ఎలక్ట్రిక్ వాహనాల్లో సేఫ్టీ కోసం కొత్త స్టాండర్డ్స్: బీఐఎస్ | Bureau Of Indian Standards Introduces 2 New Standards | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్ వాహనాల్లో సేఫ్టీ కోసం కొత్త స్టాండర్డ్స్: బీఐఎస్

Published Tue, Jun 25 2024 6:22 PM | Last Updated on Tue, Jun 25 2024 6:47 PM

Bureau of Indian Standards Introduces 2 New Standards

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో.. వాహన తయారీ సంస్థలు కొత్త ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో భద్రతను పెంచడానికి 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' (BIS) రెండు కొత్త ప్రమాణాలను ప్రవేశపెట్టింది.

బీఐఎస్ ప్రవేశపెట్టిన రెండు కొత్త ప్రమాణాలలో ఒకటి 'IS 18590:2024'.. మరొకటి IS 18606:2024. అన్ని వర్గాల ఎలక్ట్రిక్ వాహనాల్లో భద్రతను పెంచడమే లక్యంగా వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కంపెనీలు ఉత్పత్తి చేసే వాహనాల్లో మరింత భద్రతను పెంచాలని బీఐఎస్ ప్రమాణాలు చెబుతున్నాయి.

కారులో ప్రయాణికుల సేఫ్టీ మాత్రమే కాకుండా.. బ్యాటరీల భద్రతకు కూడా పెద్దపీట వేయాలని బీఐఎస్ చెబుతోంది. ప్రస్తుతం దేశంలో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ మాత్రమే కాకుండా పెద్ద ట్రక్కులు, రిక్షాలు మొదలైనవన్నీ కూడా ఈవీల రూపంలో లభిస్తున్నాయి. కాబట్టి వీటి వినియోగం కూడా ఎక్కువవుతోంది.

బీఐఎస్ IS 18294:2023 ప్రమాణాల ప్రకారం.. కంపెనీలే వాహనాలకు ప్రత్యేకంగా భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేస్తాయి. ఇవన్నీ వాహన నిర్మాణం, కార్యాచరణ వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. కొత్త భద్రతా ఫీచర్స్ అన్నీ కూడా డ్రైవర్లు మరియు ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయి.

కొత్తగా అమలులోకి ప్రవేశపెట్టిన కొత్త భద్రతా ప్రమాణాలతో కలిపి మొత్తం 30 బీఐఎస్ భారతీయ ప్రమాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన, సమర్థవంతమైన రవాణా వ్యవస్థకు నడపడంలో ఈ ప్రమాణాలు చాలా కీలకమైనవిగా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement