సాక్షి, హైదరాబాద్: భారతీయ ప్రమాణాలు, నాణ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యా సంస్థల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఏర్పాటు చేసిన స్టాండర్డ్స్ క్లబ్బుల ద్వారా విస్తృత ప్రయోజనాలున్నాయని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణలోని పలు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో బీఐఎస్ ఏర్పాటు చేసిన రెండురోజుల శిక్షణ సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లో ముగిసింది.
సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథులుగా సాంకేతిక విద్య బోర్డు కార్యదర్శి పుల్లయ్య, బీఐఎస్ సౌత్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ యూఎస్‌పీ యాదవ్, సాంకేతిక విద్యాశాఖ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ఏ. స్వామి హాజరయ్యారు. ఈ సమావేశంలో స్వామి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు మెరుగైన భవితను అందించే ఇలాంటి కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు.
భారతీయ ప్రమాణాలు, నాణ్యతపై విద్యార్థి దశలోనే స్పష్టమైన అవగాహన కల్పించడం ద్వారా నాణ్యమైన సమాజం ఏర్పడుతుందని స్వామి అభిప్రాయపడ్డారు. అనంతరం బీఐఎస్ డీడీజీఎస్ యూఎస్‌పీ యాదవ్ మాట్లాడుతూ మన నిత్య జీవితంలో కీలక భూమిక వహిస్తున్న భారతీయ ప్రమాణాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు బీఐఎస్ విస్తృత కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగానే బీఐఎస్ స్టాండర్డ్స్ క్లబ్బులు విద్యార్థుల్లో కొత్త నైపుణ్యాల్ని రూపొందించేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు.
ఇదీచదవండి..కాళేశ్వరంపై ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం
Comments
Please login to add a commentAdd a comment