ఫ్యాన్సీ మాస్క్‌లు వాడుతున్నారా..అయితే ప్రమాదం | Plea Says Fancy Covid Masks Not Good Court Seeks Delhi Govt Stand | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ మాస్క్‌లు వాడుతున్నారా..అయితే ప్రమాదం

Published Thu, May 27 2021 9:29 PM | Last Updated on Thu, May 27 2021 9:36 PM

Plea Says Fancy Covid Masks Not Good Court Seeks Delhi Govt Stand - Sakshi

న్యూఢిల్లీ: కరోనా నుంచి రక్షణ పొందాలంటే మాస్క్‌ వాడాల్సిందే. సెకండ్‌ వేవ్‌లో డబుల్‌ మాస్క్‌ వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల మాస్క్‌లను వాడుతున్నారు. ఈ విధంగా ఫ్యాన్సీ మాస్క్‌ల వాడటంపై ఢిల్లీ హైకోర్టులో ఓ ఫిటిషన్‌ దాఖలైంది. మాస్క్‌ల అమ్మకంపై ఓ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని జై ధార్ గుప్తా అనే పిటిషనర్  ఫిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఫిటిషన్‌ను గురువారం ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. మాస్క్‌ల తయారీ, అమ్మకాలకు సంబంధించిన నియమ నిబంధనలు అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. 

ప్రధాన న్యాయమూర్తి డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌​ జ్యోతి సింగ్‌ ధర్మాసనం ఈ ఫిటిషన్‌ను విచారించారు. అయితే ఢిల్లీ ప్రభుత్వ స్టాండింగ్‌ న్యాయవాది సంతోష్‌ కె త్రిపాఠి ఈ ఫిటిషన్‌ను వ్యతిరేకించారు. మాస్క్‌ల తయారీ, అమ్మకం ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఇప్పటికే నిర్దేశించిందని ఆయన కోర్టుకు తెలిపారు. కాగా పిటిషనర్ జై ధార్ గుప్తా ఫ్యాన్సీ మాస్క్‌లను ధరించడం ఓ ధోరణిగా మారిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ సింగిల్‌ లేయర్‌ మాస్క్‌లు అంత సురక్షితం కాదన్నారు.

(చదవండి: నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement