mlc gayanand
-
ఉక్కు పరిశ్రమ స్థాపించాల్సిందే
కడప ౖÐð ఎస్ఆర్ సర్కిల్: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమస్థాపించి తీరాల్సిందేనని వివిధ పార్టీల నేతలు, నాయకులు, ప్రజాసంఘాల వారు డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో కడప నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కోసం ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ 30 గంటల దీక్షను గురువారం సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా రాయలసీమ కార్మిక, కర్షక అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమను తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు వేదికపైకి వచ్చి ఉక్కు పరిశ్రమ కోసం రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరు ఉక్కు పరిశ్రమ సాధన కోసం పిడికిలి బిగించాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేసిందేది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం జిల్లాకు ఆల్విన్ ఫ్యాక్టరీ, పాలపొడి తయారీ కర్మాగారం, ధర్మల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశార ని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి పేర్కొన్నారు. ఎన్టీఆర్ అల్లుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెనుకబడిన ప్రాంతాలను అణగదొక్కడమే పనిగా పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నాడని దుమ్మెత్తి పోశారు. రాయలసీమ అనాదిగా వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్కు పరిశ్రమ స్థాపనలోదోబూచులాట విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన కోసం కృషి చేసిందని, అయితే ఈనాడు అధికారంలోకి వచ్చిన కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా దోబూచులాడుతున్నాయని డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ అన్నారు. ఉక్కు పరిశ్రమకు జిల్లా అనుకూలం కాదని కుంటి సాకులు చెబుతూ కాలం గడుపుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గడ్డుకాలమే రాయలసీమ పట్ల నిర్లక్ష్యం చూపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో గడ్డుకాలం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పేర్కొన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో వివక్షత చూపుతూ అన్ని విధాలా అన్యాయం చేస్తున్నారని తెలిపారు. రాయలసీమకు అన్నింటిలో అన్యాయమే సీమకు అన్ని విషయాల్లో అన్యాయమే జరుగుతోందని, పరిశ్రమలు తాగు, సాగు నీరు వంటి విషయాల్లో ఏనాడు న్యాయం జరగలేదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.నారాయణ అన్నారు. సీమలోని పాలకుల నిర్లక్ష్య ధోరణితోనే జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు అడ్డంకులు ఏర్పాడ్డాయన్నారు. ప్రతి ఒక్కరు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం రావాలి జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు రాయలసీమలోని పాలకులు, ప్రజలు చైతన్యంగా కలిసి పోరాటం చేయాలని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలు సీమ అభివృద్ధి పట్ల వివక్ష చూపుతూ నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయాలన్నారు. దీక్షకు పలువురి సంఘీభావం ఉక్కు పరిశ్రమ కోసం ఎమ్మెల్సీ గేయానంద్ చేపట్టిన 30 గంటల నిరాహారదీక్షతో పలువురు నేతలు సంఘీభావం తెలిపారు. ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ అ«ధ్యక్షులు జోగిరామిరెడ్డి, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్ర«ధాన కార్యదర్శి ఓబులేసు రాయలసీమ అభివృద్ది కన్వీనర్ ఓబులేసు, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, మున్సిపల్ వర్కర్స్ వాటర్ సెక్షన్, శానిటేషన్ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. -
అంధ పోస్టులను భర్తీ చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అంధ అభ్యర్థులకు కేటాయించిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ గేయానంద్ డిమాండ్ చేశారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న అంధ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం డీఈఓ కార్యాలయం ఎదుట అంధ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనకు గేయానంద్ మద్ధతు తెలిపి మాట్లాడారు. అంధుల పట్ల ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. జిల్లాలో తొమ్మిది మంది అంధ అభ్యర్థులు 2014 డీఎస్సీలో ఎంపికయ్యాయరన్నారు. వీరిలో కొందరు నకిలీ ధ్రువీకరణ పత్రాలు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ జిల్లా, నగర కార్యదర్శులు కసాపురం ఆంజనేయులు, నూరుల్లా మాట్లాడుతూ అంధుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు. వారి సమస్యలు పరిష్కరించే దాకా పోరాటాలు చేస్తామన్నారు. పరీక్షల సమయంలో కొందరు నకిలీ అభ్యర్థులు, బాగా చదువుకున్న వారిని సహాయకులుగా పెట్టుకుని పరీక్షలు రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అలాగే అర్హులైన అంధులకు మాత్రం పదో తరగతి విద్యార్థులను సహాయకులుగా నియమించారన్నారు. ఈ వ్యవహారం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారిందని ఆరోపించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు రాజు, కుమార్, సాంబ, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సూర్యచంద్రయాదవ్, అంధులు నారాయణస్వామి, హరి, సురేష్, నరసింహ, సుధాకర్, తిప్పయ్య పాల్గొన్నారు. -
కడప ఉక్కుపై కుంటి సాకులు
కడప సెవెన్‌రోడ్స్: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దారుణమని ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ అన్నారు. సోమవారం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం పైవిధంగా ప్రకటన చేయడం సరికాదన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఆర్థికంగా లాభదాయకం కాదని, ముడిఖనిజం కూడా లభ్యం కాదనడం కుంటిసాకులేనన్నారు. ఇది విభజన హామిని అమలు చేయబోమంటూ ప్రకటించడమేనన్నారు. విశాఖ స్టీల్‌కు ఉత్తర భారతం దేశం నుంచి ముడిఖనిజం సరఫరా అవుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పది రోజుల్లో సెయిల్, ఎన్ఎండీసీ, బీఐఎన్‌ఎల్ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఓవైపు చెబుతూనే, కడప స్టీల్ ప్లాంటు సాధ్యం కాదని ముందే ఎలా ప్రకటిస్తారంటూ ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి తన వద్ద ఉన్న నివేదికపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు వీలు కాదంటూ చేసిన ప్రకటనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. కేంద్రం అంగీకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రూ. 10 వేల కోట్లతో కడపలో ప్లాంటు ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడి ఫ్యాక్షనిజం కారణంగా పరిశ్రమలు రావడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం అర్థరహితమన్నారు. స్టీల్ ప్లాంటు అంశంపై రానున్న శాసనమండలి సమావేశాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. రాయలసీమ అభివృద్ది వేదిక నాయకుడు ఎ.రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేదని మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం, విభజన చట్టంలో పొందుపరిచిన కడప స్టీల్ ప్లాంటును ఎందుకు ఏర్పాటు చేయడం లేదో చెప్పాలని నిలదీశారు. ఈ సమావేశంలో రాయలసీమ అభివృద్ది వేదిక నాయకులు పి.మహమ్మద్ అలీఖాన్, లక్ష్మిరాజా, రాజశేఖర్ రాహుల్, కె.శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థపై నిర్లక్ష్యం
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ విద్యా వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలను ప్రొత్సహిస్తోందని ఎమ్మెల్సీ గేయానంద్, మాజీ ఎమ్మెలీ పొచంరెడ్డి సుబ్బారెడ్డిలు ధ్వజమొత్తారు. కడపలోని ఇంటర్ ఆర్జేడీ కార్యాలయం ఎదుట సోమవారం రాయలసీమజోన్కు చెందిన నాలుగు జిల్లాలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యాసంస్థలకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామన్నది కేవలం ఒట్టిమాటేనన్నారు. కళాశాలలు తెకిచి రెండు నెలలు అయినా నేటికి వారికి రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలేదని మండిపడ్డారు. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఆధ్యక్షుడు ఇకీల్, సెక్రటరీ జానీబాబు, ముఖ్యకార్యదర్శి ఉమాదేవిలు మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చర ర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలలు తెరిచినప్పటి నుంచి కళాశాలలు మూసే వరకూ ఒకే ఉత్తర్వును ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు యల్లారెడ్డి, కాంట్రాక్టు అవుట్‌సోర్సింట్ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మిరాజా, ఏపీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గంగాసురేస్తోపాటు చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆర్ఎస్నాయుడు, సెక్రటరీ చంద్రప్ప, ముఖ్య కార్యదర్శి లత, అనంతపురం జిల్లా అధ్యక్షుడు రవి రాజు, ఉపాధ్యక్షుడు అక్బర్, సెక్రటరీ రామాంజులు, కర్నూల్ జిల్లా అధ్యక్షుడు మెహన్, ఉపాధ్యక్షుడు మాచర్ల, సెక్రటరీ కిషోర్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వానికి సిగ్గులేదు’
అనంతపురం: ఆశా వర్కర్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ... వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వడానికి డబ్బులు లేవని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిగ్గులేదని ఎమ్మెల్సీ గేయానంద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 'ఆశావర్కర్లకు ఇచ్చే కొద్దిపాటి గౌరవ వేతనం ఇచ్చేందుకు డబ్బులు లేవని చెబుతున్నారు. చంద్రబాబు అమరావతి శంకుస్థాపనకు రూ.400 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయంలో చంద్రబాబు ఛాంబర్ కోసం ఒక ఫ్లోర్లో మరమ్మత్తులకు రూ.30 కోట్లు ఖర్చు పెట్టారు. అక్కడ వాస్తు బాగా లేదంటూ మరో ఫ్లోర్లో ఛాంబర్ ఏర్పాటుకు రూ.15 కోట్లు ఖర్చు చేశారు' అని గేయానంద్ విమర్శించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి నెలసరి రూ.2 లక్షలు అద్దె చెల్లించేందుకు మాత్రం డబ్బులు ఉంటాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు చేస్తున్న పనికి కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలన్నారు. ఏ భాషలో చెప్పినా ఈ ప్రభుత్వానికి అర్థం కావడంలేదని... పోరాట బాట ద్వారానే సమస్యలు తెలియజేసి సాధించుకోవాలని అన్నారు. ఇది ఒక్కసారితో కాదని, సాధించుకునే వరకు పోరాటం చేయాల్సిందేనని మహిళలకు గేయానంద్ పిలుపునిచ్చారు.