Bureau of Indian Standards
-
ఎలక్ట్రిక్ వాహనాల్లో సేఫ్టీ కోసం కొత్త స్టాండర్డ్స్: బీఐఎస్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో.. వాహన తయారీ సంస్థలు కొత్త ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో భద్రతను పెంచడానికి 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' (BIS) రెండు కొత్త ప్రమాణాలను ప్రవేశపెట్టింది.బీఐఎస్ ప్రవేశపెట్టిన రెండు కొత్త ప్రమాణాలలో ఒకటి 'IS 18590:2024'.. మరొకటి IS 18606:2024. అన్ని వర్గాల ఎలక్ట్రిక్ వాహనాల్లో భద్రతను పెంచడమే లక్యంగా వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కంపెనీలు ఉత్పత్తి చేసే వాహనాల్లో మరింత భద్రతను పెంచాలని బీఐఎస్ ప్రమాణాలు చెబుతున్నాయి.కారులో ప్రయాణికుల సేఫ్టీ మాత్రమే కాకుండా.. బ్యాటరీల భద్రతకు కూడా పెద్దపీట వేయాలని బీఐఎస్ చెబుతోంది. ప్రస్తుతం దేశంలో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ మాత్రమే కాకుండా పెద్ద ట్రక్కులు, రిక్షాలు మొదలైనవన్నీ కూడా ఈవీల రూపంలో లభిస్తున్నాయి. కాబట్టి వీటి వినియోగం కూడా ఎక్కువవుతోంది.బీఐఎస్ IS 18294:2023 ప్రమాణాల ప్రకారం.. కంపెనీలే వాహనాలకు ప్రత్యేకంగా భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేస్తాయి. ఇవన్నీ వాహన నిర్మాణం, కార్యాచరణ వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. కొత్త భద్రతా ఫీచర్స్ అన్నీ కూడా డ్రైవర్లు మరియు ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయి.కొత్తగా అమలులోకి ప్రవేశపెట్టిన కొత్త భద్రతా ప్రమాణాలతో కలిపి మొత్తం 30 బీఐఎస్ భారతీయ ప్రమాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన, సమర్థవంతమైన రవాణా వ్యవస్థకు నడపడంలో ఈ ప్రమాణాలు చాలా కీలకమైనవిగా ఉంటాయి.BIS just upped the safety game for EVs with new standards focusing on powertrains and batteries.This means more secure #electric cars, bikes, and even #rickshaws!BIS is passionate about making #EVs a safe and #sustainable way to travel.#IndianStandards @jagograhakjago pic.twitter.com/sbM8pkzqk8— Bureau of Indian Standards (@IndianStandards) June 25, 2024 -
ఫ్యాన్సీ మాస్క్‌లు వాడుతున్నారా..అయితే ప్రమాదం
న్యూఢిల్లీ: కరోనా నుంచి రక్షణ పొందాలంటే మాస్క్ వాడాల్సిందే. సెకండ్ వేవ్‌లో డబుల్ మాస్క్ వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల మాస్క్‌లను వాడుతున్నారు. ఈ విధంగా ఫ్యాన్సీ మాస్క్‌ల వాడటంపై ఢిల్లీ హైకోర్టులో ఓ ఫిటిషన్ దాఖలైంది. మాస్క్‌ల అమ్మకంపై ఓ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని జై ధార్ గుప్తా అనే పిటిషనర్ ఫిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఫిటిషన్ను గురువారం ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. మాస్క్‌ల తయారీ, అమ్మకాలకు సంబంధించిన నియమ నిబంధనలు అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం ఈ ఫిటిషన్ను విచారించారు. అయితే ఢిల్లీ ప్రభుత్వ స్టాండింగ్ న్యాయవాది సంతోష్ కె త్రిపాఠి ఈ ఫిటిషన్ను వ్యతిరేకించారు. మాస్క్‌ల తయారీ, అమ్మకం ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఇప్పటికే నిర్దేశించిందని ఆయన కోర్టుకు తెలిపారు. కాగా పిటిషనర్ జై ధార్ గుప్తా ఫ్యాన్సీ మాస్క్‌లను ధరించడం ఓ ధోరణిగా మారిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సింగిల్ లేయర్ మాస్క్‌లు అంత సురక్షితం కాదన్నారు. (చదవండి: నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు) -
తెలంగాణకు మరో అరుదైన గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. టీఎస్ఐపాస్ ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్లను జారీ చేయడంలో దేశంలోనే ఇతరులకన్నా ముందున్న తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖకు ప్రతిష్టాత్మక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అవార్డు దక్కింది. ఈ మేరకు సోమవారం మింట్ కాంపౌండ్‌లో ఆ విభాగం ప్రధాన అధికారి ఏజీ రమణప్రసాద్ విలేకరులకు వెల్లడించారు. ‘నాణ్యత నిర్వహణ వ్యవస్థ ధృవీకరణ లైసెన్స్’ను పొంది న తొలి రాష్ట్రం మనదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి చేతుల మీదుగా ఇటీవలే ఈ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. ఈ తరహా లైసెన్స్ తెలంగాణలోని ఏ ప్రభుత్వ శాఖ కూడా ఇప్పటి వరకు పొందలేదన్నారు. కేవలం ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి కార్యాలయానికే కాకుండా నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌సిటీ, నిజామాబాద్ కార్యాలయాలకు కూడా ఈ గుర్తింపు దక్కిందని స్పష్టం చేశారు. తెలం గాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆన్లైన్ విధానం అమలు చేయడం, టీఎస్ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సకాలంలో అనుమతులు జారీ చేయడం, విద్యుత్ వినియోగం, ప్రమాదాల నివారణ, నిర్దేశిత సమయంలోనే పరిశ్రమలకు కనెక్షన్లు మంజూరు చేయడం, ధ్రువీకరణ పత్రాల జారీ వంటి విషయంలో దేశంలోనే తెలంగాణ విద్యుత్ తనిఖీశాఖ ముందుందని, సీఎం కేసీఆర్ చొరవ, ఉద్యోగుల సమష్టికృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు.టీఎస్ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను సమర్థంగా పరిశీలించినందుకు గుర్తింపుగా గతేడాది జనవరిలో అత్యుత్తమ ప్రదర్శన అవార్డు దక్కిందని, ఎత్తైన భవనాల్లో భద్రతను పెంచడంలో కృషిచేసినందుకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇటీవలే బహుమతిని ఇచ్చి సత్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. -
బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్‌కు చట్టబద్ధత!
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల నాణ్యతను ధృవీకరించే హాల్మార్కింగ్కి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) చట్టానికి సవరణలు చేయాలని భావిస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. అయితే, హాల్‌మార్కింగ్ ప్రక్రియ స్వచ్ఛందంగా పాటించేలా ఉంచాలా లేక తప్పనిసరి చేయాలా అన్న అంశంపై నిర్ణయమేదీ తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. బీఐఎస్ చట్ట సవరణల్లో మార్పుల విషయంలో సంబంధిత వర్గాలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఆభరణాలు విక్రయించే సంస్థలు వివిధ క్యారట్ల బంగారం, వాటి రేట్ల గురించి కొనుగోలుదారులకు అసలు తెలియజేస్తున్నారా లేదా అన్న అంశం గురించి ఆయన ఆరా తీశారు. ‘నేను 18-24 క్యారట్ల స్వచ్ఛత బంగారం గురించే విన్నాను. 9 క్యారట్ల బంగారం కూడా ఉంటుందన్నది నాకు తెలియదు’ అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని బీఐఎస్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణపై మరింతగా దృష్టి పెట్టాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారులకు సూచించారు. 18-24 క్యారట్స్ ఆభరణాలు మాత్రమే బీఐఎస్ సర్టిఫై చేయాలంటూ తమ శాఖకు సూచనలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో దీనిపై బీఐఎస్ నివేదిక ఇచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. బంగారు ఆభరణాల స్వచ్ఛత గురించి ధృవీకరించేలా 2000 ఏప్రిల్ నుంచి బీఐఎస్ హాల్‌మార్కింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. దీని కింద జ్యుయెలర్లు తమ ఆభరణాలను హాల్‌మార్కింగ్ చేసేందుకు బీఐఎస్ నుంచి లెసైన్సు పొందాల్సి ఉంటుంది. -
చౌక ట్యాబ్స్ హల్చల్
న్యూఢిల్లీ: చౌక ట్యాబ్లెట్ పీసీల హవాతో భారత్‌లో ట్యాబ్ అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. 2013లో ఏకంగా 41.4 లక్షల ట్యాట్లెట్లు అమ్ముడయ్యాయని రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. అంతక్రితం ఏడాది 26.6 లక్షల ట్యాబ్ విక్రయాలతో పోలిస్తే 56.4 శాతం ఎగబాకినట్లు తెలిపింది. 2013 అమ్మకాల్లో శామ్సంగ్ 18.7 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో మైక్రోమ్యాక్స్(8.9 శాతం వాటా), యాపిల్(7.5% వాటా) ఉన్నాయి. గతేడాది అక్టోబర్-డిసెంబర్ కాలంలో 7.51 లక్షల ట్యాబ్లెట్లు అమ్ముడైనట్లు ఐడీసీ పేర్కొంది. కాగా, 2013 ప్రథమార్ధంలో ట్యాబ్స్ అమ్మకాల దూకుడుతో పోలిస్తే... ద్వితీయార్ధంలో తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. ఈ ఏడాది అమ్మకాల వృద్ధి పెద్దగా ఉండకపోవచ్చనేది ఐడీసీ అంచనా. ప్రభుత్వం ట్యాబ్లెట్లకు సైతం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ధ్రువీకరణను తప్పనిసరి చేస్తుండటం, ఫాబ్లెట్ల(మొబైల్+ట్యాబ్లెట్ ఫీచర్స్) హల్చల్తో ట్యాబ్‌ల జోరుకు కొంత బ్రేకులు పడనున్నాయని ఐడీసీ రీసెర్చ్ మేనేజర్ కిరణ్ కుమార్ చెప్పారు. అయితే, ఆర్థిక సేవలు, మీడియా, హెల్త్‌కేర్, విద్య తదితర రంగాల్లో ట్యాబ్లెట్ వినియోగదారుల వృద్ధి బాగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
మొబైల్ ఫోన్లకూ ధ్రువీకరణ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక పూట తిండి లేకున్నా ఉండగలం. కానీ మొబైల్ ఫోన్ లేకుంటే.. ఊహించుకోవడానికే మనసొప్పడం లేదు కదూ!!. అంతలా మనిషి జీవితం సెల్‌ఫోన్ మయమైపోయింది. మరి అలాంటి ఫోన్ నాణ్యత ఏ పాటిదో ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే టెలికం శాఖ ఒకడుగు ముందుకేసి నాణ్యణ ప్రమాణాలు రూపొం దించే పనిలో పడింది. సెల్ఫోన్ల భద్రత, పనితీరు ఆధారంగా ధ్రువీకరణ ఇవ్వాలని యోచిస్తోంది. ఈ విషయమై టెలికం ఇంజనీరింగ్ సెంటర్(టీఈసీ), బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ప్రతి నిధులతో ఇప్పటికే టెలికం శాఖ చర్చించింది. భారత టెలిగ్రాఫ్ చట్టాన్ని సవరించటమా? లేక బీఐఎస్ ద్వారా ప్రమాణాలను ప్రకటించటమా? అనేది యోచిస్తోంది. ప్రతిపాదిత ప్రమాణాలు అమల్లోకి వస్తే మరింత నాణ్యమైన సెల్ఫోన్లు తయారవుతాయి. 2012-13లో రూ.25,800 కోట్ల విలువైన సెల్ఫోన్లను భారత్ దిగుమతి చేసుకుంది. దేశం మొత్తమ్మీద ఏడాదికి 25 కోట్ల సెల్ఫోన్లు అమ్ముడవుతున్నాయి. బీఐఎస్ పరిధిలోకే.. ఎలక్ట్రానిక్స్, ఐటీ గూడ్స్ ఆర్డర్-2012 ప్రకారం ఎలక్ట్రానిక్ వీడియో గేమ్స్, ల్యాప్‌టాప్, నోట్‌బుక్, ట్యాబ్లెట్ పీసీలు. 32 అంగుళాలు, ఆపైన సైజున్న ప్లాస్మా, ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు. ఆప్టికల్ డిస్క్ ప్లేయర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, విజువల్ డిస్ప్లే యూనిట్లు, వీడియో మానిటర్లు, ప్రింటర్లు, ప్లాటర్లు, స్కానర్లు, వైర్లెస్ కీబోర్డులు, టెలిఫోన్ ఆన్సరింగ్ మెషీన్లు, యాంప్లిఫయర్లు, ఎలక్ట్రానిక్ మ్యూజికల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ క్లాక్స్, సెట్ టాప్ బాక్సులు వంటి 15 రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు బీఐఎస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వీటిని కంపెనీలు బీఐఎస్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం తయారు చేయాలి. 2014 జనవరి3 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. వీటిలానే మొబైల్ ఫోన్లకూ ప్రమాణాలను రూపొందించే పనిలో బీఐఎస్ వర్గాలు ఇప్పటికే నిమగ్నమయ్యాయి. టెలికం శాఖ, టీఈసీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రమాణాలను నిర్దేశిస్తామని బీఐఎస్ వెల్లడించింది. కాగా ఈ ప్రమాణాలు ఆహ్వానించదగ్గవని, కస్టమర్లకు నాణ్యమైన మొబైల్ ఫోన్లు లభిస్తాయని సెల్కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. చైనా చవక ఉత్పత్తులకు, నల్ల బజారులో లభించే సెల్ఫోన్లకు అడ్డుకట్ట పడుతుందన్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం రిజిస్టర్ అయిన ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయా లేవా అని ఎప్పటికప్పుడు బీఐఎస్ పరీక్షిస్తుంటుంది. మార్కెట్లో శాంపిళ్లను సేకరించి బీఐఎస్ అనుమతి ఉన్న టెస్టింగ్ ల్యాబ్‌లకు పంపిస్తారు. నాణ్యత లోపించినట్టు తేలితే ఉత్పత్తులను సీజ్ చేస్తారు. ఈ వివరాలను బీఐఎస్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. -
స్వర్ణం స్వచ్ఛతకు భరోసా
న్యూఢిల్లీ: ఇటు వినియోగదారులకు అటు నగల వర్తకులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ప్యూరిటీకి సంబంధించిన గోల్డ్ హాల్‌మార్కింగ్ ఫీజును చిన్న పట్టణాల్లో తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్యూరిటీ సర్టిఫికేషన్‌తో ప్రతి ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వడానికి ఒక వ్యవస్థను సైతం ఆవిష్కరిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. స్వచ్ఛమైన బంగారం అమ్మకాలను ప్రోత్సహించడం, ఇందుకు అనుగుణంగా హాల్‌మార్కింగ్ విధానాన్ని విస్తృతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక చొరవలను తీసుకుంది. ఆహారం, వినియోగ వ్యవహారాల మంత్రి కేవీ థామస్ ఈ అంశాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు... ఆభరణాల వర్తకులకు హాల్‌మార్కింగ్ లెసైన్స్ ఫీజును 87.5% వరకూ తగ్గించింది. దేశ వ్యాప్తం గా ఆభరణాల వర్తకులు అందరికీ ప్రస్తుతం గోల్డ్ హాల్‌మార్కింగ్ ఫీజు మూడేళ్లకు రూ.20,000 వరకూ ఉంది. తాజా తగ్గింపుతో ఈ ఫీజు చిన్న పట్టణాల్లో రూ.2,500కు తగ్గనుంది. మూడు లక్షలకన్నా తక్కువ జనాభా ఉన్న ప్రదేశాలను చిన్న పట్టణాలుగా పరిగణించడం జరుగుతుంది. 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న పట్టణాలకు మూడేళ్లకు హాల్‌మార్కింగ్ లెసైన్స్ ఫీజు రూ.5,000గా ఉంటుంది. నిజానికి బంగారం హాల్‌మార్కింగ్ ప్రస్తుతం తప్పనిసరికాదు. అయితే అధిక ఫీజు వల్ల హాల్‌మార్కింగ్‌కు లెసైన్స్ తీసుకోడానికి చిన్న పట్టణాల్లో ఆభరణాల వర్తకులు ముందుకు రావడం లేదు. ఈ కారణంగా వినియోగదారులకు సైతం నష్టం కలుగుతున్న పరిస్థితి ఉంది. ఈ ధోరణిని నివారించడానికే కేంద్రం తాజా ఫీజు తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఫీజు తగ్గింపుతోపాటు, సంబంధిత లెసైన్స్ పొందే ప్రక్రియ సైతం సులభతరం కానుంది. వినిమయ వ్యవహారాల మంత్రిత్వశాఖ కింద కార్యకలాపాలు నిర్వహించే ఇండియన్ స్టాండెర్డ్స్ బ్యూరో (బీఐఎస్)- హాల్‌మార్కింగ్, పర్యవేక్షణా విధానాలను పర్యవేక్షిస్తుంటుంది. ప్రస్తుతం హాల్‌మార్కింగ్ విధానం దక్షిణాదిలో ప్రాచూర్యం పొందినంతగా ఉత్తరాదిలో లేదు. హాల్‌మార్కింగ్ బంగారం ఆభరణాల విక్రయాలు దక్షిణాదిలో 70 నుంచి 80 శాతం ఉంటుండగా, ఉత్తరాదిలో 15 నుంచి 20 శాతం వరకూ మాత్రమే ఉంది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా 10 గ్రాములకు పైగా బరువున్న ప్రతి ఆభరణంపై ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ముద్రించే విధానాన్ని బీఐఎస్ ప్రవేశపెడుతోంది. ఆభరణాల వర్తకులకు లెసైన్సులను బీఐఎస్ మం జూరు చేస్తుంది. బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన ఆభరణాల వర్తకులు తమ హాల్‌మార్క్‌ను సంబంధింత 250 నిర్ధారణ కేంద్రాల నుంచి పొందొచ్చు. ఆభరణంపై గుర్తింపు సంఖ్యను ఇవ్వడానికి సంబంధించిన ప్రక్రియను బీఐఎస్ ఒక ఐటీ కన్సల్టెంట్‌కు అప్పగిస్తుంది. ఈ నంబర్‌ను ఇవ్వడానికి 2 నుంచి 3 నెలలు పడుతుంది. ఈ ప్రత్యేక సంఖ్య ద్వారా ఒక ఆభరణం మొత్తం చరిత్రను... అంటే అసలు ఆభరణం తయారీదారు ఎవ్వరు? హాల్‌మార్కింగ్ సెంటర్ ఏమిటి? ప్యూరిటీ సంగతేమిటి? వంటివన్నీ తెలుసుకోవచ్చు. పరిశ్రమ, ఎగుమతిదారుల ప్రయోజనం, వ్యాపా రం పెంపుకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కూడా బీఐఎస్ నిర్ణయించింది.