Steel industry
-
ఇకపై వాటి దిగుమతులకు ఆమోదం తప్పనిసరి
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అనుమతి లేని దిగుమతులకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి చేసింది. నాసిరకం వస్తువులు మార్కెట్లోకి వెళ్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత విధానం ప్రకారం..అన్ని ప్రమాణాలకు లోబడి ఉన్న సరైన అర్హత కలిగిన విదేశీ ఉక్కు పరిశ్రమల ఉత్పత్తులకు బీఐఎస్ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది. బీఐఎస్, ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించిన సరుకును మార్కెట్లో విక్రయించేందుకు అనుమతిస్తారు. కానీ కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెక్నికల్ కమిటీ సదరు ప్రమాణాల ప్రకారం ధ్రువీకరించి దిగుమతి చేసే వీలుంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్-ఆగస్టు మధ్య 7.68 మిలియన్ టన్నుల ఐరన్, స్టీల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నారు. ఇది గతేడాదితో పోలిస్తే 4.82 మిలియన్ టన్నులు నుంచి 59.45శాతం పెరిగింది. వియత్నాం, జపాన్, చైనా నుంచి భారీ పరిమాణంలో ఎగుమతి చేసుకుంటున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. దాంతో ధరలు ప్రభావితం అవుతున్నట్లు తెలుస్తుంది. -
ఆర్సెలర్ నిప్పన్ చేతికి ఎస్సార్ ఆస్తులు
న్యూఢిల్లీ: సొంత(వినియోగ) పోర్టులు, విద్యుత్ మౌలిక ఆస్తుల విక్రయాన్ని పూర్తి చేసినట్లు రూయాల కుటుంబ సంస్థ ఎస్సార్ గ్రూప్ తాజాగా వెల్లడించింది. గుజరాత్‌లోని హజీరా, ఒడిషాలోని పారదీప్‌వద్ద గల ఈ ఆస్తులను ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్ఎస్)కు అమ్మివేసినట్లు తెలియజేసింది. వెరసి ఎస్సార్ పోర్ట్స్ అండ్ టెర్మినల్స్(ఈపీటీఎల్), ఎస్సార్ పవర్ లిమిటెడ్(ఈపీఎల్)ను 2.05 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,500 కోట్లు) విక్రయించింది. దీంతో రుణరహితంగా మారే బాటలో ఆస్తుల మానిటైజేషన్‌ను పూర్తయినట్లు కంపెనీ పేర్కొంది. డీల్‌లో భాగంగా 270 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు, 25 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల హజీరా(గుజరాత్) పోర్టు, 12 ఎంటీ వార్షిక సామర్థ్యంగల పారదీప్(ఒడిషా) పోర్టు ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ సొంతమయ్యాయి. కాగా.. ఆస్తుల మానిటైజేషన్‌తో 25 బిలియన్ డాలర్ల(రూ. 2 లక్షల కోట్లు) రుణ చెల్లింపులను పూర్తి చేయడం ద్వారా గ్రూప్ రుణరహితంగా నిలిచినట్లు ఎస్సార్ క్యాపిటల్ డైరెక్టర్ ప్రశాంత్ రూయా పేర్కొన్నారు. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
వందేళ్ల బామ్మకి గౌరవ డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా
రెండో ప్రపంచ యుద్ధం నాటి సమయంలోని వ్యక్తులను స్మరించుకుంటూ ..నాటి నుంచి ఇప్పటి వరకు మనుగడ సాధించి ఉన్న ఎందర్నో గౌరవించి సత్కరించాం. ఆ సమయంలో వారు చూపించిన తెగువ, ప్రదర్శించిన శక్తి యుక్తులను ప్రశంసించాం కూడా. అచ్చం అలానే ఒక్కడోక బామ్మ నాటి సమయంలోని ఒక ఉక్కు పరిశ్రమను కాపాడి అందరిచే ప్రశంసలు అందుకుంది. పైగా ఆమె నిస్వార్థ కృషికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది యూకే ప్రభుత్వం. వివరాల్లోకెళ్తే....యూకేకి చెందిన వందేళ్ల వృద్ధురాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్కు పరిశ్రమను కూలిపోకుండా కాపాడింది. ఆమె యుక్త వయసులో ఆ ఉక్కు పరిశ్రమలో పనిచేసినప్పుడూ..పురుషుల కంటే తక్కువ వేతనంతో ఇతర మహిళలతో కలిసి పనిచేసింది. ఆమె 72 గంటల వారాలు విధులు నిర్వర్తించేది. ఆ వృద్ధురాలి పేరు కాథ్లీన్ రాబర్ట్స్. తనతోపాటు పనిచేసిన వారిలో బతికి ఉన్న ఏకైక వ్యక్తి ఆ బామ్మ. సంక్షోభం, ఆర్థిక పతనం వంటి విపత్కర సమయాల్లో తన దేశం కోసం అంకితభావంతో పనిచేసింది. కాథ్లీన్ బృందం గనులు, ప్లాంట్లలోని భారీ యంత్రాలు, క్రేన్లను నిర్వహించేవారు. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్న పట్టించుకోకుండా నిరాటంకంగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఎప్పుడూ ఎటు నుంచి వైమానిక దాడులు జరుగుతాయోనన్న భయంతో హెల్మట్లు ధరించి మరీ విధులు కొనసాగించేవారు. కొన్నాళ్ల తర్వాత విధుల నుంచి తొలగింపబడ్డారు. ఐతే కాథ్లీన్ మౌనంగా ఊరుకోలేదు. ఉక్కుమహిళల వారసత్వాన్ని కాపాడేందుకు ఏడేళ్లు ప్రచారం చేసింది. చివరికి 70 ఏళ్ల తర్వాత ఆమె రచనలు షెఫిల్డ్ విశ్వవిద్యాలయం గుర్తించింది. క్యాథిలిన్ని ఉక్కు కార్మికురాలిగా, ప్రచారకురాలిగా ఆమె చేసిన కృషికి గుర్తింపు లభించడంతో ఆమె గౌరవ డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్‌ని అందుకుంది. ఈ మేరకు కాథ్లీన్ మాట్లాడుతూ...తనకు ఈ గౌవర డిగ్రీ ఇవ్వనున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. యుద్ధ ప్రయత్నానికి సహకరించిన ఉక్కుమహిళలందరి తరుఫున ఈ గౌరవ డాక్టరేట్‌ని తీసుకోవడం సంతోషంగా ఉంది. చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విద్యార్థులకు ఒక విజ్ఞప్తి చేశారు. "మీరు ప్రతీది పుస్తకం నుంచి నేర్చుకోలేరు. కేవలం అనుభవంతోనే కొన్నింటిని తెలుసుకోగలరు అని అన్నారు. అలాగే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ కలలను సాకారం చేసుకోండి" అని సూచించారు. (చదవండి: ఏడాది వయసు కొడుకుతో ఈ రిక్షా నడుపుతున్న మహిళ: వీడియో వైరల్) -
స్టీల్ అవుట్‌లుక్.. సూపర్
కోల్‌కతా: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుండి బలమైన దేశీయ డిమాండ్ నేపథ్యంలో భారతీయ ఉక్కు రంగ అవుట్‌లుక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిరంగా ఉండనుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్–రా) తన తాజా నివేదికలో పేర్కొంది. గ్లోబల్ డిమాండ్ అనిశ్చితి ఆందోళనల నేపథ్యంలోనూ దేశీయ పరిశ్రమ దృఢంగా ఉంటుందన్న భరోసాను వెలిబుచ్చింది. నివేదికలోని అంశాలు, ఇందుకు సంబంధించి పూర్వాపరాలను పరిశీలిస్తే.. - 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టీల్ పరిశ్రమకు ‘‘తటస్థ అవుట్‌లుక్’’ను కొనసాగిస్తున్నాం. అధిక ద్రవ్యోల్బణం, దీనివల్ల అంతంత మాత్రంగా కొనసాగుతున్న మార్జిన్ల అంచనాలు దీనికి కారణం. - ప్రభుత్వం చేసే మౌలిక సదుపాయాల వ్యయం దేశీయంగా స్టీల్ స్థిరమైన వినియోగానికి తోడ్పడుతుంది. ప్రభుత్వం నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) కోసం వచ్చే ఐదేళ్లలో వ్యయాలకు రూ. 1,11,000 కోట్లను కేటాయించింది, అయితే ప్రైవేట్ రంగ మూలధన వ్యయం, హౌసింగ్, కన్సూ్యమర్ డ్యూరబుల్స్ ఎండ్–యూజర్ సెగ్మెంట్ (వినియోగదారులు), ధరల పెరుగుదల వల్ల డిమాండ్‌లో మందగమనంలోనే ఉండడం కొంత ప్రతికూలాంశం. - ఇండ్–రా పరిశోధన ప్రకారం, స్టీల్ ఉత్పత్తిదారులకు ద్రవ్యోల్బణం సవాళ్లు పూర్తిగా అధిగమించడం కొంత సవాలు కావచ్చు. పరిశ్రమ స్థూల లాభాలు అంతంతమాత్రంగా ఉండడానికి ద్రవ్యోల్బణం సవాళ్లు దారితీయవచ్చు. అయితే స్థూల ఆదాయాలు మాత్రం కరోనా ముందస్తు సంవత్సరం 2019కంటే అధికంగానే ఉండే వీలుంది. - చైనా ఉత్పత్తి, ఎగుమతులు తక్కువగా ఉండటం యురోపియన్ మార్కెట్లకు ఎగుమతుల కోటా పరిమితి పెరుగుదల, కొనసాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా భారతీయ స్టీల్ కంపెనీలు లాభపడే అవకాశం ఉంది. ఆయా అంశాలు ఎగుమతుల విక్రయాల్లో లాభాలు అధికంగా ఉండే వీలుంది. ఇది ఈ రంగం మొత్తంగా లాభాల బాటన నిలబడ్డానికి దోహదపడుతుంది. ఆర్సెలర్ మిట్టల్ అంచనాలు నిరుత్సాహం ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు ఆర్సెలర్ మిట్టల్ గ్లోబల్ స్టీల్ డిమాండ్‌లో క్షీణతను అంచనా వేస్తుండడం గమనార్హం. భౌగోళిక రాజకీయ అంతరాయాలు, సప్లై సవాళ్లు, ద్రవ్యోల్బణం, చైనా కోవిడ్ –19 లాక్డౌన్లు, దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలను మందగించడం వంటి అంశాల వల్ల ప్రపంచ ఉక్కు వినియోగం 2022లో ఒక శాతం క్షీణించవచ్చని ఉక్కు ఉత్పత్తి దిగ్గజంఆర్సెలార్ మిట్టల్ తన తాజా అంచనాల్లో పేర్కొంటోంది. యూరోప్‌లో ఉక్కు వినియోగం (కంపెనీ ప్రధాన యూనిట్లు ఉన్న ప్రాంతాల పరిధిలో) 2022లో 2 నుంచి 4 శాతం క్షీణించవచ్చని అంచనా వేస్తోంది. క్రితం అంచనాలు 0.2 శాతం వృద్ధి కంటే ఇది పూర్తి భిన్నమైన అంచనా కావడం గమనార్హం. టాటా స్టీల్ పరిస్థితి ఇదీ.. 2022 మార్చి త్రైమాసికంలో, యూరప్ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి టాటా స్టీల్ విక్రయాల పరిమాణం వార్షిక ప్రాతిపదికన 2.8 శాతం క్షీణించింది. కానీ ధరలు పెరగడంతో సీక్వెన్షియల్ ప్రాతిపదికన నికర ఆదాయాలు టన్నుకు 53 యూరోలు అధికంగా ఉన్నాయి. చైనా ఇకపై ఏటా తన సామర్థ్యానికి 50–60 మిలియన్ టన్నులను అదనంగా జోడించే పరిస్థితి లేనందున డిమాండ్, ధరలు పటిష్టంగా ఉంటాయని టాటా స్టీల్ అంచనా వేస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ధరలు తగ్గకుండా చూసే క్రమంలో చైనా స్టీల్ ఎగుమతులను భారీగా చేయకపోవచ్చని కూడా టాటా స్టీల్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి త్రైమాసికంలో తమ స్థూల ఆదాయ మార్జిన్న్లు పటిష్టంగా ఉండేలా వ్యూహాలు రూపొందించాలని టాటా స్టీల్ భావిస్తోంది. దేశంలో కోకింగ్ బొగ్గు ధర కూడా టన్నుకు 100 డాలర్లు పెరుగుతుందని, అయితే సగటు అమ్మకపు ధరలో టన్నుకు రూ. 8,000–8,500 పెంపు ద్వారా ఈ సవాళ్లను అధిగమించవచ్చని కంపెనీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బలమైన డిమాండ్ కొనసాగుతుందన్న అంచనాలతో ఈ దేశీయ స్టీల్ దిగ్గజ సంస్థ రాబోయే కొన్ని సంవత్సరాలలో దేశంలో తన ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 2030 నాటికి తర సామర్థ్యాన్ని 40 మిలియన్ టన్నులకు రెట్టింపు చేయాలని సంకల్పించింది. కాగా, ప్రస్తుత స్టీల్ ధరల వద్ద స్టీల్ డిమాండ్‌పై కొంత సందేహాలు ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓశ్వాల్ పేర్కొంటోంది. ఈ నేపథ్యలో టాటా స్టీల్‌పై తటస్థ వైఖరి అవలంభిస్తున్నట్లు తెలిపింది. చదవండి: సాగర్మాల.. 1,537 ప్రాజెక్టులు.. రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు -
రష్యా దురాశ.. స్టీలు ఉత్పత్తికి దెబ్బ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలకు దిగడంతో కోకింగ్ కోల్ తదితర కమోడిటీ, ముడిసరుకుల ధరలు క్రమంగా పెరగనున్నట్లు దేశీ స్టీల్ అసోసియేషన్(ఐఎస్ఏ) పేర్కొంది. దీంతో స్టీల్ ఉత్పత్తిలో ముడివ్యయాలు భారం కానున్నట్లు అభిప్రాయపడింది. మరోపక్క రష్యా, ఉక్రెయిన్ నికరంగా స్టీల్ ఎగుమతిదారులుకాగా.. ఉమ్మడిగా 40 మిలియన్ టన్నుల స్టీల్‌ను విదేశాలకు సరఫరా చేస్తున్నట్లు తెలియజేసింది. వెరసి రష్యా, ఉక్రెయిన్ వివాదం అంతర్జాతీయంగా స్టీల్ కొరతకు దారితీయవచ్చని పేర్కొంది. స్టీల్ తయారీలో మెటలర్జికల్ కోల్ లేదా కోకింగ్ కోల్‌ను ప్రధాన ముడిసరుకుగా వినియోగించే సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులతో ఇప్పటికే ముడిచమురు, గ్యాస్ ధరలు మండుతున్నట్లు ఐఎస్ఏ తెలియజేసింది. ఇది ఇంధన వ్యయాల పెరుగుదలకు కారణంకానున్నట్లు వివరించింది. అంతేకాకుండా కమోడిటీల ధరలు సైతం క్రమంగా పెరుగుతున్నట్లు తెలియజేసింది. భారత్ నుంచి రష్యాకు 20 కోట్ల డాలర్ల(రూ. 1,500 కోట్లు) విలువైన ఎగుమతులు జరుగుతున్నట్లు దేశీ స్టెయిన్లెస్ స్టీల్ డెవలప్మెంట్ అసోసియేషన్(ఐఎస్‌ఎస్‌డీఏ) ప్రెసిడెంట్ కేకే పహుజా తెలియజేశారు. -
ఎలక్ట్రిక్ వాహనాల దెబ్బకు ఆ కంపెనీలకు భారీ నష్టాలు..!
కరోనా మహమ్మారి కాలంలో వేగంగా వృద్ది చెందుతున్న రంగం ఏదైనా ఉంది అంటే ఎలక్ట్రిక్ వాహన రంగం అని చెప్పుకోవాలి. అయితే, గ్లోబల్ మొబిలిటీలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాటా పెరగడంతో హిందాల్కో వంటి అల్యూమినియం ఉత్పత్తిదారులు లాభపడితే.. ఉక్కు తయారీదారులు నష్టపోతున్నట్లు ఒక కొత్త పరిశోధన నివేదిక పేర్కొంది. మెటల్ రంగంలో ఉన్న దిగ్గజ టాటా స్టీల్, జెఎస్ డబ్ల్యు స్టీల్ వంటి ఉక్కు ఉత్పత్తిదారుల కంటే హిందాల్కో ధర సుమారు 30% పేరుగుతున్నట్లు గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ జెఫెరీస్ తెలిపింది. అల్యూమినియం తేలికైన లోహాలలో ఒకటి. ఈ లోహాన్ని ఈవీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇనుముతో పోలిస్తే దీని బరువు తక్కువగా ఉండటం వల్ల ఈ లోహాన్ని ఏరోస్పేస్ పరిశ్రమలో కూడా ఉపయోగిస్తారు. సాదారణ వాహనాలలో సగటున అల్యూమినియం వినియోగం కారులో సుమారు 50-70 కిలోగ్రాములు, ద్విచక్ర వాహనాల 20-30 కిలోలుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎలక్ట్రిక్ కారులో సగటున 250 కిలోల అల్యూమినియం ఉపయోగిస్తున్నారు. ఫలితంగా, అల్యూమినియం బాడీలతో తయారు చేసే వాహనాలు ఇతర వాహనాల కంటే ఖరీదైనవిగా మారుతున్నాయి. అల్యూమినియం వినియోగం పెరగడం వల్ల ఉక్కు వంటి లోహానికి డిమాండ్ సెప్టెంబర్ 2021 నుంచి తగ్గుతూ వస్తుంది. ఈవీలలో అల్యూమినియం ఎక్కువగా వినియోగించడానికి రేంజ్ ఒక ప్రధాన కారణం. ఎలక్ట్రిక్ వాహన బరువు తగ్గడం వల్ల ఆ మేరకు వాహనం రేంజ్ అనేది పెరుగుతుంది. ఈవీ అమ్మకాలలో వాహన రేంజ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. (చదవండి: అదానీ గ్రూప్స్ మరో రికార్డు..! ఏకంగా రూ. 10 లక్షల కోట్లు..!) -
ఉత్తమ్ గాల్వా ఎవరి పరం?
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీని టేకోవర్ చేయడానికి పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. విలువాధారిత ఉక్కు ఉత్పత్తులను విక్రయించడం ద్వారా మంచి పేరు సాధించిన ఈ కంపెనీ ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాల చెల్లింపుల్లో విఫలం కావడంతో ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. టేకోవర్ బిడ్లకు సంబంధించిన గడువు గత నెల ముగిసింది. ఈ కంపెనీ టేకోవర్‌కు సంబంధించి సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ టేకోవర్ పోరు రసవత్తరంగా ఉండనున్నది. లోహ దిగ్గజ కంపెనీలు ఈ కంపెనీని టేకోవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. లోహ కుబేరులు–లక్ష్మీ మిట్టల్, జిందాల్ సోదరులు(సజ్జన్, నవీన్ జిందాల్‌లు), వేదాంత కంపెనీ అనిల్ అగర్వాల్ ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీని టేకోవర్ రేసులో ఉన్నారని సమాచారం. 2018లో దివాలా ప్రక్రియ ద్వారా ఈఎస్ఎల్ స్టీల్‌ను వేదాంత కంపెనీ టేకోవర్ చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారానే వేదాంత కంపెనీ టేకోవర్ బిడ్‌ను వేదాంత సమర్పించిందని సమాచారం. ఈ లోహ కుబేరులతో పాటు కోటక్ మహీంద్రాకు చెందిన ఫీనిక్స్అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ) కూడా ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీపై కన్నేసింది. అయితే టేకోవర్ వార్తలపై ఈ సంస్థలు స్పందించడానికి నిరాకరించాయి. విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు... ఉత్తమ్ గాల్వా కంపెనీని రాజేంద్ర మిగ్లాని స్థాపించారు. వాహనాలు, విమానాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమల్లో ఉపయోగించే విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి తొలి ఆర్నెల్లలో రూ.277 కోట్ల ఆదాయంపై రూ.140 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 2020 మొదట్లో ఉత్తమ్ గాల్వా స్టీల్స్ కంపెనీ 67 లక్షల డాలర్ల విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో ఈ కంపెనీపై దివాలా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ 2020 మార్చిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)లో ఒక పిటీషన్‌ను దాఖలు చేసింది. ఆరు నెలల తర్వాత ఎస్బీఐ పిటీషన్‌ను ఎన్సీఎల్టీ స్వీకరించింది. దివాలా ప్రక్రియను నిర్వహించడానికి కేఎమ్డీఎస్ అండ్ అసోసియేట్స్‌కు చెందిన మిలింద్ కసోద్కర్ను నియమించింది. అగ్ర భాగంలో ఆర్సెలర్ మిట్టల్... ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ టేకోవర్ పోరులో లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకే అధిక అవకాశాలున్నాయని సమాచారం. ఉత్తమ్ గాల్వా కంపెనీకి అత్యధికంగా అప్పులిచ్చింది లక్ష్మీ మిట్టల్ కంపెనీయే. ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ మొత్తం రుణ భారం రూ.9,742 కోట్లుగా ఉంది. దీంట్లో ఆర్సెలర్ మిట్టల్ సంస్థల(ఆర్సెలర్ మిట్టల్ ఇండియా, ఏఎమ్‌ఎన్‌ఎస్ లగ్జెంబర్గ్) వాటాలే రూ.7,922 కోట్లుగా ఉన్నాయి. రుణదాతలకున్న మొత్తం ఓటింగ్ రైట్స్‌లో ఈ రెండు సంస్థలకు కలిపి 87.2% వాటా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ చెల్లించాల్సిన రుణాలను ఈ సంస్థలను చెల్లించి, ఆ మేరకు అప్పుల్లో వాటాను తీసుకున్నాయి. ఒకప్పు డు ఉత్తమ్ గాల్వాలో ఒక ప్రమోటర్‌గా ఆర్సెలర్ మిట్టల్ ఉండేది. దివాలా తీసిన ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి గాను ఉత్తమ్ గాల్వా స్టీల్ నుంచి ఆర్సెలర్ మిట్టల్ వైదొలగింది. ఎస్సార్ స్టీల్‌ను టేకోవర్ చేసి ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియాగా పేరు మార్చింది. -
ఏపీలో 1,200 కోట్లతో ఎంఎస్ఏఎఫ్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ తయారీలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్ఏఎఫ్) కొత్తగా అత్యాధునిక స్టీల్ ప్లాంటును నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద 4 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతోంది. ఇందుకోసం సంస్థ రూ.1,200 కోట్లు పెట్టుబడి చేస్తోంది. తద్వారా 1,800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్లాంటు సిద్ధమవుతుందని కంపెనీ డైరెక్టర్ గౌతమ్ గనెరివాల్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఇప్పటికే సంస్థకు తెలంగాణ, ఏపీలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులు. వీటి సా మర్థ్యం 2021లో 2.5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరనుంది. ప్రస్తుతం సంస్థలో 8,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. గ్రూప్ టర్నోవర్ రూ.2,100 కోట్లు. కంపెనీ నుంచి కొత్త ఉత్పాదన.. ఎంఎస్ఏఎఫ్ కొత్తగా ఎంఎస్ లైఫ్ 600 ప్లస్ పేరుతో భూకంపాలను తట్టుకునే టీఎంటీ బార్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. సొంతంగా తామే దీనిని అభివృద్ధి చేశామని, ఇటువంటి ఉత్పాదన దేశంలో తొలిసారి అని కంపెనీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని తూప్రాన్ వద్ద ఉన్న ప్లాంటులో తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ లైఫ్ 600, ఏఎఫ్ స్టార్ 500–డి పేరుతో స్టీల్ ఉత్పత్తులను దక్షిణాదిన 750 చానెల్ పార్ట్నర్స్ ద్వారా కంపెనీ విక్రయిస్తోంది. గంగవరం, కృష్ణపట్నం పోర్టు, హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు స్టీల్‌ను సరఫరా చేసింది. -
భారత ఉక్కు రంగంలోకి ‘ఆర్సెలర్’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ ఎట్టకేలకు భారత ఉక్కు రంగంలోకి అరంగేట్రం చేసింది. రచ్చ గెలిచిన లక్ష్మీనివాస్ మిట్టల్ ఇంట గెలవడానికి చాలా సమయం పట్టింది. చాలా ఏళ్ల సమయం, ప్రయాసల అనంతరం ఆయన ఉక్కు కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ మన దేశంలోకి అడుగిడింది. భారత్‌లో ఉక్కు కంపెనీని ఏర్పాటు చేయాలన్న ఎల్ఎన్ మిట్టల్ కల ఎట్టకేలకు ఎస్సార్ స్టీల్ టేకోవర్ ద్వారా సాకారమయింది. ఈ టేకోవర్ ప్రక్రియ సోమవారంతో పూర్తయ్యిందని ఆర్సెలర్ మిట్టల్ పేర్కొంది. అతి పెద్ద దివాలా రికవరీ... ఎస్సార్ స్టీల్ కంపెనీని రూ.42,000 కోట్లకు ఆర్సెలర్ మిట్టల్ టేకోవర్ చేయడానికి సుప్రీం కోర్టు గత నెలలోనే ఆమోదం తెలిపింది. దివాలా చట్టం కింద (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్–ఐబీసీ) పరిష్కారమైన అతి పెద్ద రికవరీ ఇదే. నిప్పన్ స్టీల్ కంపెనీతో కలిసి ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ కంపెనీ (ఆర్సెలర్ మిట్టల్ /నిప్పన్ స్టీల్ (ఏఎమ్/ఎన్ఎస్ ఇండియా)) ఇకపై ఎస్సార్ స్టీల్‌ను నిర్వహిస్తుంది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ చైర్మన్‌గా అదిత్య మిట్టల్ (ప్రస్తుత ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ సీఎఫ్ఓ, ప్రెసిడెంట్ ) వ్యవహరిస్తారు. ఈ జేవీలో ఆర్సెలర్ మిట్టల్‌కు 60 శాతం, నిప్పన్ స్టీల్ కంపెనీకి 40 శాతం చొప్పున వాటాలున్నాయి. లగ్జెంబర్గ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్... భారత్‌లో అడుగిడాలని చాలా ఏళ్ల కిందటే ప్రయత్నాలు ప్రారంభించింది. జార్ఖండ్, ఒడిశాల్లో 12 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భూ సేకరణ, పర్యావరణ, ఇతర అనేక అవరోధాల కారణంగా ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. -
ఉక్కు సుంకంపై అమెరికాతో చర్చలు
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై విధిస్తున్న భారీ సుంకాలను తగ్గించాలని.. అక్కడి అధికారును భారత ప్రభుత్వం కోరింది. ఉక్కు ఎగుమతి సంస్థల ప్రయోజనాల దృష్యా అమెరికా ప్రభుత్వ అధికారులతో శుక్రవారం చర్చలు జరిపినట్లు కేంద్ర ఉక్కు కార్యదర్శి బినోయ్ కుమార్ తెలిపారు. సెయిల్ నిర్వహించిన ఒక సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించిన ఆయన.. ‘ఉక్కు దిగుమతులపై సుంకాలు తగ్గించాలని అమెరికా అధికారులను అడిగాం. భారత స్టీల్ పరిశ్రమ చాలా ప్రత్యేకమైది. ఈ పరిశ్రమ ప్రయోజనాలను కాపాడుకోవల్సిన అవసరం భారత ప్రభుత్వంపై ఉందని వారికి చెప్పాం. అయితే, చర్చల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.’ అని మీడియాతో చెప్పారాయన. ఈ ఏడాది మార్చిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్... మన దేశం నుంచి దిగుమతి చేసుకునే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాలను విధించటం తెలిసిందే. ఆర్సెలర్ మిట్టల్‌ను వేగం పెంచమన్న సెయిల్‌జేవీ అంశంపై లక్ష్మీ ఎన్ మిట్టల్‌కు లేఖ హై–ఎండ్ ఆటోమోటివ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన జాయింట్ వెంచర్ ప్రక్రియను వేగవంతం చేయాలని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఆర్సెలర్ మిట్టల్‌ను కోరింది. ఇరు సంస్థలు ఏర్పాటుచేయనున్న ఈ వెంచర్‌కు గతేడాదిలోనే సెయిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. పలు ఆర్థిక అంశాలపై ఇప్పటికీ తుది ఒప్పంద సంతకాలు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో జేవీ ఏర్పాటు వేగవంతం కావాలని, ఒప్పంద సంతకాలను పూర్తి చేయాలని ఆర్సెలర్ మిట్టల్ సీఈఓ లక్ష్మీ ఎన్ మిట్టల్‌కు గురువారం ఒక లేఖ రాసినట్లు సెయిల్ చైర్మన్ అనిల్ కుమార్ చౌదరి వెల్లడించారు. ‘మిట్టల్ సంస్థ జేవీ ఏర్పాటుకు సుముఖంగానే ఉంది. మావైపు నుంచి మేము కూడా చాలా స్పష్టంగా ఉన్నాం. నిజానికి ఈ నెలలోనే డీల్ పూర్తిచేయాలనుకున్నాం. అయితే, మిట్టల్ సంస్థ వేగంగా లేనందున వచ్చే నెలలో జేవీ ఒప్పంద తుది సంతకాలను పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నాం.’ అని తెలిపారు. -
చైనా ఉక్కు దిగుమతులపై ఆంక్షలు
న్యూఢిల్లీ: దేశీ ఉక్కు పరిశ్రమను ఆదుకోవడంలో భాగంగా పలు రకాల చైనా దిగుమతులపై ప్రభుత్వం యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. టన్ను ఉక్కుపై 185.51 డాలర్లు (రూ.13,622) చొప్పున డ్యూటీని విధిస్తున్నట్లు ప్రకటించిన రెవెన్యూ శాఖ, ఐదేళ్ల వరకు ఈ సుంకం కొనసాగుతుందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు చైనా భారత్‌లో ఉక్కును విక్రయిస్తుందని ఆరోపిస్తూ.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్, ఉషా మార్టిన్, గెర్డావ్ స్టీల్ ఇండియా, వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్, జైస్వాల్ నెకో ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లు సంయుక్తంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్)కు ఇచ్చిన దరఖాస్తును పరిశీలించిన అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలాయ్ బార్స్, స్ట్రయిట్ లెంత్ రాడ్స్ వంటి పలు ఉత్పత్తులపై టన్నుకు 44.89 నుంచి 185.51 డాలర్ల శ్రేణిలో యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 56,690 టన్నులుగా ఉన్నటువంటి వీటి దిగుమతులు.. 2016–17 నాటికి 1,80,959 టన్నులకు పెరిగాయి. మొత్తం ఉక్కు దిగుమతులు 1,32,933 టన్నుల నుంచి 2,56,004 టన్నులకు పెరిగిపోయాయి. ఇదే సమయంలో డిమాండ్ కూడా పెరిగింది. -
ఆరుగురి ఊపిరి తీసిన విషవాయువు
తాడిపత్రి: అనంతపురం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఉక్కు పరిశ్రమలో విషవాయువు లీక్ కావడంతో ఆరుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. తాడిపత్రి మండలంలోని అక్కన్నపల్లి సమీపంలో ఉన్న గెర్డావ్ ఉక్కు పరిశ్రమలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని పిగ్ఐరన్ (ముడి ఇనుము)వేడి చేసేందుకు ఉపయోగించే కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ కావడంతో కార్మికులు కుప్పకూలిపోయారు. పరిశ్రమలోని రోలింగ్ విభాగంలో సుమారు 400 అడుగుల లోతు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న కార్బన్ మోనాక్సైడ్ పైపు వాల్వును ఓ కార్మికుడు తిప్పడంతో అందులోని వాయువు లీకై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన మరో ముగ్గురు కార్మికులు.. స్పృహతప్పి పడిపోయిన సహచరుడిని బయటికి తీసుకొచ్చేందుకు అండర్‌గ్రౌండ్‌లోకి దిగారు. వారు కూడా లోపలికి వెళ్లిన కొన్ని క్షణాల్లోనే ఊపిరాడక అక్కడిక్కడే కుప్పకూలి పోయారు. అక్కడికి వచ్చిన మరో ఇద్దరు కార్మికులు కూడా విషవాయువు పీల్చి స్పృహతప్పిపోయారు. ఈ ఘటన తెలిసి పరిశ్రమలో అలజడి రేగింది. కార్మికులందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్పృహతప్పి పడిపోయిన వారిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారందరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఈఘటనతో తాడిపత్రిలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. మృతుల్లో వసీం, గురువయ్యలు పరిశ్రమ సిబ్బంది కాగా గంగాధర్, లింగమయ్యలు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ డిల్లీరావు, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, ఆర్డీఓ మలోల హుటాహుటీన తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: కార్మికులు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి పలు సంఘటనలు చోటు చేసుకున్నాయని, అయితే పరిశ్రమ యాజమాన్యం వాటిని సహజ మరణాలుగా చిత్రీకరించి వెలుగులోకి రానీయ కుండా చేసిందన్నారు. ప్రశ్నించిన కార్మికులపై యాజ మాన్యం బెదిరింపులకు దిగుతోందని చెప్పారు. రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.. మృతి చెందిన వారి కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం రూ. 50 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో అఖిలపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. అయితే టీడీపీకి చెందిన కొందరు నాయకులు రూ. 5 లక్షల చొప్పున చెల్లిస్తామని చెప్పారు. రూ. 50 లక్షలు ఇవ్వాల్సిందేనని వైఎస్సార్సీపీ నేతలు పట్టుబట్టారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసుల రంగప్రవేశం చేసి ఇరువురికి సర్దిచెప్పారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు ఆందోళన చేస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.రమేశ్‌రెడ్డి, పైల నరసింహయ్య తేల్చిచెప్పారు. పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేస్తాం.. గెర్డావ్ స్టీలు పరిశ్రమలో జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నామని, ఇప్పటికే క్రిమినల్ కేసు కూడా నమోదు చేశామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లిస్తామని జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జరిగిన ఘటనపై విచారణను ఇప్పటికే ప్రారంభించామని పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ తెలిపారు. పరిశ్రమలో ఉన్న సేఫ్టీ పరికరాలు పనిచేస్తున్నాయా లేదా అన్న వివరాలు విచారణలో తెలియాల్సి ఉందన్నారు. మృతులు: 1. రంగనాథ్ (21) (తాడిపత్రి మండలం బోడాయిపల్లి), 2.గంగాధర్ (35) (అనంతపురం జిల్లా తుమ్మళ్ల మార్కపల్లి), 3.వసీమ్ (37) (కర్నూలు జిల్లా బేతంచెర్ల), 4.లింగయ్య (35) (వైఎస్సార్ జిల్లా కోడిగాండ్లపల్లి), 5.గురువయ్య (37) (ప్రకాశం జిల్లా గాండ్లపల్లి), 6.మనోజ్ (25) (అనంతపురం జిల్లా తాడిపత్రి). వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఉక్కు కర్మాగారంలో గ్యాస్ లీకై ఆరుగురు కార్మికులు మృతి చెందడం పట్ల ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కోలుకుంటున్న ఉక్కు పరిశ్రమ
బీకే స్టీల్ డైరెక్టర్ మనవ్ బన్సాల్ సాక్షి, అమరావతి: గత కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న ఉక్కు పరిశ్రమ క్రమేపీ కోలుకుంటోందని, ఈ ఏడాది స్టీల్ డిమాండ్‌లో 8–10 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు కోల్‌కతాకు చెందిన బీకే స్టీల్ డైరెక్టర్ మనవ్ బన్సాల్ తెలిపారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బన్సాల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ మూడు నెలల నుంచి ఇండియాలో ఉక్కు అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి కనపడుతోందన్నారు. దిగుమతులపై ఆంక్షలు విధించడం, ప్రభుత్వ పనులకు మేకిన్ ఇండియా స్టీల్ వినియోగాన్ని తప్పనిసరి చేయడంతో పాటు పరిశ్రమ క్రమేపీ కోలుకుంటోందన్నారు. 2016లో దేశంలో 84 మిలియన్ టన్నుల ఉక్కు వినియోగం కాగా అది ఈ ఏడాది 89 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ఉక్కు పాలసీ ఆశాజనకంగా ఉందని, ఉక్కు వినియోగం 2020 నాటికి 120 మిలియన్ టన్నులు, 2030 నాటికి 200 మిలియన్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. గతేడాది ధరలు 15% పెరగడంతో పరిశ్రమ కోలుకుంటోందన్నారు. ఏపీపై ప్రత్యేక దృష్టి: రాజధాని అమరావతి నిర్మాణంతో రాష్ట్రంలో ఉక్కు వినియోగం బాగా పెరిగే అవకాశం ఉందని బన్సాల్ పేర్కొన్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన తెలిపారు. బీకేస్టీల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 లక్షల టన్నులు కాగా ప్రస్తుతం అందులో సగం 1.50 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 1.80 లక్షల టన్నులకు ఉత్పత్తిని పెంచడమే కాకుండా రెండేళ్లలో పూర్తిస్థాయి ఉత్పత్తిని చేరుకోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.గతేడాది బీకే స్టీల్ మొత్తం అమ్మకాలు రూ. 780 కోట్లు ఉండగా, అది ఈ సంవత్సరం రూ. 850 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. -
ఉక్కు పరిశ్రమ స్థాపించాల్సిందే
కడప ౖÐð ఎస్ఆర్ సర్కిల్: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమస్థాపించి తీరాల్సిందేనని వివిధ పార్టీల నేతలు, నాయకులు, ప్రజాసంఘాల వారు డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో కడప నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కోసం ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ 30 గంటల దీక్షను గురువారం సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా రాయలసీమ కార్మిక, కర్షక అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమను తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు వేదికపైకి వచ్చి ఉక్కు పరిశ్రమ కోసం రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరు ఉక్కు పరిశ్రమ సాధన కోసం పిడికిలి బిగించాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేసిందేది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం జిల్లాకు ఆల్విన్ ఫ్యాక్టరీ, పాలపొడి తయారీ కర్మాగారం, ధర్మల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశార ని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి పేర్కొన్నారు. ఎన్టీఆర్ అల్లుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెనుకబడిన ప్రాంతాలను అణగదొక్కడమే పనిగా పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నాడని దుమ్మెత్తి పోశారు. రాయలసీమ అనాదిగా వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమ స్థాపనలోదోబూచులాట విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కోసం కృషి చేసిందని, అయితే ఈనాడు అధికారంలోకి వచ్చిన కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా దోబూచులాడుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ అన్నారు. ఉక్కు పరిశ్రమకు జిల్లా అనుకూలం కాదని కుంటి సాకులు చెబుతూ కాలం గడుపుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గడ్డుకాలమే రాయలసీమ పట్ల నిర్లక్ష్యం చూపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో గడ్డుకాలం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పేర్కొన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో వివక్షత చూపుతూ అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారని తెలిపారు. రాయలసీమకు అన్నింటిలో అన్యాయమే సీమకు అన్ని విషయాల్లో అన్యాయమే జరుగుతోందని, పరిశ్రమలు తాగు, సాగు నీరు వంటి విషయాల్లో ఏనాడు న్యాయం జరగలేదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.నారాయణ అన్నారు. సీమలోని పాలకుల నిర్లక్ష్య ధోరణితోనే జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు అడ్డంకులు ఏర్పాడ్డాయన్నారు. ప్రతి ఒక్కరు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం రావాలి జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు రాయలసీమలోని పాలకులు, ప్రజలు చైతన్యంగా కలిసి పోరాటం చేయాలని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలు సీమ అభివృద్ధి పట్ల వివక్ష చూపుతూ నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయాలన్నారు. దీక్షకు పలువురి సంఘీభావం ఉక్కు పరిశ్రమ కోసం ఎమ్మెల్సీ గేయానంద్ చేపట్టిన 30 గంటల నిరాహారదీక్షతో పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ అ«ధ్యక్షులు జోగిరామిరెడ్డి, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్ర«ధాన కార్యదర్శి ఓబులేసు రాయలసీమ అభివృద్ది కన్వీనర్ ఓబులేసు, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, మున్సిపల్ వర్కర్స్ వాటర్ సెక్షన్, శానిటేషన్ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. -
ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : టీడీపీ ప్రభుత్వం రాయలసీమను ఎడారి ప్రాంతంగా మారుస్తోందని రాయలసీమ విద్యార్థి,యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ సుబ్బరాయుడు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు జిల్లాలోఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన హక్కు చట్టంలో జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్రం విyì పోయి 4 సంవత్సరాలు కావస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. జిల్లాకు ఉర్దూ యూనివర్సిటీని కేటాయించి, ఇతర ప్రాంతాలకు తీసుకుపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం జిల్లాను అన్ని విధాలుగా అబివృద్ది చేసి మూతపడిన పరిశ్రమలను తెరిపించేదుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌వైఎఫ్ నాయకులు పుల్లయ్య, శివారెడ్డి , రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్టీల్ దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం!
♦ ఇది టన్నుకు 557 డాలర్లు వరకు ఉండొచ్చు ♦ ఎంఐపీపై కేంద్ర నిర్ణయం స్టీల్ పరిశ్రమకు కీలకం: ఇక్రా న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశంలోకి దిగుమతయ్యే పలు స్టీల్ ప్రొడక్ట్స్‌పై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించనుంది. ఇది టన్నుకు 557 డాలర్ల వరకు ఉండొచ్చని తె లుస్తోంది. చైనా, జపాన్, కొరియా, రష్యా, బ్రెజిల్, ఇండోనేసియా దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే అలాయ్/నాన్ అలాయ్ స్టీల్ హాట్ రోల్డ్ ఫ్లాట్ ప్రొడక్ట్స్ ధరలు సాధారణ స్థాయి కన్నా తక్కువ గా ఉన్నట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ డంపింగ్ అండ్ అలీడ్ డ్యూటీస్ (డీజీఏడీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి మన దేశ ంలోకి వచ్చే పలు స్టీల్ ఉత్పత్తులపై టన్నుకు 474-557 డాలర్ల స్థాయిలో యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా ఇతర దేశాల నుంచి మనకు దిగుమతి అవుతున్న పలు స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకం విధించాలని ఎస్సార్ స్టీల్ ఇండియా, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా డీజీఏడీని ఇదివరకే అభ్యర్థించాయి. కేంద్రపు ఎంఐపీ నిర్ణయంపైనే స్టీల్ పరిశ్రమ భవితవ్యం: ఇక్రా కేంద్ర ప్రభుత్వం కనీస దిగుమతి ధర (ఎంఐపీ) అంశంపై తీసుకోనున్న నిర్ణయంపైనే దేశీ స్టీల్ పరిశ్రమ భవిష్యత్తు ఆధారపడి ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లోని మిగులు ఉత్పత్తి, అధిక దిగుమతులు, చౌక ధరలు వంటి అంశాల కారణంగా దేశీ స్టీల్ పరిశ్రమ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపింది. ఎంఐపీని ఆగస్ట్ 5 తర్వాత కొనసాగించాలా? వద్దా? అనే అంశం పరిశ్రమకు చాలా కీలకమని అభిప్రాయపడింది. విదేశాల నుంచి ఉప్పెనలా వస్తోన్న స్టీల్ దిగుమతులకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్రం ఫిబ్రవరిలో దాదాపు 173 స్టీల్ ఉత్పత్తులపై ఎంఐపీని విధించింది. దీంతో వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్-మే కాలంలో స్టీల్ దిగుమతులు 30 శాతం తగ్గాయని తెలిపింది. అలాగే జూన్ మధ్య నాటికి స్టీల్ ధరలు 25 శాతంమేర పెరిగాయని పేర్కొంది. ఈ చర్యలు స్టీల్ కంపెనీలకు ఊరట కలిగించేవని పేర్కొంది. ఇక ఎంఐపీ కొనసాగింపుపై గత కొన్ని రోజులుగా నెలకొని ఉన్న అస్థిర పరిస్థితుల వల్ల స్టీల్ ధరలు గత నెల రోజుల్లో 8 శాతం మేర క్షీణించాయని తెలిపింది. -
ఉక్కు పరిశ్రమపై అసెంబ్లీలో చర్చిస్తా
కమలాపురం అర్బన్: జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనపై అసెంబ్లీలో చర్చిస్తానని ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సీపీఐ ఏరియా కార్యదర్శి, మండల కార్యదర్శి చంద్ర, సుబ్బరాయుడు ఆయనకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వైఎస్సార్ జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, రాష్ట్రం విడిపోయి రెండేళ్లవుతున్నా ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు అసెంబ్లీలో వైఎస్సార్సీపీ చర్చించినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం జిల్లా వాసులు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే విషయంలో వైఎస్సార్సీపీ ముందుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, సీఎస్ నారాయణరెడ్డి, ఎన్సీ పుల్లారెడ్డి, ఎంపీటీసీ ఇర్ఫాన్‌బాషా, సుమీత్రా రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కు పరిశ్రమ కోసం రోడ్డెక్కిన ప్రజ సంఘాలు
-
మహబూబ్‌నగర్ జిల్లాలో మెగా స్టీల్ ప్లాంటు
-
మహబూబ్‌నగర్ జిల్లాలో మెగా స్టీల్ ప్లాంటు
- రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన జైరాజ్ ఇస్పాత్ - మహబూబ్‌నగర్ జిల్లా ధరూరు మండలం చింతరేవులలో 250 ఎకరాల్లో స్థాపనకు ప్రతిపాదన - 10 లక్షల టన్నుల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో రెండు దశల్లో ఏర్పాటు - 1,200 మందికి ప్రత్యక్షంగా, 4,700 మందికి పరోక్షంగా ఉపాధి - మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధి సమావేశం... పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదన గురించి వెల్లడి - వెంటనే అనుమతులివ్వాలని పరిశ్రమల శాఖకు మంత్రి ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుంది. మహబూబ్‌నగర్ జిల్లా ధరూరు మండలంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో మెగా స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు బళ్లారికి చెందిన జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ ముందుకొచ్చింది. రెండు దశల్లో ప్లాంటు నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 10 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నెలకొల్పాలనుకుంటున్న స్టీల్ ప్లాంటు స్థాపనలో సహకరించాలని కోరుతూ సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సిద్ధార్థ జైన్ బుధవారం రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె. తారక రామారావును కలిశారు. ప్రతిపాదిత ప్లాంటు ప్రత్యేకతలను ఆయనకు వివరించారు. వివిధ రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను పరిశీలించాక తెలంగాణలో పరిశ్రమ స్థాపనకు నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వేగవంతమైన నిర్ణయాలపై పారిశ్రామికవర్గాల్లో సానుకూల స్పందన ఉందని తెలిపారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్...ప్లాంటు ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్లాంటు ఏర్పాటుకు సత్వర అనుమతులు జారీ చేయాలని పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌ను, కంపెనీ ప్రతినిధులకు క్షేత్రస్థాయిలో సహకరించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవిని ఆదేశించారు. ఈ ప్లాంటు ద్వారా 1,200 మందికి ప్రత్యక్షంగా, 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పరిశ్రమలశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కర్ణాటక నుంచి ఇనుప ఖనిజం... ఫ్యాక్టరీ స్థాపనకు అవసరమైన 250 ఎకరాలను ధరూరు మండలం చింతరేవులో జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ ఇప్పటికే సేకరించింది. దేశంలోని దిగ్గజ కంపెనీలు తయారు చేసే ఉక్కుకన్నా ఉన్నత ప్రమాణాలు కలిగిన స్టీల్‌ను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని సంస్థ పేర్కొంటోంది. స్టీలు ప్లాంటుకు అవసరమైన ఇనుప ఖనిజం రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో కర్ణాటకలోని బళ్లారి నుంచి ముడి ఇనుప ఖనిజాన్ని దిగుమతి చేసుకునే యోచనలో సంస్థ ఉన్నట్లు సమాచారం. ప్రతిపాదిత ప్లాంటు ప్రాంతం కర్ణాటకకు అత్యంత సమీపంలో ఉండటం, జూరాల ప్రాజెక్టు సమీపంలో ఉండటం, రైలు మార్గంతో సులభంగా అనుసంధానమయ్యే అవకాశం ఉండటంతో మెగా స్టీలు ప్లాంటు స్థాపనకు చింతరేవులను సంస్థ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా ముడి ఖనిజం ఎంత మేర అవసరం అవుతుందనే వివరాలపై త్వరలో స్పష్టత వస్తుందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలోనే తొలి స్టీలు ప్లాంటు... రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఖమ్మం జిల్లా బయ్యారంలో మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంగల సమీకృత ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నెలకొల్పాల్సి ఉంది. తొలి దశలో రూ. వెయ్యి కోట్ల వ్యయంతో బెనిఫికేషన్, పెల్లెట్ ప్లాంటు, రెండో దశలో ఉక్కు తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామని సెయిల్ ప్రకటించింది. అయితే 200 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉంటేనే కర్మాగారం ఏర్పాటు సాధ్యమవుతుందని సెయిల్ పేర్కొనడంతో ఐదు జిల్లాల పరిధిలో ముడి ఇనుప ఖనిజం లభ్యతపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో వివిధ సంస్థల ద్వారా సంయుక్త సర్వే జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు బ్లాకులకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇచ్చేందుకు జీఎస్ఐ సన్నాహాలు చేస్తోంది. అయితే సెయిల్ ప్రతిపాదనలు పట్టాలెక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ రాష్ట్రంలోనే తొలి మెగా స్టీలు ప్లాంటు స్థాపనకు ముందుకు రావడం విశేషం. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ. 8,636 కోట్లు
ఉక్కునగరం(విశాఖ): దేశీయ ఉక్కు పరిశ్రమ సంక్షోభంలో ఉన్నప్పటికీ విశాఖ స్టీల్‌ప్లాంట్ ఈ ఆర్థిక(2015-16) సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఉత్పత్తి, అమ్మకాల్లో మంచి ప్రగతి కనబరచింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే తొమ్మిది నెలలతో పోలిస్తే సేలబుల్ స్టీల్ ఉత్పత్తిలో 21 శాతం వృద్ధి సాధించడంతో పాటు బ్లాస్ట్‌ఫర్నెస్ ఉత్పాదకత, తలసరి నీటి వినియోగం, కార్మిక ఉత్పాదకతలో వృద్ధి సాధించింది. సింటర్, ద్రవ ఉక్కు, వైర్ రాడ్ల ఉత్పత్తిలో ఈ మూడో త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధించింది. అదే విధంగా ఎగుమతుల్లో 28 శాతం వృద్ధితో రూ. 935 కోట్లకు చేరగా, ఈ తొమ్మిది నెలల్లో అమ్మకాలు 8 శాతం వృద్ధితో రూ. 8,636 కోట్లకు పెరిగాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 5 లక్షలు టన్నుల అమ్మకాలతో రూ. 1,617 కోట్లు సాధించడం గమనార్హం. అమ్మకాల్లో చూపుతున్న ప్రగతికి గాను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ కౌన్సిల్ స్టీల్‌ప్లాంట్‌కు వరుసగా రెండోసారి స్టార్ ఫెర్ఫార్మర్ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎండీ పి.మధుసూదన్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో వార్షిక లక్ష్యాలను అధిగమించగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉత్తుత్తి మాటలే!
ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆచరణ దిశగా అడుగు ముందుకు పడుతున్న సూచనలు కనిపించడంలేదు. పెపైచ్చు సిద్ధమైన విమానాశ్రయూన్ని కూడా ప్రారంభించకుండా రాజకీయ వివక్ష ప్రదర్శిస్తున్నారు. వైఎస్ హయూంలో ఐదేళ్లు మినహా దశాబ్దాలుగా జిల్లా అభివృద్ధి విషయంలో వివక్ష కనిపిస్తూనే ఉంది. జిల్లాకు మరోమారు ‘చంద్ర’గ్రహణం పట్టింది. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన మౌళిక సదుపాయాలు అందుబాటులో ఉన్నా నిష్ర్పయోజనమే అవుతోంది. గత ఆరు నెలల చంద్రబాబు పాలన తీరును విశ్లేషిస్తే ఇది కాదనలేని వాస్తవం. గత ఆరు నెలల్లో వివిధ సందర్భాల్లో సీఎం చంద్రబాబు జిల్లాకు ప్రకటించిన వరాలివి ⇒ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం విశేషంగా కృషి ⇒ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతాం.. ⇒ పండ్ల రైతుల కోసం మెగా ఫుడ్‌పార్క్ ఏర్పాటు ⇒ రాజంపేటలో హార్టికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటు... ⇒ చేనేతల కోసం మైలవరంలో టెక్స్టైల్స్ పార్క్.. ⇒ ప్రొద్దుటూరులో అఫెరల్ పార్క్.. ⇒ జిల్లాలో పిలిగ్రిమ్ టూరిస్టు సర్క్యూట్.. ⇒ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి.. ⇒ కడప-చైన్నై నాలుగు లైన్లు రహదారి విస్తరణ.. ⇒ ఏపిఐఐసీ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పుతాం.. సాక్షి ప్రతినిధి,కడప: పరిశ్రమల కోసం ఎదురుచూపులు.. ఉపాధి అవకాశాలను పెంచితే ఫ్యాక్షన్‌ను లేకుండా చేయవచ్చనే లక్ష్యంతో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సిద్ధమయ్యారు. కడప సమీపంలో ఏపీఐసీసీ ద్వారా భూములు సేకరించి కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశారు. 6464.5 ఎకరాలు భూమిని సిద్ధంగా ఉంచారు. ఆ తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. అదేబాటలో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నడుస్తున్నట్లుంది. రాష్ట్ర విభజన అనంతరం అన్ని జిల్లాల్లో అటు పారిశ్రామికంగానో, ఇటు వైద్యం, అత్యున్నత విద్య పరంగానో అభివృద్ధికి ప్రతిపాదనలు, చర్యలు కన్పించాయి. ఒక్క వైఎస్సార్ జిల్లాకు మాత్రమే అలాంటి జాబితాలో చోటు దక్కడం లేదని జిల్లా వాసులు మదనపడుతున్నారు. సాగునీటి పథకాలు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి. సమీక్షలు మినహా ఎలాంటి పురోగతి లేకపోయింది. తుదకు వరదనీరు శ్రీశైలం జలాశయం నుంచి సముద్రం పాలైంది, అరుునా వైఎస్సార్ జిల్లాలోని జలాశయాలకు మళ్లించలేని దుస్థితిలో పాలకులు ఉండిపోయారనే విమర్శలు బలంగా ఉన్నాయి. అడుగడుగునా రాజకీయ వివ క్షే.... వైఎస్సార్ జిల్లా పట్ల అడుగడుగునా రాజకీయ వివక్ష కన్పిస్తోంది. తుదకు ముఖ్యమంత్రి పర్యటనలోనూ అదేధోరణి అవలంబించారన్న విమర్శలు ఉన్నారుు. ఆరునెలల కాలంలో ప్రతి జిల్లాలో మూడుసార్లు పర్యటించారు. జిల్లాకు మాత్రం జన్మభూమి- మాఊరులో భాగంగా తప్పని పరిస్థితుల్లో ఒక్కమారు హాజరయ్యారు. రాజకీయ వివక్షలో భాగంగానే తుదకు విమానాశ్రమం సైతం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. జిల్లా పారిశ్రామిక వృద్ధితో పాటు విద్య, వైద్య రంగాల్లో పురోగతిని సాధించడంతో జిల్లా కేంద్రానికి విమాన సౌకర్యం అనివార్యమైంది. రిమ్స్, వైవీయూ నెలకొన్న నేపధ్యంలో ప్రముఖులు రాకపోకలు, యర్రగుంట్ల సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో పాటు ఇతర వ్యాపారులకు కూడా కడప నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారలావాదేవీల కోసం తరచూ వెళ్లేవారందరికీ కడప ఏయిర్పోర్టు సౌలభ్యంగా ఉంటుంది. విమానాశ్రయం నుంచి ‘కనెక్టింగ్ ఫ్లైట్స్’ నడుస్తాయనే ఆలోచనకు దూరం చేశారనే విశ్లేషలు భావిస్తున్నారు. గత నెల 8న రైల్వేకోడూరు మండలం ఓబనపల్లెలో పర్యటించినప్పుడూ సీఎం బాబు జిల్లాకు వరాల జల్లులు కురిపించారు. అసెంబ్లీలో రాజధాని ప్రకటన చేసిన రోజు సైతం ఆదేరీతిలో హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఆచరణలో ఆదేశాలు జారీ కాలేదు. తుదకు రూ.20వేల కోట్లుతో ఉక్కు పరిశ్రమను సెయిల్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆమేరకు జిఓఎం(గ్రూప్స్ ఆప్ మినిష్టర్స్) నోట్లో ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రయత్నం కన్పించలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆరునెలలు పాలనలో జిల్లాకు ఒరిగింది ఏమి లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పూర్వపు వివక్షత మరోమారు స్పష్టంగా కన్పిస్తోందనేది మాత్రం కాదనలేని సత్యం. -
పరిశ్రమలకు తాళం.. బతుకు ఆగం
జిన్నారం: కరెంటు కోతలు...అంచనా మేరకు కాని ఉత్పత్తి...అర్డర్లూ అంతంతమాత్రం..దీంతో పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. రోజుకో ఫ్యాక్టరీ మూతపడుతుంటే మెతుకుసీమకే తలమానికంగా ఉన్న పారిశ్రామిక వాడలన్నీ వెలవెలబోతున్నాయి. ఏడాది క్రితం లాభాల్లో ఉన్న పరిశ్రమలు కూడా ఇపుడు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి. విధిలేని పరిస్థితుల్లో యాజమాన్యాలు గేట్లు మూసేస్తుండడంతో కార్మికులు వీధిన పడుతున్నారు. బహుళ సంస్థలకు చెందిన పరిశ్రమలు నడుస్తున్నా, చిన్న పరిశ్రమలు మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 50 వేల మంది భవిష్యత్ అగమ్యగోచరం జిన్నారం మండలంలోని బొంతపల్లి, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొల్లారం గ్రామాల్లో సుమారు 200పైగా వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటిల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది కార్మికులు జీవనోపాధిని పొందుతున్నారు. రాష్ట్రం విడిపోవడం...కరెంటు కోతల ప్రభావం పరిశ్రమలపై భారీ చూపుతోంది. కరెంటు కోతల నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం...నిర్ణీత సమయానికి డెలివరీ ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్డర్లు కూడా ఇపుడు రద్దయ్యాయి. దీంతో చిన్నా, చితక కంపెనీలన్నీ ఇప్పటికే మూతపడ్డాయి. చాలా కంపెనీలు తాత్కాలికంగా గేట్లు మూసేశాయి. మరికొన్ని నడుస్తున్నా కార్మికులకు పూర్తిస్థాయిలో పని దొరకడం లేదు. ఒక్క జిన్నారం మండలంలో సుమారు 50 వరకు చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. మరో 30 వరకు పరిశ్రమలు తాత్కాలికంగా ఉత్పత్తులను నిలిపివేశాయంటే పరిశ్రమల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోడ్డునపడ్డ జీవితాలు పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతుండడంతో వాటిల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పరిశ్రమలు మూతపడడంతో జిన్నారం మండలంలోనే సుమారు 15 వేల మంది కార్మికులు వీధిన పడాల్సి వచ్చింది. దీంతో వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కార్మికులకు ప్రస్తుతం పనులు లేకపోవటంతో ఉపాధి కో సం రోడ్ల వెంట తిరుగుతున్నారు. నడుస్తున్న కొన్ని పరిశ్రమలు కూడా స్థానికులకు ఉపాధిని కల్పించటం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక బడుగు జీవులు అల్లాడిపోతున్నారు. స్టీల్ పరిశ్రమలకూ గడ్డుకాలం జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల్లో సుమారు 30 వరకు స్టీల్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమ నడిపేందుకు ఎక్కువ మొత్తంలో విద్యుత్ అవసరం. ప్రస్తుతం తీవ్రమైన కరెంటు సమస్య వల్ల స్టీల్ పరిశ్రమలు పూర్తిగా మూతపడే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ పరిశ్రమల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు జీవనోపాధి లేక అవస్థలు పడుతున్నారు. పరిశ్రమలు మూతకు గల కారణాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తీవ్ర విద్యుత్ కోతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హుదూద్ తుఫాన్ రావటంతో ఇక్కడి ఉత్పత్తులను అక్కడికి సరఫరా చేయలేకపోవటం. రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఎగుమతులు, దిగుమతుల్లో అదనపు పన్నుల భారం. పెద్ద పరిశ్రమలు చిన్న పరిశ్రమలకు తగిన ఆర్డర్లు ఇవ్వక పోవటం. కష్టపడి పరిశ్రమను నడిపినా లాభాలు లేకపోవటం.