ఉక్కు పరిశ్రమ స్థాపించాల్సిందే | steel industry our demand | Sakshi
Sakshi News home page

ఉక్కు పరిశ్రమ స్థాపించాల్సిందే

Published Fri, Sep 16 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

ఉక్కు పరిశ్రమ స్థాపించాల్సిందే

ఉక్కు పరిశ్రమ స్థాపించాల్సిందే

కడప ౖÐð ఎస్‌ఆర్‌ సర్కిల్‌:
విభజన  చట్టంలో పేర్కొన్న విధంగా వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమస్థాపించి తీరాల్సిందేనని వివిధ పార్టీల నేతలు, నాయకులు, ప్రజాసంఘాల వారు డిమాండ్‌ చేశారు. రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో కడప నగరంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కోసం ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ 30 గంటల దీక్షను గురువారం సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా రాయలసీమ కార్మిక, కర్షక అధ్యక్షుడు సీహెచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి  మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమను తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు వేదికపైకి వచ్చి ఉక్కు పరిశ్రమ కోసం రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరు ఉక్కు పరిశ్రమ సాధన కోసం పిడికిలి బిగించాలని కోరారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేసిందేది
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం జిల్లాకు ఆల్విన్‌ ఫ్యాక్టరీ, పాలపొడి తయారీ కర్మాగారం, ధర్మల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశార ని జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ అల్లుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెనుకబడిన ప్రాంతాలను అణగదొక్కడమే పనిగా పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నాడని దుమ్మెత్తి పోశారు. రాయలసీమ అనాదిగా వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 ఉక్కు పరిశ్రమ స్థాపనలోదోబూచులాట
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కోసం కృషి చేసిందని, అయితే ఈనాడు అధికారంలోకి వచ్చిన కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా దోబూచులాడుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్‌ అన్నారు. ఉక్కు పరిశ్రమకు జిల్లా అనుకూలం కాదని కుంటి సాకులు చెబుతూ  కాలం గడుపుతోందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గడ్డుకాలమే
రాయలసీమ పట్ల నిర్లక్ష్యం చూపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో గడ్డుకాలం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య  పేర్కొన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో వివక్షత చూపుతూ అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారని తెలిపారు.
రాయలసీమకు అన్నింటిలో అన్యాయమే
సీమకు అన్ని విషయాల్లో అన్యాయమే జరుగుతోందని, పరిశ్రమలు తాగు, సాగు నీరు వంటి విషయాల్లో ఏనాడు న్యాయం జరగలేదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.నారాయణ అన్నారు. సీమలోని పాలకుల నిర్లక్ష్య  ధోరణితోనే జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు అడ్డంకులు ఏర్పాడ్డాయన్నారు. ప్రతి ఒక్కరు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజల్లో చైతన్యం రావాలి
జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు రాయలసీమలోని పాలకులు, ప్రజలు చైతన్యంగా కలిసి పోరాటం చేయాలని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ జయశ్రీ అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలు సీమ అభివృద్ధి పట్ల వివక్ష చూపుతూ నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయాలన్నారు.
దీక్షకు పలువురి సంఘీభావం
ఉక్కు పరిశ్రమ కోసం ఎమ్మెల్సీ గేయానంద్‌ చేపట్టిన 30 గంటల నిరాహారదీక్షతో పలువురు నేతలు సంఘీభావం  తెలిపారు. ప్రైవేటు స్కూల్‌ అసోసియేషన్‌ అ«ధ్యక్షులు జోగిరామిరెడ్డి, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్ర«ధాన కార్యదర్శి ఓబులేసు రాయలసీమ అభివృద్ది కన్వీనర్‌  ఓబులేసు, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, మున్సిపల్‌ వర్కర్స్‌ వాటర్‌ సెక్షన్, శానిటేషన్‌ ఉద్యోగులు బైక్‌ ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement