నిబంధనలు.. అతిక్రమిస్తే భారీ జరిమానాలు
Quality Norms For Ceiling Fans: నాసిరకం వస్తువుల దిగుమతిని అరికట్టేందుకు, దేశీయంగా విద్యుత్ ఫ్యాన్ల తయారీని పెంచేందుకు ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లకు ప్రభుత్వం తప్పనిసరి నాణ్యతా నిబంధనలను జారీ చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఆగస్టు 9న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రిక్ సీలింగ్ టైప్ ఫ్యాన్స్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్- 2023 కిందకు వచ్చే వస్తువులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తును కలిగి ఉంటే తప్ప వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం కుదరదు. ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత నుంచి ఇది అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లకు ఇప్పటి వరకు ఎలాంటి బిస్ ధ్రువీకరణ నియమాలు లేవు. బిస్ చట్టం నిబంధనను ఉల్లంఘిస్తే, మొదటి నేరానికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా కనీసం రూ. 2 లక్షల జరిమానా విధించవచ్చు. మరోసారి ఉల్లంఘనలకు పాల్పడితే కనీస జరిమానా రూ. 5 లక్షలకు పెరుగుతుంది. ఇది ఆయా వస్తువుల విలువ కంటే 10 రెట్లు వరకు ఉండవచ్చు. ఎంఎస్ఎంఈలకు సడలింపులు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO) అమలుకు సంబంధించి ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లను తయారు చేసే దేశీయ సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు డీపీఐఐటీ సడలింపులు ఇచ్చింది. ఎంఎస్ఎంఈలకు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 12 నెలల తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. -
బయోడీగ్రేడబుల్ ప్లేట్లు, కప్పులు వాటితోనే చేయాలి: బీఐఎస్
న్యూఢిల్లీ: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) బయోడీగ్రేడబుల్ (మట్టిలో కలిసిపోయే) ఆహార పాత్రలకు నాణ్యత ప్రమాణాలను విడుదల చేసింది. ఇటువంటి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ప్లేట్లు, కప్పులు, గిన్నెలు, ఇతర పాత్రలను తయారు చేయడానికి ఆకులు, తొడుగులు వంటి వ్యవసాయ ఉప ఉత్పత్తులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ముడి పదార్థాలు, తయారీ పద్ధతులు, పనితీరు, పరిశుభ్రత వంటి అంశాలను ప్రామాణికంగా చేసుకుని ఐఎస్ 18267: 2023 ధ్రువీకరణను బీఐఎస్ జారీ చేస్తుంది. హాట్ ప్రెస్సింగ్, కోల్డ్ ప్రెస్సింగ్, మౌల్డింగ్, స్టిచింగ్ వంటి తయారీ సాంకేతికతలను సైతం బ్యూరో నిర్ధేశిస్తుంది. -
మీ బంగారం స్వచ్ఛమైనదేనా?నకిలీదా..మొబైల్ లోనే ఇలా చెక్ చేసుకోండి..
-
బంగారం స్వచ్ఛమైనదా.. కాదా? ఈ యాప్ ద్వారా తెలుసుకోండి!
బంగారం అంటే అందరికి ఇష్టమే, కావున ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే కొనుగోలు చేసిన బంగారం స్వచ్ఛమైనదా, నకిలీదా అని గుర్తించడం అంత సులభం కాదు. కాబట్టి కొంతమంది దుకాణదారులు కొనుగోలుదారులను ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉంది. అలాంటి మోసాలకు చెక్ పెట్టడానికి ఒక మొబైల్ యాప్ అందుబాటులో ఉంది, ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బంగారం రేట్లు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ కొనుగోలుదారుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారు ఆభరణాల అమ్మకాలకు సంబంధించి కొన్ని ప్రకటనలు చేసింది. ఇందులో భాగంగానే విక్రయదారుడు తప్పకుండా హాల్ మార్క్ కలిగి ఉన్న గోల్డ్ మాత్రం అమ్మాలని సూచించింది. ఈ రూల్స్ 2023 ఏప్రిల్ 01 నుంచి అమలులోకి వచ్చాయి. (ఇదీ చదవండి: చాట్‌జీపీటీపై నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనం కొనే బంగారం స్వచ్ఛమైనదా? కాదా? అని తెలుసుకోవచ్చు. అయితే హాల్‌మార్కింగ్ నంబర్లో కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఆభరణం భారత ప్రమాణాలకు అనుకూలంగా ఉండేలా తయారు చేయాలనీ కేంద్రం స్పష్టం చేసింది. మొబైల్ యాప్ ద్వారా బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా? బంగారు ఆభరణాలపైన హాల్‌మార్క్ యూనిక్యూ ఐడెంటిఫికేషన్ (HUID) అనేది తయారీ సంస్థలే ముద్రిస్తుంటాయి. కావున బంగారం కొనేటప్పుడు ఆ HUID నెంబర్ యాప్‌లో ఎంటర్ చేయగానే ఆ నెంబర్ సరైందా.. కాదా? అనేది ఇట్టే తెలిసిపోతుంది. అంతే కాకుండా అది ఎప్పుడు, ఎవరు తాయారు చేశారనే విషయాలు కూడా తెలుస్తాయి. (ఇదీ చదవండి: ఉద్యోగం వదిలి అద్దె భూమిలో వ్యవసాయం.. కోట్లు గడిస్తూ కాలర్ ఎగరేస్తున్నాడు!) నిజానికి 2021 జులైకి ముందు బిఐఎస్ లోగో, హాల్‌మార్కింగ్ సంఖ్య, బంగారం స్వచ్ఛత వంటివి ముద్రించేవారు. వెండి ఆభరణాలకు కూడా ఇలాంటి గుర్తులు ఉండేవి. ఆ తరువాత కేవలం బిఐఎస్ లోగో, గోల్డ్ ఫ్యూరిటీ, ఆరంకెల HUID మాత్రం ముద్రించారు. ప్రస్తుతం మార్కెట్లో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్స్ గోల్డ్ అందుబాటులో ఉంది. వెండికి కూడా స్వచ్ఛత ప్రమాణాలు ఉన్నాయి. -
ఈ కామర్స్ దిగ్గజాలకు మరోసారి బిగ్ షాక్, కేంద్రం నోటీసులు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలకు భారీ షాక్ తగిలింది. నాణ్యతా ప్రమాణాలు విస్మరించి, బొమ్మల విక్రయాలపై రెగ్యులేటరీ కొరడా ఝళిపించింది. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ) క్వాలిటీ మార్క్ లేని బొమ్మలను విక్రయించి నందుకు వినియోగదారుల రక్షణ నియంత్రణ సంస్థ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌లకు నోటీసులు జారీ చేసింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని బొమ్మలను అక్రమంగా విక్రయిస్తున్న మూడు ఇ-కామర్స్ సంస్థలకు ఈ మేరకు నోటీసులిచ్చామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చీఫ్ నిధి ఖరే ఒక ప్రకటన జారీ చేశారు. బీఐఎస్ ప్రమాణానికి అనుగుణంగా లేని బొమ్మల విక్రయాలపై ఫిర్యాదులు నేపథ్యంలో దేశంలో పలు దుకాణాల్లో దాడులు నిర్వహించామని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. 44 చోట్ల గత నెలలో నిర్వహించిన దాడుల్లో ప్రధాన రిటైల్ దుకాణాల నుండి 18,600 బొమ్మలను స్వాధీనం చేసు కున్నామని వెల్లడించారు. ముఖ్యంగా దేశంలోని ప్రధాన విమానాశ్రయాలు, మాల్స్‌లో ఉన్న హామ్లీస్, ఆర్చీస్, డబ్ల్యూహెచ్ స్మిత్, కిడ్స్ జోన్ , కోకోకార్ట్‌తో సహా రిటైల్ దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. బీఐఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తివారీ తెలిపారు. కాగా 2021, జనవరి నుంచి బీఐఎస్ నిర్దేశించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టాయ్‌మేకర్స్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. నాసిరకం వస్తువులు విక్రయించినందుకుగానూ గతంలో ఈకామర్స్ సంస్థలకు సీసీపీఏ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. -
జియో నుంచి మరో సంచలనం..! త్వరలోనే లాంచ్..!
టెలికాం రంగంలో సంచలనాలను నమోదు చేసిన జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీయనుంది. రిలయన్స్ 44 వ ఏజీఎమ్ సమావేశంలో అతి తక్కువ ధరకే జియో ఫోన్ నెక్ట్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాటుగా జియోబుక్ ల్యాప్‌టాప్‌ను కూడా ప్రకటిస్తుందని అంచనా వేశారు. ఏజీఎమ్ సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ జియోబుక్ గురించి ఏలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా భారత మార్కెట్లలోకి జియోబుక్ ల్యాప్‌టాప్‌ను మరి కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయనుందనే ఊహగానాలు వస్తున్నాయి. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! ఫోట్కర్టసీ: ఎక్స్‌డీఏ డెవలపర్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్సైట్లో సర్టిఫికేషన్ కోసం జియోబుక్ ల్యాప్‌టాప్ వచ్చినట్లు తెలుస్తోంది. జియో నుంచి రాబోయే ల్యాప్‌టాప్ మూడు వేరియంట్లు బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్లో కంపెనీ లిస్ట్ చేసింది. కాగా జియో ల్యాప్‌టాప్ లాంచ్ డేట్ మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు. జియోబుక్ 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో వస్తుందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4జీబీ ఎల్పీడీడీఆర్ఎక్స్ ర్యామ్, 64 జీబీ రామ్ స్టోరేజ్‌తో రానుంది. జియోబుక్ ధర ఇంకా తెలియాల్సి ఉండగా తక్కువ ధరల్లోనే జియోబుక్ ఉంటుందని టెక్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.జియోబుక్ సర్టిఫికేషన్‌లో భాగంగా మూడు వేరియంట్లతో NB1118QMW, NB1148QMW, NB1112MM బీఐఎస్ వెబ్సైట్లో లిస్ట్ ఐనట్లు టిప్‌స్టార్ ముకుల్ శర్మ వెల్లడించారు. జియోబుక్ ల్యాప్‌టాప్ స్పెఫికేషన్లు అంచనా..! జియోబుక్ ల్యాప్‌టాప్ హెచ్డీ (1,366x768 పిక్సెల్స్) డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 664 ఎస్ఓసీ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మినీ హెచ్డీఎమ్ఐ కనెక్టర్ డ్యూయల్‌బ్యాండ్ వైఫై బ్లూటూత్ సపోర్ట్ ప్రీ ఇన్స్టాల్డ్ జియో యాప్స్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఆఫీస్ చదవండి: Smartphone: స్మార్ట్ఫోన్లు పేలుతున్నాయ్.. జాగ్రత్తలు మన చేతుల్లో కూడా! -
జువెలరీ షోరూమ్‌లో స్వచ్చమైన బంగారాన్ని గుర్తించడం ఎలా..?
మీరు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆభరణాల షోరూమ్‌లోకి వెళ్లినప్పుడు మీ మనస్సులో ఉన్న బడ్జెట్ గురించి ఆభరణాల వ్యాపారికి చెప్పిన వెంటనే, అతను మీ ముందు విభిన్న రకాల బంగారు ఆభరణాల సెట్ డిజైన్లను ఉంచుతారు. బంగారం ధర అనేది స్వచ్ఛత మీద ఆధారపడి ఉంటుంది. మీరు స్వచ్ఛమైన బంగారం కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. కానీ, మీరు కొనుగోలు చేస్తున్న ఆభరణాలు స్వచ్ఛమైనవా? ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు కూడా కట్టుబడి ఉన్నాయని మీరు ఎలా ధృవీకరిస్తారు?. దీనికి సంబందించి ఆగ్మోంట్ డైరెక్టర్ కేతన్ కొఠారి బంగారం కొనుగోలు ప్రక్రియ, స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు, దేశంలో కొత్త హాల్ మార్క్ నియమాలు, హాల్ మార్క్ చేయని మీ పాత బంగారు ఆభరణాల గురుంచి వివరణ ఇచ్చారు. కేతన్ కొఠారి తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం వివిధ రకాల స్వచ్ఛత స్థాయిల్లో ఉంటుంది. బంగారం అనేది అతి తక్కువ స్వచ్ఛత కలిగిన 10 క్యారెట్ల బంగారం నుంచి అత్యధిక స్వచ్చత కలిగిన 24 క్యారెట్ల బంగారం వరకు లభిస్తుంది. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అని ఎందుకు అంటారు అంటే? దీనిలో వేరే ఇతర లోహాలను కలపరు. ఇది మృదువుగా ఉంటుంది. దీనిని బంగారు కడ్డీలు, నాణేలు, విద్యుత్ పరికరాలు, వైద్య పరికరాల ఉత్పత్తిలో విస్తృతంగా ఉపయోగిస్తారు. వెండి, జింక్, నికెల్ వంటి ఇతర మిశ్రమలోహాలు బంగారం కలిగి ఉన్న వాటిని 23కె, 22కె, 22కె, 20కె, 18కె, 14కె, 10కె బంగారం అని అంటారు. ఈ ఇతర గ్రేడ్ల బంగారం మన్నికైనవి, దృఢమైనవి. మన భారత దేశంలో ఎక్కువగా ఆభరణాల తయారీ కోసం ఎక్కువగా 22 క్యారెట్ల బంగారం వాడుతారు. కొత్త హాల్ మార్క్ నిబంధనలు ఏమిటి? బంగారం కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు హాల్ మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలుచేయడం ద్వారా కస్టమర్లు బంగారు ఆభరణాల విషయంలో మోసపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే ప్రభుత్వ లోగో. హాల్‌మార్కింగ్ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) కొన్ని ప్రమాణాలు పెట్టింది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారుడు మోసపోవద్దని ప్రభుత్వం బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు బంగారం కొనుగోలు చేసే సమయంలో స్వచ్చమైన ఆభరణాలను గుర్తించడం కష్టమవుతోంది. స్వచ్చమైన బంగారం, నకిలీ బంగారం అనేది తెలియదు. కొందరు చూడగానే గుర్తిస్తారు మరికొందరు ఇబ్బంది పడతారు. అందుకే బంగారం నాణ్యతను గుర్తించేందుకు హాల్‌మార్కింగ్ విధానాన్ని కేంద్రం తీసుకోచింది. ప్రస్తుతం 256 జిల్లాల్లో మాత్రమే హాల్ మార్క్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆభరణాల షోరూమ్ కు వెళ్లినప్పుడు హాల్ మార్క్ ఆభరణాలు గుర్తుంచడం ఎలా? గోల్డ్ హాల్ మార్క్ ఆంక్షలు దశలవారీగా అమలులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 256 జిల్లాల్లో ఆభరణాల దుకాణాలు హాల్ మార్క్ లోగోను ముద్రిస్తున్నాయి. కొనుగోలుదారుడు షోరూమ్‌లోకి ప్రవేశించినప్పుడు జ్యూయలర్ బీఐఎస్ రిజిస్టర్ చేయబడిందా లేదా అని చెక్ చేయడం కొరకు బీఐఎస్ సర్టిఫికేషన్ మార్క్ అడగాలి. కొనుగోలుదారుడు స్వచ్ఛత కోసం నాలుగు సంకేతాలను పరిశీలించిన తరువాత మాత్రమే హాల్ మార్క్ చేయబడ్డ ఆభరణాలను కొనుగోలు చేయాలి. అలాగే కొన్న తర్వాత ఆభరణాల షోరూమ్ నుంచి బిల్లును తీసుకోవాలి. బంగారు ఆభరణాల స్వచ్ఛత తెలుసుకోవడం కోసం ఆ ఆభరణాలపై నాలుగు సంకేతాలు గల ముద్ర ఉంటుంది. ఆ ముద్ర కనిపించకపోతే 10ఎక్స్ భూతద్దం ఉపయోగించి దానిని మీకు ప్రదర్శించమని ఆభరణాల వ్యాపారిని అడగండి. బీఐఎస్ మార్గదర్శకాల ప్రకారం.. మీకు నగల వ్యాపారి నకిలీ ఆభరణాలు మీకు విక్రయిస్తే స్వచ్చత, బరువు కోసం మీరు చెల్లించిన టెస్టింగ్ ఛార్జీలతో వచ్చిన తేడాకు రెండు రెట్లు కొనుగోలుదారుడికి షాప్ ఓనర్ రీఎంబర్స్ మెంట్ చేయాలి. కొనుగోలుదారుడు గమనించాల్సిన సంకేతాలు ఏమిటి? ఆభరణాలపై నాలుగు ప్రధాన హాల్ మార్కింగ్ గుర్తులు ఉంటాయి. త్రిభుజం గుర్తు అనేది బీఐఎస్ మార్క్ సూచిస్తే, స్వచ్ఛతను 916 నెంబర్(22 క్యారెట్)తో సూచిస్తారు. తర్వాత ఉండేది ఆభరణాల వ్యాపారి గుర్తు, ఇక మిగిలనవి హాల్ గుర్తింపు పొందిన ఆస్సాయిగ్ సెంటర్ మార్క్, అది తయారు చేసిన సంవత్సరం. భారతదేశంలో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల బంగారు ఆభరణాలను హాల్ మార్క్ చేయవచ్చు. పాత ఆభరణాల కొనుగోలు, అమ్మకాలు ఎలా? మీ పాత బంగారు ఆభరణాల విలువ గురించి ఆందోళన చెందవద్దు. ఎందుకంటే ఇది ఇప్పటికీ చట్టబద్ధం. బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ లేనప్పటికీ, ఆభరణాల తయారీదారులు దానిని కస్టమర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఆభరణాల వ్యాపారి దాని మీద హాల్ మార్క్ లోగో ముద్రన కోసం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. హాల్ మార్క్ లేని ఆభరణాలను కొనుగోలుదారులకు విక్రయించవచ్చా? అలాంటి అవకాశం లేదు. బీఐఎస్ చట్టం, 2016లోని సెక్షన్ 29 ప్రకారం, హాల్ మార్క్ లేని ఆభరణాల విక్రయిస్తే నిబంధనల ప్రకారం ఎవరైనా ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా లక్ష రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇప్పటి వరకు భారత దేశ ప్రజల దగ్గర 1.5 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం ఆభరణాలు ఉన్నాయి. -
బంగారం కొనేటప్పుడు ఈ విషయాలను కచ్చితంగా గమనించండి..!
మన దేశ సంస్కృతిలో బంగారం ఒక కీలకమైన వస్తువు. వివాహాది శుభ కార్యాల్లో కచ్చితంగా బంగారం ఉండాల్సిందే. మహిళలకు ఐతే మరీనూ.. బంగారం అంటే అమితమైన ప్రేమ. బంగారం కొనేటప్పుడు కచ్చితంగా ఒకటికి రెండు సార్లు సరైనదా కాదా..! అని నిర్థారణకు వచ్చిన తరువాతనే కోనుగోలు చేస్తాం. బంగారం స్వచ్చమైనదేనా కాదా అనే విషయంలో బీఐఎస్ హాల్‌మార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాగా తాజాగా దేశంలోని 256 జిల్లాలో బుధవారం నుంచి బంగారు నగలపై హాల్‌మార్కింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బంగారంపై ఉన్న హాల్‌మార్క్ సరైనదా.. కాదా అని కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి. ఎందుకంటే తాజాగా కొన్ని గోల్డ్‌షాపు నిర్వహకులు తమ సొంతంగా హాల్‌మార్క్‌ను ను ముద్రించే అవకాశం ఉంది. కావున గోల్డ్ ఆర్నమెంట్స్ కొనే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వీటిని కచ్చితంగా గమనించండి..! హాల్‌మార్క్ గుర్తులో త్రిభుజాకారంలో ఉన్న బీఐఎస్(BIS) గుర్తు సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. గోల్డ్ స్వచ్చత విషయంలో క్యారెటేజ్ 22k915 కచ్చితంగా ఉండేలీ చూడాలి. వీటితో పాటు ఏహెచ్‌సీ గుర్తు ఉండేలా చూసుకోవాలి. గోల్డ్‌షాపు యాజమానిని బీఐఎస్ లైసెన్స్‌ను చూపించమని అడగవచ్చు. బంగారాన్ని కొనుగోలు చేసిన తరువాత బిల్లులో హాల్‌మార్కింగ్ ఛార్జీలు ఉండేలా చూసుకోవాలి. కొనుగోలు చేసిన బంగారంలో స్వచ్చత లేకపోతే విక్రయదారుడ్ని ప్రశ్నించవచ్చు. చదవండి: Gold Price: బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట! -
పసిడి మోసాలకు పంచ్
సాక్షి, అమరావతి బ్యూరో: బంగారు ఆభరణాల విక్రయంలో మోసాలకు చెక్ పడనుంది. ఇకపై నగలకు హాల్‌మార్క్ తప్పనిసరి కానుంది. జూన్ 1నుంచి హాల్‌మార్క్ లేని ఆభరణాలను విక్రయించకూడదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లూ పలు జ్యుయలరీ షాపుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తూ నగలను విక్రయిస్తుండటంతో వినియోగదారులు మోసపోతున్నారు. ఇలాంటి మోసాలపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో బంగారు, వెండి నగలపై వాటి స్వచ్ఛతను తెలియజేసే హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను జూన్ 1వ తేదీ నుంచి విధిగా అమలు చేయనుంది. ఈలోగా నగల దుకాణాల యజమానులు భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) ద్వారా హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకుని లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇలా లైసెన్స్ పొందిన జ్యుయలరీ దుకాణాలను మాత్రమే 14 (585), 18 (750), 22 (916) క్యారెట్ల బంగారు ఆభరణాల అమ్మకానికి అనుమతిస్తారు. హాల్‌మార్క్ లేని నగలను విక్రయిస్తే చట్టరీత్యా గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఆ షాపులోని ఆభరణాలనూ సీజ్ చేస్తారు. అలాగే నగల కొనుగోలుదారుకు హాల్‌మార్క్ సర్టిఫికేషన్ ఉన్న బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. బిల్లు ఇవ్వకపోయినా షాపు యజమానిపై చర్యలు తీసుకుంటారు. ఇకపై ఆభరణాల నాణ్యతపై అనుమానం వచ్చి బీఐఎస్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాటి స్వచ్ఛతను పరీక్షిస్తారు. స్వచ్ఛతలో తేడాలుంటే ఆ మొత్తాన్ని షాపు యజమాని నుంచి వసూలు చేసి కొనుగోలుదారుకు ఇప్పిస్తారు. మోసాలు ఇలా.. బంగారంలో ఇతర లోహాలను కలిపినా దాని సహజ రంగు పూర్తిగా కోల్పోదు. వ్యాపారులు దీనిని ఆసరా చేసుకుని కృత్రిమ లేపనాలతో మెరిసేలా చేసి, రాగి వంటి లోహాలను కలిపి మేలిమి బంగారంగా అంటగడతారు. ఇకపై అలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, వినియోగదారుడిని కల్తీ నుంచి కాపాడటానికి బీఐఎస్ హాల్‌మార్క్ నిబంధన ఉపయోగపడుతుందని కన్సూ్యమర్స్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ స్టేట్ విజిలెన్స్ కమిటీ సభ్యుడు కాండ్రేగుల వెంకటరమణ ‘సాక్షి’తో చెప్పారు. రాష్ట్రంలో 876 షాపులే.. ఆంధ్రప్రదేశ్‌లో 876 దుకాణాలకు మాత్రమే హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ ఉంది. ఈ లైసెన్స్ లేని షాపులు రాష్ట్రంలో 7 వేలకు పైగా ఉండవచ్చని అధికారుల అంచనా. రాష్ట్రంలో ఇలాంటి షాపుల గణనను చేపట్టే పనిలో బీఐఎస్ అధికారులున్నారు. హాల్‌మార్క్ అంటే.. ఆభరణాల బంగారంలో స్వచ్ఛత పాళ్లను తెలియజేసేదే హాల్‌మార్క్. నగలపై బంగారం స్వచ్ఛత, ముద్ర, హాల్‌మార్క్ వేసిన కేంద్రం పేరు, ఆభరణం తయారు చేసిన తేదీ, విక్రయించిన షాపు పేరు ఉంటాయి. ఆభరణం నాణ్యతలో తేడాలుంటే.. దీనిని బట్టి అది ఏ షాపులో కొనుగోలు చేసిందీ తెలిసిపోతుంది. ముద్ర లేజర్‌తో వేసింది కాబట్టి చెరిగిపోయే లేదా చెరిపేసే వీలుండదు. శిక్ష, జరిమానాలు తప్పవు జూన్ 1 నుంచి జ్యుయలరీ షాపుల్లో హాల్‌మార్క్ ఆభరణాలనే విక్రయించాలి. ఈలోగా దుకాణాల వారు బీఐఎస్ నుంచి హాల్‌మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకుని సర్టిఫికేషన్ పొందాలి. దీనిపై జ్యుయలరీ అసోసియేషన్ల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నాం. హాల్‌మార్క్ లేని ఆభరణాలు విక్రయిస్తే జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదు. – ఆర్.తిరుమలరావు, సైంటిస్ట్–డి, బీఐఎస్ -
జూన్ నుంచి గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలు, కళాఖండాలపై 2021 జూన్ 1 నుంచీ హాల్‌మార్కింగ్ తప్పనిసరి అని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది. విలువైన మెటల్‌కు సంబంధించి ప్యూరిటీ సర్టిఫికేషన్ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందని వెర్చువల్‌గా జరిగిన ఒక విలేకరుల సమావేశంలో వినియోగ వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్ పేర్కొన్నారు. 2019 నవంబర్‌లో కేంద్రం చేసిన ప్రకటన ప్రకారం, పసిడి ఆభరణాలు, కళాఖండాలపై 2021 జనవరి 15 నుంచీ హాల్‌మార్కింగ్ తప్పనిసరి. హాల్‌మార్కింగ్ విధానంలోకి మారడానికి, ఇందుకు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెర్డ్స్ (బీఐఎస్)తో తమకుతాము రిజిస్ట్రర్ కావడానికి ఆభరణాల వర్తకులకు ఏడాదికి పైగా సమయం ఇచ్చింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో హాల్‌మార్కింగ్ విధానం అమలుకు వర్తకులు చేసిన విజ్ఞప్తి చేశారు. -
జూన్ 1 తర్వాత ఆ బంగారం అమ్మలేరు
ఇక జూన్ 1 నుంచి బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. హాల్‌మార్క్ లేకుండా బంగారు ఆభరణాలను 1 జూన్ 2021 తర్వాత అమ్మలేము. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) రిజిస్టర్డ్ జ్యువెలర్స్ అందరికీ ఆదేశాలు జారీ చేసింది. 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లు గల బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్‌మార్క్ ఉండాలని పేర్కొంది. దీనివల్ల కస్టమర్, స్వర్ణ కారుడు ఇద్దరూ ప్రయోజనం పొందుతారని తెలిపింది. బంగారం నాణ్యత గురించి ఇరు వర్గాలకు ఎటువంటి సందేహం ఉండదని పేర్కొంది. ఇప్పటి వరకు బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పని సరికాదు. కానీ, ప్రభుత్వం గతంలో 15 జనవరి 2021 లోపు బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ ఉండాలని పేర్కొంది. జ్యువెలర్స్ అసోసియేషన్ డిమాండ్ మేరకు ఆ గడువును 2021 జూన్ 1కి పెంచారు. ఆభరణాల హాల్‌మార్కింగ్ ప్రక్రియలో బీఐఎస్ ఎ అండ్ హెచ్ సెంటర్లో నాణ్యతను తనిఖీ చేస్తాయి. ఇక్కడ పరీక్షించిన తర్వాత ఎ అండ్ హెచ్ సెంటర్లో ఆభరణాలపై హాల్‌మార్క్‌ను ముద్రిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పుడు ఇంటి నుంచి ఆన్లైన్లో చేయవచ్చు. దీనికోసం ఈ-బీఐఎస్(www.manakonline.in) వెబ్సైట్ కు వెళ్లండి. ఇక్కడ సంబంధిత పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత దరఖాస్తుదారుడు బీఐఎస్ రిజిస్టర్డ్ జ్యువెలర్ అవుతారు. బీఐఎస్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా చాలా తక్కువగా నిర్ణయించింది. ఒక ఆభరణాల టర్నోవర్ 5 కోట్ల కన్నా తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు 7500 రూపాయలు, రిజిస్ట్రేషన్ ఫీజు 5 వేల కోట్ల నుంచి 25 కోట్ల మధ్య వార్షిక టర్నోవర్‌కు 15 వేల రూపాయలు, 25 కోట్లకు పైగా టర్నోవర్‌కు 40 వేల రూపాయలు. ఒక ఆభరణాల టర్నోవర్ 100 కోట్లకు మించి ఉంటే, ఈ రుసుము 80 వేల రూపాయలుగా నిర్ణయించారు. చదవండి: బంగారం ధరలు మరింత తగ్గుతాయా?! -
జూన్ 1నుంచి బీఐఎస్ హెల్మెట్స్ తప్పనిసరి
న్యూఢిల్లీ, సాక్షి: వచ్చే ఏడాది(2021) జూన్ 1నుంచి దేశంలో బీఐఎస్ ప్రమాణాలు లేని హెల్మెట్ల తయారీ, విక్రయాలను నిషేధిస్తూ కేంద్ర రోడ్ రవాణా శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. ద్విచక్ర వాహనదారులను కొంతమేర ప్రమాదాల నుంచి రక్షించే యోచనలో భాగంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్నేళ్లుగా ఇందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చినట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. దేశంలో వార్షికంగా 1.7 కోట్ల ద్విచక్ర వాహనాలు తయారవుతున్నట్లు ఆటో రంగ విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా.. దేశీ పరిస్థితులకు అనుగుణంగా బీఐఎస్ ప్రమాణాలతో తేలికపాటి హెల్మెట్ల తయారీ, వినియోగానికి అనుమతించినట్లు నిపుణులు పేర్కొన్నారు. తలకు తగిలే గాయాలు రోడ్డు ప్రమాదాలలో 45 శాతం తలకు గాయాలవుతుంటాయని ఎయిమ్స్ ట్రౌమా సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ గుప్తా పేర్కొంటున్నారు. వీటిలో 30 శాతం తీవ్రంగా గాయపడిన సందర్భాలుంటాయని తెలియజేశారు. దేశీయంగా హెల్మెట్లకు బీఐఎస్ సర్టిఫెకెట్(ఐఎస్ఐ మార్క్)ను తప్పనిసరి చేయాలని కొంతకాలంగా రోడ్ రవాణా శాఖ ప్రయత్నిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సుమారు 44,000-56,000 మంది హెల్మెట్లను ధరించకపోవడంతో మరణించినట్లు అనధికార లెక్కలున్నట్లు ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. దేశీయంగా రోజూ 2 లక్షల హెల్మెట్లు విక్రయమవుతాయని ద్విచక్ర వాహన హెల్మెట్ల తయారీదారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజీవ్ కపూర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే వీటిలో అత్యధికం ప్రమాణాలులేనివే ఉంటాయని తెలియజేశారు. ప్రభుత్వం తీసుకురానున్న నిబంధనలతో వేలమంది ప్రాణాలకు రక్షణ లభించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
హెల్మెట్లకు బీఐఎస్ లేకుంటే జరిమానాలు
సాక్షి, అమరావతి: ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు స్టాండర్డ్ మార్క్ హెల్మెట్లనే ధరించాలని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండ్ హైవేస్ స్పష్టం చేసింది. బైక్‌లపై వెళ్లేటప్పుడు హెల్మెట్ విధిగా ఉండాలని, వాటికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాలు లేకుంటే భారీగా జరిమానాలు విధించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఫేస్ షీల్డ్తోనే ప్రయాణాలు చేస్తున్నారని, ప్రమాదం జరిగితే ఫేస్ షీల్డ్ తలకు సరైన భద్రత కల్పించలేకపోతుందని అందులో పేర్కొన్నారు. -
పసిడి నగలకు ‘హాల్‌మార్క్’
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్కింగ్ ధ్రువీకరణను 2021 జనవరి 15 నుంచి తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ శుక్రవారం ప్రకటించారు. ‘‘ఇందుకు సంబంధించి రాబోయే జనవరి 15న నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఆభరణాల వ్యాపారులు తమ వద్దనున్న హాల్‌మార్క్‌లేని ఆభరణాలను పూర్తిగా ఖాళీ చేసుకునేందుకు ఏడాది పాటు సమయం ఉంటుంది’’ అని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో నగల వర్తకులు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని, హాల్‌మార్క్‌తో కూడిన ఆభరణాలనే విక్రయించాల్సి ఉంటుందన్నారు. ‘‘విలువైన పసిడి విషయంలో స్వచ్ఛతకు హామీనివ్వడమే మా లక్ష్యం. చిన్న పట్టణాలు, గ్రామాల్లోని వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం’’ అని వివరించారు. 2000 ఏప్రిల్ నుంచి బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ను ధ్రువీకరించే పథకాన్ని బీఐఎస్ ఆచరణలోకి తీసుకొచ్చింది. కాకపోతే తప్పనిసరి చేయలేదు. దీంతో ప్రస్తుత ఆభరణాల్లో 40 శాతమే హాల్‌మార్క్‌వి ఉంటున్నాయి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఆభరణాల జోలికి తాము వెళ్లబోమని మంత్రి పాశ్వాన్ స్పష్టం చేశారు. హాల్‌మార్కింగ్ తప్పనిసరికి సంబంధించిన ముసాయిదా ఆదేశాలను అభిప్రాయాల కోసం ప్రపంచ వాణిజ్య మండలి (డబ్ల్యూటీవో) వెబ్సైట్లో అక్టోబర్ 10న ఉంచామని చెప్పారు. అభిప్రాయాలు తెలియజేసేందుకు 60 రోజుల గడువు ఉంటుందన్నారు. హాల్‌మార్కింగ్ మూడు రకాలు.. ఆభరణాల హాల్‌మార్కింగ్‌ను బీఎస్ఐ మూడు రకాలుగా వర్గీకరించింది. 14 కేరట్, 18 కేరట్, 22 కేరట్ ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఈ మూడు విభాగాల ధరలను ఆభరణాల విక్రేతలు తమ దుకాణాల్లో ప్రదర్శించడాన్ని కూడా తప్పనిసరి చేయనున్నట్టు పాశ్వాన్ తెలిపారు. బీఐఎస్ వద్ద నమోదైన ఆభరణాల వర్తకులు బీఐఎస్ లైసెన్స్ పొందిన అస్సేయింగ్ అండ్ హాల్‌మార్కింగ్ కేంద్రాల నుంచి హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 234 జిల్లాల పరిధిలో 877 హాల్‌మార్కింగ్ కేంద్రాలు నడుస్తున్నాయి. 26,019 మంది జ్యువెలర్లు బీఐఎస్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం రూ.లక్ష నుంచి ఆభరణాల విలువకు గరిష్టంగా ఐదు రెట్ల వరకు జరిమానాతోపాటు, బీఐఎస్ చట్టం కింద ఏడాది వరకు జైలుశిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని బీఐఎస్ అధికారి ఒకరు తెలిపారు. అన్ని జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా వర్తకుల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. -
మెట్రో వాటర్.. సూపర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌కు జలమండలి సరఫరా చేస్తున్న తాగునీరు అత్యంత స్వచ్ఛమైనదని బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) పరీక్షల్లో తేలింది. దేశంలోని 15 నగరాల నుంచి పది చొప్పున నీటి నమూనాలు తీసుకొని పరీక్షించింది. పదికి పది బాగుండడంతో ముంబై తొలి స్థానంలో నిలిచింది. ఒక్క నమూనా మాత్రమే ఫెయిలైన హైదరాబాద్, భువనేశ్వర్ రెండో స్థానంలో నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీ మాత్రం పదో స్థానానికి పరిమితమైంది. 2012లో బీఐఎస్ నోటిఫై చేసిన తాగునీటి ప్రమాణాల ప్రకారం 28 పారామీటర్లుగా తీసుకొని నమూనా పరీక్షలు చేశారు. చాలా వరకు ఫెయిలైన శాంపిల్స్‌లో ఎక్కువగా నీటిలో కరిగిన ఘన పదార్థాలు, మలినాలు, నీటి కాఠిన్యత, లవణీయత, లోహలు, నీటి నాణ్యతకు సంబంధించిన పారామీటర్లు ఉన్నాయి. నిలువ చేసి.. శుద్ధి చేసి కోటికిపైగా జనాభా ఉన్న నగరానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు జలమండలి ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. 9,80,000 నల్లా కలెక్షన్ల ద్వారా ప్రతిరోజూ 465 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. కృష్ణా, గోదావరితో పాటు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి నీటిని శుద్ధి చేసి నగరవాసులకు కుళాయిల ద్వారా అందిస్తోంది. ఏ కాలంలోనైనా నగరవాసులకు తాగునీటి తిప్పలు ఉండకూడదన్న ఉద్దేశంతో 500కు పైగా రిజర్వాయర్లలో మంచి నీటిని నిలువ చేస్తోంది. గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చిన నీటిని ఈ రిజర్వాయర్లలో నిలువ చేసి బ్లాస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తున్నారు. దీనిద్వారా నీటిలో ఉన్న హానికారక బ్యాక్టీరియ నశించి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు చేరుతోంది. ఇప్పటికే కుళాయిల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న జలమండలికి ఐఎస్వో ధ్రువీకరణ పత్రం అందింది. తాజాగా బీఎస్ఐ నమూనా పరీక్షల్లో హైదరాబాద్‌కు రెండో స్థానం దక్కడంతో జలమండలి ఎండీ దానకిశోర్ హర్షం వ్యక్తం చేశారు. -
బిట్కాయిన్లతో.. ఇంటర్నెట్కు ముప్పు: బీఐఎస్
జ్యూరిక్: బిట్కాయిన్ల వంటి డిజిటల్ కరెన్సీలతో ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయే ప్రమాదం పొంచి ఉందని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) హెచ్చరించింది. వీటివల్ల స్టోరేజీతో పాటు ప్రాసెసింగ్ సామర్థ్యాలపరమైన సమస్యలు తలెత్తుతాయని ఒక నివేదికలో పేర్కొంది. కంప్యూటర్స్ ద్వారా ప్రాసెస్ అయ్యే ఈ డిజిటల్ కరెన్సీల వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడం స్మార్ట్‌ఫోన్స్, సాధారణ కంప్యూటర్స్‌తో పాటు సూపర్ కంప్యూటర్స్కి కూడా అలవి కాని పరిస్థితి తలెత్తుతుందని, ఫలితంగా మొత్తం సర్వర్ల వ్యవస్థ అంతా నిల్చిపోయే ముప్పు ఉందని బీఐఎస్ తెలిపింది. సార్వభౌమ కరెన్సీలకు భిన్నమైన ఈ కరెన్సీలు విశ్వసనీయమైనవి కావని పేర్కొంది. వివిధ దేశాల రిజర్వ్ బ్యాంకులన్నింటికీ సెంట్రల్ బ్యాంకుగా బీఐఎస్‌ను పరిగణిస్తారు. ప్రస్తుతం 1.7 కోట్ల బిట్కాయిన్లు చలామణీలో ఉన్నాయి. బిట్కాయిన్ల వ్యవస్థలో ఈ సంఖ్య 2.1 కోట్లకు మించడానికి లేదు. కొన్నేళ్ల క్రితం కేవలం కొన్ని సెంట్స్ స్థాయిలో ఉన్న బిట్‌కాయిన్ విలువ గతేడాది ఆఖర్లో ఏకంగా 19,500 డాలర్ల స్థాయికి ఎగిసింది. ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన వారిని కుబేరులుగా మార్చేసింది. భారత్ సహా పలు దేశాల్లో వీటిపై ఆంక్షలు ఉన్నాయి. -
భారత్ బ్యాంకింగ్‌కు కష్టకాలమే!
బీఐఎస్ నిపుణుల అభిప్రాయం న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్‌కు రానున్నది కష్టకాలమేనని స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్థిక సేవల సంస్థ– బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) విడుదల చేసిన ఒక వర్కింగ్ పేపర్ అభిప్రాయపడింది. ప్రత్యేకించిరుణ వృద్ధి సమయంలో బ్యాంకులకు మూలధనం విషయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. మూలధనం తగిన స్థాయిలో ఉన్న బ్యాంకుల విషయంలో మాత్రం ఇబ్బందులు కొంత తక్కువగాఉంటాయని తెలియజేసింది. ఇక ప్రైవేటు రంగం విషయంలో మొండిబకాయిల సమస్యను నివేదిక ప్రస్తావిస్తూ... వడ్డీరేట్ల మార్పుల సందర్భాల్లో ఆయా ప్రైవేటు బ్యాంక్ ద్రవ్య పరిస్థితులు ఒడిదుడుకుకు గురయ్యేవీలుందని అభిప్రాయపడింది. కాగా వర్కింగ్ పత్రాన్ని ఆర్బీఐకి చెందిన పల్లవి చవాన్, బీఐఎస్‌లో ఆర్థిక నిపుణులు లియోనార్డో సంయుక్తంగా రూపొందించారు. విశ్లేషణాపత్రంలోని అభిప్రాయాలు కేవలం వీరిగానేభావించాలని బాసిల్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ బ్యాంకింగ్ రెగ్యులేటర్– బీఐఎస్ వివరించింది. -
మినరల్ వాటర్ తాగుతున్నారా..? జరభద్రం..!
సాధారణంగా రోడ్డుపై వెళుతున్నప్పుడు దాహం వేస్తే ఏం చేస్తాం? దగ్గర్లో ఉన్న స్టోర్‌లో వాటర్ ప్యాకెట్ కొంటాం. ఎక్కువ మంది ఉంటే వాటర్ బాటిల్ కొని నీళ్లు తాగుతాం. కానీ, ఇక ముందు అలా చేయొద్దని జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ రీసెర్చ్ హెచ్చిరిస్తోంది. వాటర్ బాటిళ్లలో నిల్వ ఉంచే నీరుపై చేసిన పరిశోధనలో.. ఆ నీటిలో కొలీఫాం బాక్టీరియా ఉంటున్నట్లు తెలిపింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అమ్మకానికి పెడుతున్న దాదాపు 20 రకాల వాటర్ బాటిళ్లను ఘజియాబాద్ నేషనల్ టెస్ట్ హౌస్ లో నిర్వహించిన పరీక్షల్లో బాటిళ్లలో ఈ విషయాన్ని కనుగొన్నారు. దీంతో స్పందించిన ఇండియన్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అనుమతులు లేకుండా నడుపుతున్న కంపెనీలపై చర్యలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్ రూ.1,500 కోట్లకు చేరింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ బిజినెస్ స్టాండర్డ్స్(బీఐఎస్)కు ఈ మేరకు భారీగా ఫిర్యాదులు చేరినట్లు తెలిపింది. ప్రముఖ ఆహార సంస్థలే అక్రమంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లను నడుపుతున్నట్లు కూడా ఫిర్యాదులు వచ్చాయి. బీఐఎస్ హాల్‌మార్క్ లేకుండా ఈ కంపెనీలు నీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఏయే చర్యలు తీసుకున్నాయో? ఇప్పటివరకు ఎన్ని ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారనే సమాచారన్ని తమకు అందించాలని బీఐఎస్ ఆదేశించింది. ప్రస్తుతం దేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో అధికారులు వాటర్ అందించే సంస్థలకు లైసెన్స్ ఇచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. గతేడాది ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం దేశం మొత్తంలో 6,513 ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీలకు లైసెన్స్ లు జారీ అయ్యాయి.