హైదరాబాద్‌లో బీఐఎస్ అత్యాధునిక ల్యాబరేటరీ ప్రారంభం | BIS Laboratory Inauguration in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో బీఐఎస్ అత్యాధునిక ల్యాబరేటరీ ప్రారంభం

Jan 28 2025 4:59 PM | Updated on Jan 28 2025 5:29 PM

BIS Laboratory Inauguration in Hyderabad

భారతీయ ప్రమాణాల రూపకల్పన, నాణ్యత నిర్ధారణలో కీలకపాత్ర పోషిస్తున్న బీఐఎస్, అత్యాధునిక పరీక్షా కేంద్రాల పెంపుతో మరింత పటిష్టమవుతోందని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ, ఐఎఎస్ తెలిపారు.

మౌలాలిలోని బీఐఎస్ హైదారాబాద్ శాఖా కార్యాలయంలో వస్త్ర ఉత్పత్తులు, బంగారు ఆభరణాల పరీక్షా కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన వస్తువులను వినియోగదారులకు చేర్చేందుకు, అన్నీ ఉత్పత్తులు ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇప్పటికే 750కి పైగా వస్తువులు తప్పనిసరి ప్రమాణాలు అమలు జాబితాలో ఉన్నాయని, రానున్న రోజుల్లో ప్రతీ వస్తువునూ ఇందులో చేర్చి ప్రమాణాలు పక్కగా అమలు అయ్యేందుకు చూస్తామన్నారు. వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. డిజిటల్ వేదికలపై ప్రమాణాలకు సంబంధించిన అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చాం అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఐఎస్ ప్రయోగశాల డీడీజీ నిషాద్, దక్షిణ విభాగం డీడీజీ మీనాక్షి, హైదారాబాద్ శాఖా డైరెక్టర్ పీవీ శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement