విద్యావ్యవస్థపై నిర్లక్ష్యం
కడప ఎడ్యుకేషన్:
ప్రభుత్వ విద్యా వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలను ప్రొత్సహిస్తోందని ఎమ్మెల్సీ గేయానంద్, మాజీ ఎమ్మెలీ పొచంరెడ్డి సుబ్బారెడ్డిలు ధ్వజమొత్తారు. కడపలోని ఇంటర్ ఆర్‌జేడీ కార్యాలయం ఎదుట సోమవారం రాయలసీమజోన్‌కు చెందిన నాలుగు జిల్లాలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యాసంస్థలకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామన్నది కేవలం ఒట్టిమాటేనన్నారు. కళాశాలలు తెకిచి రెండు నెలలు అయినా నేటికి వారికి రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలేదని మండిపడ్డారు. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఆధ్యక్షుడు ఇకీల్, సెక్రటరీ జానీబాబు, ముఖ్యకార్యదర్శి ఉమాదేవిలు మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చర ర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
కళాశాలలు తెరిచినప్పటి నుంచి కళాశాలలు మూసే వరకూ ఒకే ఉత్తర్వును ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు యల్లారెడ్డి, కాంట్రాక్టు అవుట్‌సోర్సింట్ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మిరాజా, ఏపీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గంగాసురేస్‌తోపాటు చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆర్‌ఎస్‌నాయుడు, సెక్రటరీ చంద్రప్ప, ముఖ్య కార్యదర్శి లత, అనంతపురం జిల్లా అధ్యక్షుడు రవి రాజు, ఉపాధ్యక్షుడు అక్బర్, సెక్రటరీ రామాంజులు, కర్నూల్ జిల్లా అధ్యక్షుడు మెహన్, ఉపాధ్యక్షుడు మాచర్ల, సెక్రటరీ కిషోర్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.