Standards
-
World Standards Day: ప్రమాణాల ప్రాధాన్యత తెలిపేందుకు..
మనం కొనుగోలు చేసే లేదా వినియోగించే ఏ వస్తువుకైనా నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి. వస్తు ప్రమాణీకరణకున్న ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, ప్రతి సంవత్సరం అక్టోబరు 14న ప్రపంచ ప్రమాణాల దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజున ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్ఓ)తో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ప్రమాణాల ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు నిపుణులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని పలు సూచనలు, సలహాలు అందజేస్తుంటారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రామాణీకరణ ప్రాముఖ్యత గురించి వినియోగదారులకు అవగాహన పెంచడమే ఈ దినోత్సవాన్ని జరుపుకోవడంలోని ముఖ్య ఉద్దేశ్యం. తొలిసారిగా ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని 1970లో నిర్వహించారు. ప్రామాణీకరణను సులభతరం చేయడానికి అంతర్జాతీయ సంస్థను రూపొందించాలని నిర్ణయించిన 25 దేశాల ప్రతినిధులు 1956లో సమావేశమయ్యారు. ఈ నేపధ్యంలోనే 1847లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్(ఐఎస్ఓ)ఏర్పాటయ్యింది.సామాజిక అసమతుల్యతలను పరిష్కరించడం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం లాంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఐఎస్ఓ ఏర్పాటయ్యింది. ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే.. భారతదేశంలో ప్రామాణీకరణ కార్యకలాపాలను సామరస్యపూర్వకంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో 1947 సంవత్సరంలో దీనిని స్థాపించారు. 1986లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ ద్వారా ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ పేరును బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌గా మార్చారు. ఈ సంస్థ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖల పరిధిలో పని చేస్తుంది.ఇది కూడా చదవండి: ఓలా.. అలా కుదరదు.. రిఫండ్ ఇవ్వాల్సిందే! -
రక్తం, గుండె..: ఈ వైద్య లెక్కల్ని ఎపుడైనా గమనించారా!
‘ఆరోగ్యమే..మహాభాగ్యం’ ఈ భాగ్యాన్ని దక్కించుకునేందుకు అందరూ కష్టపడుతూ ఉంటారు. చక్కటి జీవనశైలి, సమతుల ఆహారం, ఒత్తిడి, ఆందోళన జీవితం కోసం ఆరాట పడతారు. అయితే మానవ శరీర ఆరోగ్యానికి కావాల్సిన ప్రామాణికాలు ఏంటి? ఈ విషయంలో పురుషులకు, స్త్రీలకు మధ్య తేడా ఉంటుందా? మనిషి పల్స్ రేటు, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, ఊపిరి వేగం, బరువు ఈ ఐదింటిని ముఖ్యమైన అంశాలుగా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంచి ఆరోగ్యం అనేది పూర్తి శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు స్థితి. ఆరోగ్యం అంటే బలమైన రోగనిరోధకశక్తి, ఆహారం, అరుగుదల, రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర, ఎలాంటి అనారోగ్యం, ఆందోళన, ఒత్తిడి, శారీరక బాధలు లేని ప్రశాంతమైన జీవితం. స్త్రీలైనా, పురుషులైనా ఏవో కొన్ని తప్ప దాదాపు ఇవే ప్రమాణికాలు వర్తిస్తాయి. అదే మహిళల్లో అదనంగా రుతు సమస్యలు, గర్భధారణ సమస్యలు లేకుండా ఉండటం కూడా చాలా కీలకం.ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన వైద్య ప్రామాణికాలురక్తపోటు 120/80 ఉండాలి. పల్స్ 70-100 ఉండాలి. ఉష్ణోగ్రత 36.8-37 ఉండాలి.శ్వాసక్రియ రేటు 12-16 ఉండాలి. పురుషుల్లో హిమోగ్లోబిన్ 13.5-18 వరకు, అదే స్త్రీలలో అయితే 11.50-16 ఉండాలి.కొలెస్ట్రాల్ 130-200, పొటాషియం 3.5-5, సోడియం 135-145 ఉండాలి.ట్రై గ్లిజరైడ్స్ 220 లోపు ఉండాలి. శరీరంలో రక్తం పరిమాణం 5-6 లీటర్లు ఉండాలి.షుగర్ తినక ముందు పిల్లలకు 70-130, పెద్దలకు 70-110 మధ్య ఉండాలి.ఐరన్ 8-15 మి.గ్రా. ఉండాలి.తెల్ల రక్త కణాలు 4000-11000, ప్లేట్లెట్స్ 1.50 లక్షల నుంచి 4 లక్షలుఎర్ర రక్త కణాలు 4.5 - 6 మిలియన్లు ఉండాలి.క్యాల్షియం 8.6-10.3, విటమిన్ డీ-3 స్థాయి 20-511, విటమిన్ బి12 లెవల్స్ 200-900 వరకు ఉండాలి. -
మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఈ కంపెనీలకు కొత్త రూల్స్!
ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ సంవత్సరం కొత్త తయారీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, కంపెనీల ఉత్పత్తులను పరీక్షించి అవన్నీ సంతృప్తికరమైన ఫలితాలను పొందిన తరువాత మాత్రమే ప్రొడక్షన్, మార్కెట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫార్మా కంపెనీల మెటీరియల్స్, మెషీన్లు, ప్రాసెస్ వంటివన్నీ కూడా తప్పకుండా కొత్త ప్రమాణాలను అనుకూలంగానే ఉండాలని భారత ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల నాణ్యతకు తయారీదారు బాధ్యత వహించాలని పేర్కొంది. 50 బిలియన్ల పరిశ్రమ ప్రతిష్టతను కాపాడటానికి కర్మాగారాల పరిశీలనను మోదీ ప్రభుత్వం వేగవంతం చేసింది. కంపెనీల ఉత్పత్తులు నాణ్యమైనవిగా ఉన్నప్పుడు రోగులు ప్రమాదంలో పడే అవకాశం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థల ఉత్పత్తులను నిశితంగా పరీక్షించి, సంతృప్తికరమైన ఫలితాలను పొందినప్పుడే మార్కెట్ చేసుకోవాలని ఆదేశించారు. 2022 డిసెంబర్ నుంచి సుమారు 162 ఫార్మా కంపెనీలలో ఇన్కమింగ్ ముడి పదార్థాల టెస్టింగ్ లేకపోవడాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన అంతర్జాతీయ ఔషధాల తయారీ ప్రమాణాలను కలిగి ఉన్న కంపెనీలు భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ పెద్ద ఔషధ తయారీదారులు ఆరు నెలల్లోగా, చిన్న పరిశ్రమలు 12 నెలల్లోగా కొత్త ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ గడువు పెంచాలని, ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న కంపెనీలు ఈ కొత్త నిబంధనలను అనుసరించాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఖర్చు తీవ్రత ఎక్కువైతే దాదాపు సగం కంపెనీలు క్లోజ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
ప్రమాణాలపై అవగాహన అవసరం: బీఐఎస్ సదస్సులో వక్తలు
సాక్షి, హైదరాబాద్: భారతీయ ప్రమాణాలు, నాణ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యా సంస్థల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఏర్పాటు చేసిన స్టాండర్డ్స్ క్లబ్బుల ద్వారా విస్తృత ప్రయోజనాలున్నాయని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణలోని పలు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో బీఐఎస్ ఏర్పాటు చేసిన రెండురోజుల శిక్షణ సదస్సు శుక్రవారం హైదరాబాద్‌లో ముగిసింది. సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథులుగా సాంకేతిక విద్య బోర్డు కార్యదర్శి పుల్లయ్య, బీఐఎస్ సౌత్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ యూఎస్పీ యాదవ్, సాంకేతిక విద్యాశాఖ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ఏ. స్వామి హాజరయ్యారు. ఈ సమావేశంలో స్వామి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు మెరుగైన భవితను అందించే ఇలాంటి కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. భారతీయ ప్రమాణాలు, నాణ్యతపై విద్యార్థి దశలోనే స్పష్టమైన అవగాహన కల్పించడం ద్వారా నాణ్యమైన సమాజం ఏర్పడుతుందని స్వామి అభిప్రాయపడ్డారు. అనంతరం బీఐఎస్ డీడీజీఎస్ యూఎస్పీ యాదవ్ మాట్లాడుతూ మన నిత్య జీవితంలో కీలక భూమిక వహిస్తున్న భారతీయ ప్రమాణాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు బీఐఎస్ విస్తృత కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగానే బీఐఎస్ స్టాండర్డ్స్ క్లబ్బులు విద్యార్థుల్లో కొత్త నైపుణ్యాల్ని రూపొందించేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. ఇదీచదవండి..కాళేశ్వరంపై ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం -
రాబోయే వ్యాధులకు ముందే చెక్!
సాక్షి, హైదరాబాద్: మానవ కణజాల నమూనాల సంరక్షణ, విశ్లేషణ కోసం అంతర్జాతీయ ప్రమాణా లతో కూడిన అత్యాధునిక బయోబ్యాంక్‌ను ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసింది. 3 లక్షలకుపైగా జీవ నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ చేసేందుకు వీలుగా ఈ బయోబ్యాంక్‌లో మైనస్ 80 డిగ్రీల ఫ్రీజర్లు పదిహేను, మైనస్ 20 డిగ్రీల ఫ్రీజర్లు ఐదు, మైనస్ 160 డిగ్రీలతో కూడిన మూడు లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులు ఉన్నాయి. ఈ తరహా నిల్వ కేంద్రం ఏర్పాటు దక్షిణాదిలోనే మొదటిదిగా పేర్కొంటున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త డాక్టర్ లెరోయ్ హుడ్ ఈ బయోబ్యాంక్‌ను మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ బయో బ్యాంక్ అర్థవంతమైన పరిశోధనలకు, వ్యాధుల నివారణకు వీలు కల్పిస్తుందని.. అంతిమంగా అత్యాధునిక వైద్య విధానాల అభివృద్ధికి దోహదపడుతుందని హుడ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిస్టమ్స్, బిగ్ డేటా టూల్స్, మెషీన్ లెర్నింగ్ అల్గా రిథమ్‌ల మేళవింపుతో ఈ బయోబ్యాంక్ పనిచేస్తుందన్నారు. కేన్సర్, డయాబెటిస్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలు బయటపడక ముందే కచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యాన్ని సంతరించుకొనే క్రమంలో బయోబ్యాంక్ ఏర్పాటును మేలిమలుపుగా లెరోయ్ హుడ్ అభివర్ణించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ బయాలజీ ప్రెసిడెంట్, కో–ఫౌండర్ అయిన హుడ్... హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసిన ఆటోమేటెడ్ జీన్ సీక్వెన్సర్ను గతంలో కనుగొన్నారు. ఇదో మైలురాయి: ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి వైద్య పరిజ్ఞానాన్ని, ఆరోగ్య సంరక్షణలో పురోగతిని పెంపొందించే దిశగా బయోబ్యాంక్ ఓ మైలురాయి కాగలదని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశోధకులు, వైద్యులు, శాస్త్రవేత్తలకు కీలక వనరుగా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. తమ బయోబ్యాంక్‌కు 3 లక్షల కంటే ఎక్కువ నమూనాలను నిల్వ చేయగల సామర్థ్యం ఉందని వివరించారు. వ్యాధుల నివారణకు తోడ్పడే ఔషధ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి బయోబ్యాంక్ ఏర్పాటు సహకరిస్తుందని చెప్పారు. దీనిద్వారా వచ్చే 5–10 ఏళ్ల వరకు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది రోగులతోపాటు ఆరోగ్యకరమైన వ్యక్తుల వివరాలను సేకరించి వారి జీవ నమూనాలను విశ్లేషిస్తామని వివరించారు. వ్యాధుల నిర్ధారణ, నివారణలో విప్లవం... బయోబ్యాంక్ అనేది ఒక రకమైన నిల్వ సౌకర్యం. ఇది 3 లక్షల కంటే ఎక్కువ మానవ కణజాల నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ ఉంచగలదు. మానవ కణజాల నమూనాల నిల్వ, విశ్లేషణ ద్వారా ఇది జన్యు పరిశోధనలో సహాయ పడుతుంది. సంక్లిష్ట వ్యాధుల చికిత్స రానురానూ కష్టతరంగా మారుతున్న పరిస్థితుల్లో వ్యాధుల రాకను ముందే పసిగట్టే అద్భుతమైన అవకాశాన్ని ఇది అందిస్తుంది. దీనికోసం వ్యక్తుల కణజాల నమూనాలను సేకరిస్తారు. వాటిని నిల్వ చేసి పదేళ్లపాటు వారి ఆరోగ్య స్థితిగతుల్ని నిశితంగా పర్యవేక్షిస్తారు. ఆ సమయంలో ఆయా వ్యక్తుల్లో ఆరోగ్యపరంగా చోటుచేసుకున్న మార్పుచేర్పుల్ని, వ్యాధుల దాడిని, వాటికి కారణాలను పసిగట్టడం ద్వారా వారసుల ఆరోగ్య స్థితిగతుల్ని అంచనా వేస్తారు. అలాగే దాదాపుగా అదే కణజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తులందరికీ భవిష్యత్తులో వచ్చే వ్యాధులను కూడా పసిగట్టే అవకాశం లభిస్తుంది. తద్వారా వ్యాధి రావడానికి ముందే నివారణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలవుతుంది. -
మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ మేటి
సాక్షి, హైదరాబాద్: ఏ నగరమైనా వృద్ధిలోకి రావాలంటే అక్కడి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, ఈ విషయంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా శనివారం ఏర్పాటు చేసిన 2 రోజుల ‘టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో’ మూడవ ఎడిషన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెలు సమగ్ర, సమీకృత, సమ తుల్య వృద్ధిలో కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాలు ఇక్కడి రియల్ రంగాన్ని ఉన్నతస్థాయిలో నిలుపుతూ, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అయితే విశ్వనగరంగా నిరూపించుకోవడానికి ఈ వృద్ధి సరిపోదని తెలిపారు. 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో పూర్తి చేయబోతున్నామని, రానున్న పదేళ్లలో ఓఆర్ఆర్ చుట్టూ దాదాపు 415 కిలో మీటర్ల మెట్రో కోసం ప్రణాళికలు చేపడుతు న్నామని వెల్లడించారు. ముంబై తరువాత అతిపెద్ద 2వ స్కై స్క్రీపర్ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని, 57 అంతస్తులతో స్కై స్క్రీపర్స్ నిర్మించడానికి ఈ మధ్యనే హెచ్ఎండీఏ 12 అనుమతులను అందించిందని మంత్రి తెలిపారు. విశ్వనగరంగా మారాలంటే నగరం నలుమూలల్లో అభివృద్ధి జరగాలి. దీనికి రియల్ రంగం సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 40 నుంచి 45 శాతం హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి ఉంటుంది. అందుకే నగరాల వృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి ప్రత్యేకంగా కోరారు. టీఎస్, ఏపీ రెస్పాన్స్ హెడ్ కమల్ క్రిష్ణన్ మాట్లాడుతూ, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోకు విభిన్న వర్గాల నుంచి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. -
చెప్పులే ధరించాలి
సాక్షి, హైదరాబాద్: పరీక్షలకు హాజరయ్యేవారికి గురుకుల బోర్డు 28 రకాల నిబంధనలు విధించింది. ప్రధానంగా ఎగ్జామ్‌హాల్‌లోకి వచ్చే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే వేసుకొని రావాలని, బూట్లు ధరించిన అభ్యర్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 23వ తేదీ వరకు వరుసగా(సెలవులు మినహా) పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) విడుదల చేసింది. ఇప్పటివరకు 88 శాతం మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా, పరీక్ష సమయానికి గంటముందు వరకు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు టీఆర్‌ఈఐఆర్‌బీ కల్పించింది. ముందస్తుగా హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకుని నిబంధనలు పాటించాలని, పరీక్ష కేంద్రాలను ముందస్తుగా పరిశీలించుకుంటే ఇబ్బందులు ఉండవని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్యబట్టు తెలిపారు. అర్హత పరీక్షలు రోజుకు మూడు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 8.30 గంటల నుంచి 10.30 వరకు మొదటి సెషన్, రెండోసెషన్ మధ్యాహ్నం 12.30గంటల నుంచి 2.30గంటల వరకు, మూడోసెషన్ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉంటుంది. పరీక్ష సమయంకంటే గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తారు. పరీక్ష సమయం 15 నిమిషాల వరకు మాత్రమే గేట్లు తెరిచి ఉంచుతారు. ఆ తర్వాత గేట్లు మూసివేస్తారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రంలోకి అనుమతించరు. అధికారుల పరిశీలనలో సంతృప్తి చెందితేనే లోనికి పంపిస్తారు. అభ్యర్థులు తమ వెంట ఏదేని ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డు (పాస్‌పోర్టు, ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్) వెంట తీసుకెళ్లాలి. ఎగ్జామ్‌హాల్‌లోకి వెళ్లిన తర్వాత అభ్యర్థి బయోమెట్రిక్ సమాచారం సేకరిస్తారు. ప్రతి పరీక్ష 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు. నిర్దేశించిన గడువు తర్వాతే అభ్యర్థిని బయటకు పంపిస్తారు. ప్రతి అభ్యర్థి హాల్‌టికెట్ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌లో సాంకేతిక కారణాలతో ఫొటో ముద్రితం కాకుంటే ఒరిజినల్ ఫొటో అతికించి నిబంధనలకు అనుగుణంగా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి హాజరుకావాలి. బోర్డు కార్యాలయం వద్ద అభ్యర్థుల ఆందోళన పరీక్ష కేంద్రాల కేటాయింపు గందరగోళంగా జరిగిందంటూ కొందరు అభ్యర్థులు సోమవారం ఉదయం దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్‌లో ఆందోళనకు దిగారు. దాదాపు 50 మంది అభ్యర్థులు బోర్డు కార్యాలయ ఆవరణకు చేరుకుని అధికారులను నిలదీశారు. ఒక్కో పరీక్షకు ఒక్కోచోట కేంద్రం కేటాయించడం, సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో ప్రయాణించడం కత్తిమీద సాముగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు ప్రశాంతంగా ఎలా రాయగలమని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాల కేటాయింపులో అధికారులు, ఉద్యోగుల ప్రమేయం ఏమీ లేదని, అభ్యర్థులకు సర్దిచెప్పి పంపించారు. -
Andhra Pradesh: క్వాలిటీ వైద్యానికి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి: ‘ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం. ఇందులో భాగంగానే నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం కింద ఆస్పత్రుల బలోపేతానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. తద్వారా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్)కు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం’ అని మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభం సందర్భంగా 2020 ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలకు కార్యరూపం ఇస్తూ అడుగులు ముందుకు వేశారు. ఫలితంగా మన రాష్ట్రంలోని అత్యధిక ప్రభుత్వ ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాష్) గుర్తింపు దక్కింది. ఏకంగా 443 ప్రభుత్వాస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపుతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. 209 ఆస్పత్రులతో రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో కేరళ (134), నాలుగో స్థానంలో హరియాణ (121), ఐదో స్థానంలో తెలంగాణ (114) ఉన్నాయి. ఎన్‌క్వాష్ అంటే.. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 2016 నుంచి అత్యున్నత ప్రమాణాలతో రోగులకు నాణ్యమైన సేవలందించే ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాష్) గుర్తింపు ఇవ్వడం ప్రారంభించింది. ఆస్పత్రిలోకి రోగి అడుగు పెట్టినప్పటి నుంచి వైద్యం చేయించుకుని బయటకు వెళ్లేంత వరకు అన్ని స్థాయిల్లో సదుపాయాల కల్పనను పరిగణనలోకి తీసుకుంటారు. పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), జిల్లా ఆస్పత్రు(డీహెచ్)లకు ఎన్‌క్వాష్ గుర్తింపు ఇస్తారు. పీహెచ్‌సీల్లో 6 విభాగాల్లో 1,600 రకాల అంశాలను.. ఏరియా, సీహెచ్‌సీ, డీహెచ్‌లలో 18 విభాగాల్లో 6,625 అంశాలను పరిశీలిస్తారు. ఉదాహరణకు రోగి సింక్ వద్దకు వెళ్లి చేతులు కడుక్కునే తీరు, ఆహారం తీసుకునే విధానం, వారికి మందులు ఇచ్చే విధానం తదితర విషయాలన్నింటినీ క్షుణ్ణంగా గమనిస్తారు. ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, డయాగ్నోసిŠట్క్స్ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రోగులకు సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 70 శాతానికి పైగా పాయింట్లు సాధించిన ఆస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపు ఇస్తారు. అప్పట్లో 26 ఆస్పత్రులకే ఎన్‌క్వాష్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి నామ మాత్రంగా కేవలం 26 ఆస్పత్రులకు మాత్రమే ఎన్‌క్వాష్ గుర్తింపు ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తూ నాడు–నేడు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకాం చుట్టారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గడిచిన మూడున్నరేళ్లలోనే ఏకంగా 417 ఆస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపు లభించింది. వీటిలో 391 పీహెచ్‌సీలు, 25 సీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరి నెలలోగా 200 వరకూ వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లకు ఎన్‌క్వాష్ గుర్తింపు కోసం వైద్య శాఖ దరఖాస్తు చేయనుంది. కాగా, ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 1,142 పీహెచ్‌సీలను అభివృద్ధి చేయడం కోసం రూ.664.96 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో పాత భవనాలకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు, శిథిలావస్తలో ఉన్న పీహెచ్సీ భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఆస్పత్రులను అధునాతనంగా తీర్చిదిద్దారు. ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్, ఆస్పత్రిలో వసతులు లేదా గదులకు సంబంధించి సైన్ బోర్డులు, రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా జనరల్ వార్డులు, మరుగుదొడ్లు, ఆస్పత్రికి వచ్చిన రోగులు కూర్చోవడానికి కుర్చీలు ఇలా అన్ని రకాల వసతులు సమకూరాయి. ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి చేసింది అనేదానికి గత మూడున్నరేళ్లలో ఏకంగా 391 పీహెచ్‌సీలకు ఎన్‌క్వాష్ గుర్తింపు రావడమే నిదర్శనం అని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు, 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, పలు సూపర్ స్పెషాలిటీ, గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేస్తోంది. మానవ వనరుల కొరతకు చెక్ పెడుతూ వైద్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 47 వేలకు పైగా పోస్టులు భర్తీ చేపట్టారు. దీంతో 2019తో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన, ఇతర ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది బాగా పెరిగారు. ‘లక్ష్య’ గుర్తింపులో రెండో స్థానం మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన ప్రసూతి సేవలకుగాను ఇచ్చే ‘లక్ష్య’ గుర్తింపు విభాగంలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో గత నెలలో నిర్వహించిన జాతీయ స్థాయి ఎంసీహెచ్ వర్క్‌షాప్‌లో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య శాఖకు అవార్డు ప్రదానం చేసింది. ఆస్పత్రుల్లో ప్రసూతి సేవల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించే ఆస్పత్రులకు లక్ష్య గుర్తింపు వస్తుంది. నెలకు వంద, అంత కంటే ఎక్కువ ప్రసవాలు జరిగే ఆస్పత్రులకు ఈ గుర్తింపు పొందడానికి అర్హత ఉంటుంది. కాగా, మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్‌లలో అత్యున్నత ప్రమాణాలు పాటించే ఆస్పత్రులకు ఈ గుర్తింపు ఇస్తారు. మన రాష్ట్రంలో 40 ప్రభుత్వాస్పత్రులకు ఇప్పటి వరకు లక్ష్య గుర్తింపు లభించింది. ఎన్‌క్వాష్, లక్ష్య ఇతర కేంద్ర వైద్య శాఖ ఇచ్చే గుర్తింపు పొందిన ఆస్పత్రులకు ఆర్థిక ప్రోత్సాహకాలు సైతం లభిస్తాయి. ఆస్పత్రి వాతావరణంతో రోగి ప్రభావితం ఆస్పత్రుల్లోని వాతావరణం రోగులను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజలకు ఒక రకమైన భావన ఉంటుంది. ఇక్కడ శానిటేషన్ సరిగా ఉండదు. వసతుల కొరత ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు రావడానికి మొగ్గు చూపరు. ఈ క్రమంలో వాటి రూపురేఖలు మార్చడం ద్వారా సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి సీఎం వైఎస్ జగన్ పలు చర్యలు తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై అధ్వానంగా తయారైన ఆస్పత్రులన్నీ ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా తయారవుతున్నాయి. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రులను తీర్చిదిద్దడంతో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి తగ్గుతుంది. శుభ్రమైన, ప్రశాంతమైన వాతావరణం రోగులకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది వారు త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుంది. – డాక్టర్ యాదల అశోక్‌బాబు, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రత్యేకాధికారి విలేజ్ క్లినిక్లకూ ఎన్‌క్వాష్ గుర్తింపు కోసం దరఖాస్తు ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాల విషయంలో ఏ మాత్రం రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆ మేరకు నాడు–నేడు కింద ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక ఎన్‌క్వాష్ గుర్తింపు కలిగిన ఆస్పత్రులు మన రాష్ట్రంలో ఉన్నాయి. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు కూడా ఎన్‌క్వాష్ గుర్తింపు కోసం చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం కోసం 10,032 విలేజ్ క్లినిక్‌లు నెలకొల్పింది. దశల వారీగా వీటికి ఎన్‌క్వాష్ కోసం దరఖాస్తు చేస్తున్నాం. – ఎం.టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఎన్‌క్వాష్ గుర్తింపు సంవత్సరం ఆస్పత్రులు 2017–18 4 2018–19 22 2019–20 46 2020–21 కరోనా కారణంగా సర్టిఫికేషన్ ప్రక్రియ ఆపేశారు 2021–22 306 2022–23 65 (మరో 23 ఆస్పత్రులకు అసెస్మెంట్ పూర్తి. ఫలితాలు రావాల్సి ఉంది.) ––––––––– -
‘న్యాక్’ వద్దు బాబోయ్!
సాక్షి, హైదరాబాద్: ‘నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్’(న్యాక్) గుర్తింపు అంటేనే ప్రైవేటు కాలేజీలు పెదవి విరుస్తున్నాయి. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న భావన వ్యక్తం చేస్తున్నాయి. విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలకు సంబంధించి న్యాక్ ఇచ్చే గుర్తింపు పొందాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. వారి ప్రయత్నాలకు కాలేజీల యాజమాన్యాలు స్పం దించకుండా, సవాలక్ష కారణాలు చూపుతున్నా యి. అంతిమంగా కరోనా కష్టకాలం దాటాక చూ ద్దాంలే.. అంటూ పక్కకు తప్పుకుంటున్నాయి. ఈ పరిస్థితిపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తోంది. గత నెల న్యాక్ తన నివేదికను వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నత విద్య ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించింది. జాతీయ స్థాయిలో నాక్ గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో అది 11 శాతమే ఉం ది. పరిశోధన, మౌలిక వసతుల కల్పనలో ఉన్నత విద్యా సంస్థలు వెనుకబడి ఉండటమే దీనికి కారణమని ఆ నివేదిక పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 1,976 ఉన్నత విద్యాసంస్థలుంటే, అందులో కేవలం 141 ఉన్నత విద్యాసంస్థలకే న్యాక్ గుర్తింపు లభించింది. ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న కాలేజీలు (న్యాక్ గుర్తింపు ఉన్నవి) పట్టణ ప్రాంతాల్లోనే 72 వరకు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో న్యాక్ గుర్తింపుకోసం కాలేజీలు ఏమాత్రం ప్రయత్నించడం లేదని స్పష్టమవుతోంది. అయితే ఈ పరిస్థితులపై విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎంత చెప్పినా వినేదే లేదు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలోనూ మార్పులు అవసరమని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సూచిస్తోంది. జాతీయ సాంకేతిక విద్యామండలి ఈ దిశగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలు పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్ల ముందు ఈ లక్ష్యాలను పెట్టింది. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి న్యాక్ గుర్తింపు కోసం విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టింది. గుర్తింపు కోసం ప్రయత్నించే విద్యా సంస్థలకు రూ.లక్ష పారితోషికం ఇస్తామని కూడా ప్రకటించింది. కానీ ప్రైవేటు కాలేజీలు మాత్రం దీనికి ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో కాలేజీల నిర్వహణే కష్టంగా ఉందని, న్యాక్ గుర్తింపు తెచ్చుకునే స్థాయిలో ప్రమాణాలు మెరుగు చేయడం కష్టమని చెబుతున్నాయి. కారణాలేంటి? న్యాక్ గుర్తింపు పొందాలంటే ముందుగా కాలేజీల్లో మౌలిక వసతులు మెరుగు పర్చాలి. పాఠ్యప్రణాళికను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలి. అత్యున్నత ప్రమాణాలున్న ఫ్యాకల్టీని అందుబాటులోకి తేవాలి. పరిశోధన, ప్రాజెక్టు వర్క్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఇలాంటివన్నీ చేయాలంటే ప్రతీ కాలేజీ కనీసం రూ.10 నుంచి 25 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు పెరిగే కొద్దీ ఏటా మౌలిక వసతుల కల్పనకు డబ్బు వెచ్చించాలి. ఇలా చేస్తే విద్యార్థుల ఫీజులు భారీగా పెంచాల్సి ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లో దీనివల్ల ఆర్థికంగా నష్టం వస్తుందని చెబుతున్నాయి. కరోనా వచ్చాక ఫీజుల వసూలే కష్టంగా ఉందని, అదనంగా ఫీజులు పెంచితే వసూలు సాధ్యమయ్యే పనే కాదంటున్నాయి. ఈ కారణంగానే న్యాక్‌కు దూరంగా ఉంటున్నామని చెబుతున్నాయి. అనుకున్నంత స్పందన లేదు న్యాక్ గుర్తింపు దిశగా కాలేజీలను ప్రోత్సహిస్తూనే ఉన్నాం. కానీ అనుకున్నంత స్పందన కనిపించని మాట వాస్తవమే. న్యాక్ నిబంధనలు పాటించాలంటే కాలేజీలు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించాలి. ఇదే సమస్య అని యాజమాన్యాలు భావిస్తున్నాయి. అయితే, ఉన్నత ప్రమాణాల దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
‘గుర్తింపు’నకు ససేమిరా.. ప్రమాణాలు అరకొర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) నివేదిక స్పష్టం చేస్తోంది. జాతీయస్థాయిలో నాక్ గుర్తింపు పొందిన ఉన్నత విద్యాసంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో 11 శాతమే ఉండటాన్ని నివేదిక ప్రస్తావించింది. పరిశోధన, మౌలిక వసతుల కల్పనలో ఉన్నత విద్యాసంస్థలు వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లోని ఉన్నత విద్య ప్రమాణాలపై నాక్ అధ్యయనం చేసింది. ఇందులోభాగంగా తెలంగాణలో జరిపిన అధ్యయనానికి సంబంధించిన నివేదికను ఇటీవల బెంగుళూరులో విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,976 ఉన్నత విద్యా సంస్థలుంటే, ఇందులో 141 మాత్రమే నాక్ గుర్తింపు పొందాయి. వీటిల్లో 35 ప్రభుత్వ, 19 గ్రాంట్–ఇన్–ఎయిడ్, 87 ప్రైవేటు సెల్ఫ్ ఫైనాన్స్ సంస్థలున్నాయి. రాష్ట్రంలోని 24 విశ్వవిద్యాలయాల్లో పదింటికే నాక్ గుర్తింపు ఉంది. ప్రభుత్వంలోని శాతవాహన, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, అంబేడర్ ఓపెన్ యూనివర్సిటీలకు ఇప్పటి వరకూ నాక్ గుర్తింపు లేదు. నాక్ గుర్తింపు ఉన్న 141 కాలేజీల్లో 81 కాలేజీలు తిరిగి గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. పట్టణ ప్రాంతాల్లోని 72 కాలేజీలకు, సెమీ అర్బన్‌లో 6, గ్రామీణ ప్రాంతాల్లో 63 సంస్థలకు గుర్తింపు ఉంది. వెనుకబాటుకు కారణాలేంటి? రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో సింహభాగం గ్రామీణ నేపథ్యంలోనే ఉన్నాయి. నాక్ గుర్తింపు పొందాలంటే నాణ్యత ప్రమాణాలు పెంచాలి. దీనికి నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. అరకొర ఆదాయం వచ్చే ఈ కాలేజీలు ఈ దిశగా ముందుకెళ్లడం లేదు. నాక్ గుర్తింపు కోసం కనీసం దరఖాస్తు చేసేందుకు కూడా ఇష్టపడటం లేదు. పట్టణ ప్రాంతాల్లో బడ్జెట్ కాలేజీలు కూడా ఆదాయం పెద్దగా ఉండటం లేదని నాక్ ప్రమాణాల వైపు చూడటం లేదు. రాష్ట్రంలోని 71 శాతం ఉన్నత విద్యాసంస్థలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవని నివేదిక పేర్కొంది. వీటిల్లో 36 శాతం కాలేజీల్లో కనీస వసతులు కూడా లేవంది. బోధనా సిబ్బంది విషయంలోనూ ఏమాత్రం నాణ్యత పాటించని కాలేజీలు ఎక్కువగా ఉన్నట్టు తేటతెల్లమైంది. మంచి ప్రమాణాలున్న అధ్యాపకులను నియమిస్తే ఎక్కువ వేతనాలు ఇవ్వాలని, అప్పుడు విద్యార్థుల ఫీజులు పెరుగుతాయని కాలేజీల యాజమాన్యాలు అంటున్నాయి. నాక్ గుర్తింపు ఎందుకు? వివిధ రంగాల్లోని ప్రముఖులతో నాక్ ఏర్పడింది. జాతీయస్థాయిలో విద్యా ప్రమాణాలను అంచనా వేసేందుకు ఇది తోడ్పడుతుంది. ప్రధానంగా ఏడు అంశాలను నాక్ గుర్తింపు ప్రామాణికంగా తీసుకుంటుంది. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, అమలు; విద్యాబోధన స్థాయి; పరిశోధన దిశగా పురోగతి; మౌలిక సదుపాయాలు; విద్యార్థి పురోగతి; ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయత; అత్యుత్తమైన ప్రమాణాల అమలు అనే అంశాలను నాక్ పరిశీలిస్తుంది. వీటి ఆధారంగా మార్కులు, గ్రేడ్లు ఇస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటకతో పోలిస్తే తెలంగాణ ఈ విషయంలో వెనుకబడే ఉందని నాక్ నివేదిక స్పష్టం చేస్తోంది. ‘ఎ’గ్రేడ్‌లో కేవలం 11 సంస్థలుంటే.. ‘బి’గ్రేడ్‌లో 71 సంస్థలు, మిగతావి ‘సి’గ్రేడ్‌లో ఉన్నాయి. నాక్ గుర్తింపు పొందిన సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొన్ని నిధులు కూడా అందుతాయి. గుర్తింపు కోసం వస్తే రూ.లక్ష నజరానా తగిన ప్రమాణాలు పాటించి నాక్ గుర్తింపు కోసం విద్యా సంస్థలు పోటీపడేలా ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించబోతున్నాం. నాక్ గుర్తింపు కోసం అర్హతలతో వస్తే రూ.లక్ష నజరానా ఇవ్వాలని నిర్ణయించాం. గ్రామీణ ప్రాంతాల్లోనే డిగ్రీ కాలేజీలు ఉండటం వల్ల మౌలిక సదుపాయాల మెరుగు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది విద్యార్థులతో నడిపే కాలేజీల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
డిగ్రీ కాలేజీలకు కొత్తగా అనుమతులా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులకు రానురాను ఆదరణ తగ్గుతోంది. ఉపాధి, ఉద్యోగావకాశాలున్న కోర్సులకు మాత్రమే డిమాండ్ ఉండడంతో విద్యార్థులు వాటివైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న కాలేజీల్లో కోర్సులు, సీట్లకు తగ్గట్టుగా విద్యార్థుల సంఖ్య ఉండడం లేదు. అయినా సరే కొత్త కాలేజీలకు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి రంగం సిద్ధం చేస్తుండడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలేజీల సంఖ్య ఎక్కువై ప్రమాణాలు లేకుండా బోధన సాగుతోందని, ఇంకా కాలేజీలను పెంచడం వల్ల ఫలితమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాలేజీల్లో కనీస సదుపాయాలు, సరైన బోధన ఉండటం లేదని ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని సరిచేసి ఇప్పుడున్న కాలేజీల్లోనే బోధన ప్రమాణాలను నెలకొల్పాల్సిన మండలి దీనికి విరుద్ధంగా మరిన్ని ప్రైవేటు కాలేజీలకు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమవుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కొంతమందికి లబ్ధి చేకూర్చడం కోసమే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్యామండలి కమిటీయే తేల్చినా.. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల స్థితిగతులపై ఉన్నత విద్యామండలి ఇంతకుముందు జేఎన్టీయూఏ మాజీ రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ కె.వి.రమణారావు, న్యాయ నిపుణులు సుధేష్ ఆనంద్, ఉన్నత విద్యామండలి డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తితో కూడిన కమిటీతో పరిశీలన చేయించింది. ఈ కమిటీ 3 నెలల క్రితం మండలికి నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో డిమాండ్ కంటే ఎక్కువగా డిగ్రీ కాలేజీలున్నాయని, వీటిలోనే తగినంత చేరికలు లేనప్పుడు కొత్త కాలేజీల అవసరం లేదని కమిటీ స్పష్టం చేసింది. కుప్పలుతెప్పలుగా కాలేజీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ప్రమాణాలు అడుగంటిపోతున్నాయని తెలిపింది. డిగ్రీ కాలేజీల ఏర్పాటు పేరిట అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి ఫీజులు, స్కాలర్షిప్లు, ఇతర మొత్తాలను వసూలు చేసుకోవడానికి అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. తాను నియమించిన కమిటీయే ప్రస్తుతమున్న డిగ్రీ కాలేజీలు ఎలా ఉన్నాయో నివేదిక ఇచ్చినా ఉన్నత విద్యామండలి ఆ నివేదికను పక్కన పెట్టేసింది. కమిటీ పరిశీలనలో తేలిన అంశాలివే.. కమిటీ పరిశీలనలో తేలిన అంశాలు ఏమిటంటే.. రాష్ట్రంలో ఏటా 5.49 లక్షల మంది పదో తరగతి పాసవుతున్నారు. వీరిలో 3.64 లక్షల మంది ఇంటర్మీడియెట్‌లో చేరుతుండగా 2.91 లక్షల మంది ఉత్తీర్ణులవుతున్నారు. అయితే ఇంటర్లో ఉత్తీర్ణులయ్యే వారి కంటే ఎక్కువగా డిగ్రీ కాలేజీల్లో సీట్లు ఉన్నాయి. మొత్తం 1422 కాలేజీల్లో 146 ప్రభుత్వ, 124 ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలు కాగా తక్కిన 1152 కాలేజీలు ప్రైవేటువే. ఒక్క ప్రైవేటు కాలేజీల్లోనే 3.29 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. కానీ వీటిలో చేరుతున్నవారి సంఖ్య కేవలం 1.29 లక్షలు మాత్రమే. అంటే.. ప్రైవేటు కాలేజీల సీట్లలో సగం కూడా భర్తీ కావడం లేదు. 70 శాతానికి పైగా కాలేజీలకు సొంత భవనాలు, ఇతర సదుపాయాలు, అర్హులైన బోధన సిబ్బంది లేరు. ఈ కాలేజీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మూడేళ్ల డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధిస్తున్న వారి సంఖ్య ఏటా కేవలం 40 వేల వరకు మాత్రమే ఉంటోంది. ఆయా కాలేజీల్లో ప్రమాణాలు ఎలా ఉంటున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఉన్నత విద్యామండలి కొత్త కాలేజీల ఏర్పాటు ఏయే మండలాల్లో అవసరమో తెలుసుకోవడానికి 2015–16, 2017–18లలో సర్వేలు చేయించింది. ఈ రెండు సర్వేల్లో కూడా కొత్తగా డిగ్రీ కాలేజీలు కావాలని ఎవరి నుంచి వినతులు రాలేదు. పైగా ఆయా మండలాల్లో అప్పటికే ఉన్న కాలేజీల్లో సీట్లే భర్తీ కావడం లేదని తేలింది. వీటన్నిటితో నిపుణుల కమిటీ నివేదిక రూపొందించి ఉన్నత విద్యామండలికి ఇచ్చింది. కొత్తగా డిగ్రీ కాలేజీలకు అనుమతులు అవసరం లేదని, ఇప్పుడున్న కాలేజీల్లో బోధనా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని సూచించింది. అయితే ఈ కమిటీ నివేదికను పక్కన పెట్టిన ఉన్నత విద్యామండలి కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐటీఐల్లో తనిఖీ బృందాలు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో ప్రమాణాల పరిస్థితిని పరిశీలించేందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉపక్రమించింది. ప్రైవేటు ఐటీఐల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రమాణాల పరిశీలనకు ప్రత్యేకంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. పరిశీలన అనంతరం తనిఖీ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా వాటి గుర్తింపును కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 291 ఐటీఐలున్నా యి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఐటీఐలకు ప్రాధాన్యతనిస్తోంది. ప్రతి ఐటీఐలోనూ పూర్తిస్థాయి ప్రమాణాలుండేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తనిఖీలకు ఉపక్రమించింది. త్రిసభ్య కమిటీలు ఏర్పాటు ఐటీఐల తనిఖీలకు ఆ శాఖ జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు. శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు, జిల్లా ఉపా ధి కల్పనాధికారితో పాటు ప్రభుత్వ ఐటీఐ నుంచి సీనియర్ ఫ్యాకల్టీతో ఏర్పా టు చేసిన త్రిసభ్య కమిటీ జిల్లా పరిధిలో ఉన్న ప్రైవేటు ఐటీఐల్లో మౌళిక వసతులు, మిషనరీ, బోధనా సిబ్బంది తదితర అంశాలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలిస్తారు. ప్రత్యేక ఫార్మాట్‌తో కూడిన ప్రొఫార్మా ఆ శాఖ తయారు చేసి బృందాలకు అందించింది. తనిఖీ అనంతరం వీరు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కమిటీ నివేదికలు... పారిశ్రామిక శిక్షణ సంస్థల అనుమతిలో కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని డీజీఈటీ(డైరెక్టర్ జనరల్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్)కి కీలక పాత్ర ఉంటుంది. అనుమతులు, రెన్యువల్ తదితరాలన్నీ వీటి పరిధిలోనే ఉంటాయి. ఐటీఐల తనిఖీలు చేపట్టే త్రిసభ్య కమిటీలు సమర్పించే నివేదికలను కేంద్ర కార్మిక శాఖకు సమర్పించనున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ చెబుతోంది. దీంతో కమిటీ తనిఖీలపై ప్రైవేటు ఐటీఐలు ఆందోళన చెందుతున్నాయి. -
ఏప్రిల్ 1 నుంచి కొత్త అకౌంటింగ్ ప్రమాణాలు
న్యూఢిల్లీ: భారత అకౌంటింగ్ నూతన ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో భారత అకౌంటింగ్ స్టాండర్డ్ (ఇండ్‌ఏఎస్) 115 అమల్లోకి రానున్నట్టు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రకటించింది. దీంతో కంపెనీలు తమ ఆదాయానికి సంబంధించి సమగ్ర వివరాలను నిర్వహించాల్సి వస్తుంది. నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇండ్‌ఏఎస్ 115 అన్నది ఆదాయాల్లో మరింత పారదర్శకతకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, టెలికం వంటి రంగాల కంపెనీలపై ప్రభావం ఉంటుంది. -
యముళ్లైన మొగుళ్లు..
మూడు ముళ్లు.. ఏడడుగులు.. అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణాలు.. నీటి మూటలే అవుతున్నాయి. సంసార సాగరంలో చిన్నపాటి ఒడిదుడుకులకే సహనం కోల్పోతున్నారు. కడదాక కంటికి రెప్పలా కాపాడుకుంటాడనుకున్న భర్తే, భార్యాపిల్లల పాలిట యమకింకరుడవుతున్నాడు. నగరంలో ఇటీవల జరిగిన వరుస సంఘటనలు పలువురిని కలచివేస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో, బయట భార్యకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత భర్తదేనని ఇటీవల ఓ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే రక్షణ సంగతి దేవుడెరుగు కట్టుకున్న భర్తలే భార్యలను కడతేరుస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అందంగా లేవని ఒకరు, అనుమానంతో మరొకరు, సట్టా ఆడొద్దనందుకు మనస్పర్థలతో.. ఇలా చిన్న చిన్న కారణాలతో భార్యలను అత్యంత దారుణంగా హతమార్చిన ఉదంతాలు పలువురిని కలిచివేశాయి. మరోపక్క భర్తలు పెట్టే బాధలు భరించలేక పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలూ వెలుగుచూస్తున్నాయి. సంసార సాగరంలో చిన్నిచిన్న సమస్యలను సర్థుకుపోవాల్సిన చోట పంతాలకు పోయి, ప్రాణాల మీదకుతెచ్చుకుంటున్నారు. ఈ నెలలో నగరంలో ఏడు కుటుంబాల్లో చోటుచేసుకున్న ఘోర ఉదంతాలు ఇలా.. సట్టా ఆడవద్దన్నందుకు.. తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్నకమేళాకు చెందిన నర్సింగ్‌రావు, తార దంపతులు. సట్టాకు బానిసైన నర్సింగ్రావును తార మందలించింది. ఈ పాపానికి ఈ నెల 5వ తేదీన మద్యం సేవించి ఇంటికి వచ్చిన నర్సింగ్‌రావు భార్యతో గొడవపడి ఉరివేసి చంపేశాడు. ప్రస్తుతం అతడు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. మనస్పర్థలతో.. భవానీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని జహంగీర్‌నగర్‌కు చెందిన సయ్యద్ జాఫర్(35), నజియా బేగం (32) దంపతుల మధ్య చిన్న విషయంలో మనస్పర్థలు వచ్చాయి. ఆవేశానికిలోనైన జాఫర్ ఈ నెల 10వ తేదీన భార్యను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందంగా లేదని.. గాజులరామారానికి చెందిన ఎజాస్ (22),మోసిన్ (19)లకు ఐదు నెలల క్రితమే పెళ్లి అయ్యింది. భార్య అందంగా లేదని చీటికిమాటికి ఆమెతో గొడవపడేవాడు. ఈ నెల 16వ తేదీన కూడా ఇదే విషయమై ఘర్షణకు దిగి మోసిన్ గొంతు నులిమి చంపేశాడు. ప్రస్తుతం ఎజాస్ జైలులో ఉన్నాడు. అనుమానంతో.. గుండ్లపోచంపల్లికి చెందిన కనకవ్వ (30), నర్సింహ (36) దంపతులు. భార్యపై అనుమానంతో నర్సింహ ఈ నెల 19న ఆమెతో గొడవపడి కొట్టి హ తమార్చాడు. ప్రస్తుతం నర్సింహ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. అత్తింటి వేధింపులతో.. అత్తింటి వేధింపులు భరించలేక గాంధీనగర్‌కు చెందిన స్వప్న (24) తన కూతురు శాన్వీ (20 నెలలు)తో కలిసి ఈ నెల 13న ఘట్కేసర్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. భార్యపై కోపంతో.. భార్యపై కోపంతో ఓ ప్రొఫెసర్ తన ఇద్దరు పిల్లలను దారుణంగా నరికి చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అల్వాల్‌కు చెందిన గురుప్రసాద్, సుహాసిని దంపతుల విడాకుల కేసు పెండింగ్‌లో ఉంది. భార్యపై ఉన్న కోపంతో గురుప్రసాద్ తన ఇద్దరు పిల్లలు విఠల్ విరించి (09), నందవిహారి (05)లను ఈ నెల 6న కిరాతకంగా చంపి, తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త వేధింపులు భరించలేక.. ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో నివసించే దినేష్, కవిత (40) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు వైష్ణవి (18) భావన (16) ఉన్నారు. ఆస్తి వివాదంలో భర్త వేధింపులు భరించలేని కవిత శుక్రవారం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా వైష్ణవి, భావన మృతి చెందారు. కవిత పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల్ని చంపకండి దంపతుల గొడవల మధ్య క్షణికావేశంలో పిల్లలను చంపడం సమంజసం కాదు. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని నడుచుకుంటే సంసారం కలకాలం సుఖ సంతోషాలతో ఉంటుంది. -అనురాధారావు బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు బంధం బలహీనపడటంతోనే.. దంపతులు ఒకరి నొకరు అర్థం చేసుకోవాల్సింది పోయి ఎవరికి వారు పంతాలకు పోతున్నారు. వీటికి కొన్ని టీవీ సీరియళ్లు కూడా తోడవుతున్నాయి. ఎంతో అన్యోన్యంగా సాగాల్సిన దాంపత్య జీవితం అనుమానాలు, అసూయతో గొడవలు, విడాకులు, ఆత్మహత్యలు, హత్యలకు దారితీస్తోంది. మనుషుల మధ్య తగ్గిన నమ్మకం, పెరిగిన అనుమానాలే ఇందుకు కారణం. -డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, సైక్రియాటిస్ట్