government neglected
-
గల్ఫ్ బాధితులను ఆదుకోరా?: సురేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లలో 6 వందల మంది గల్ఫ్‌లో చనిపోయారని, అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలేదని మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ గల్ఫ్ ఎన్ఆర్ఐల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్ఆర్ఐ పాలసీని రూపొందిస్తున్నట్టుగా ప్రకటించి ఏడాది దాటినా అతీగతీలేదన్నారు. పాలసీ పూర్తిచేయాలంటూ ఎన్ఆర్ఐ ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇచ్చినా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. మూడేళ్లలో ఆరు వందల మంది గల్ఫ్‌లో చనిపోయారని, బాధితులకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా సహాయం అందలేదని చెప్పారు. అక్కడ జైళ్లలో ఉన్న తెలంగాణవారికి న్యాయపరమైన సహాయం కూడా ప్రభుత్వం నుంచి అందించడంలేదని సురేశ్‌రెడ్డి విమర్శించారు. -
విద్యావ్యవస్థపై నిర్లక్ష్యం
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ విద్యా వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలను ప్రొత్సహిస్తోందని ఎమ్మెల్సీ గేయానంద్, మాజీ ఎమ్మెలీ పొచంరెడ్డి సుబ్బారెడ్డిలు ధ్వజమొత్తారు. కడపలోని ఇంటర్ ఆర్జేడీ కార్యాలయం ఎదుట సోమవారం రాయలసీమజోన్కు చెందిన నాలుగు జిల్లాలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యాసంస్థలకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామన్నది కేవలం ఒట్టిమాటేనన్నారు. కళాశాలలు తెకిచి రెండు నెలలు అయినా నేటికి వారికి రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలేదని మండిపడ్డారు. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఆధ్యక్షుడు ఇకీల్, సెక్రటరీ జానీబాబు, ముఖ్యకార్యదర్శి ఉమాదేవిలు మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చర ర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలలు తెరిచినప్పటి నుంచి కళాశాలలు మూసే వరకూ ఒకే ఉత్తర్వును ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు యల్లారెడ్డి, కాంట్రాక్టు అవుట్‌సోర్సింట్ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మిరాజా, ఏపీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గంగాసురేస్తోపాటు చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆర్ఎస్నాయుడు, సెక్రటరీ చంద్రప్ప, ముఖ్య కార్యదర్శి లత, అనంతపురం జిల్లా అధ్యక్షుడు రవి రాజు, ఉపాధ్యక్షుడు అక్బర్, సెక్రటరీ రామాంజులు, కర్నూల్ జిల్లా అధ్యక్షుడు మెహన్, ఉపాధ్యక్షుడు మాచర్ల, సెక్రటరీ కిషోర్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
డీఎడ్‌లతో కబడ్డీ
డీఎస్సీ - 14 పేరుతో ప్రభుత్వం డీఎడ్ అభ్యర్థులతో కబడ్డీ ఆడుతోంది. పరీక్షలు ఇంకా పూర్తికానందున వారు డీఎస్సీకి దరఖాస్తు చేయడానికి అనర్హులని తేల్చేసింది. అక్టోబర్‌లో నిర్వహించాల్సిన పరీక్షలను ఇప్పటి వరకూ జర పకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన సర్కారు ఆ తప్పును అభ్యర్థులపై రుద్దేస్తోంది. ఎలాగూ మే 9 వరకూ డీఎస్సీ జరగదు కనుక తమ దరఖాస్తులను అనుమతించాలని అభ్యర్థులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ఏలూరు సిటీ :ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం తెరతీస్తే నిరుద్యోగుల కళ్లలో ఆనందం కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. ఎంత కష్టమైనా భరించి ఉద్యోగాన్ని సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తారు. తీరా నిబంధనలు బంధనాలుగా మారితే...వారి ఆశలపై ప్రభుత్వమే నీళ్ల చల్లితే... డీఎస్సీ-14 నియామకాల పరిస్థితి కూడా ఇదేస్థాయిలో ఉంది. డీఎస్సీ-14తో నిరుద్యోగ అభ్యర్థుల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి డీఎడ్ అభ్యర్థులు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా డీఎస్సీకి దరఖాస్తు చేసేందుకు 11రోజులే మిగిలి ఉండడంతో డీఎడ్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. డీఎడ్ అభ్యర్థులకు సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవటంతో జిల్లావ్యాప్తంగా సుమారు 2వేల మంది వరకూ అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హత లేక వేదనకు గురవుతున్నారు. ఒకటి రెండు సబ్జెక్టులు మిగిలిన కొందరు అభ్యర్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీనిపై అధికారులు స్పందించి సత్వరమే చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తున్నారు. బాధ్యులెవరు వాస్తవానికి డీఎడ్ అభ్యర్థులకు అక్టోబర్, నవంబర్ నెలలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ పరీక్షలు నిర్వహించనే లేదు. ఇక డిసెంబర్ 29 నుంచి 2015 జనవరి 2వరకు పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్ కూడా ప్రకటించిన అధికారులు ఎందుకు పరీక్షలు నిర్వహించలేదో వారికే తెలియాల్సి ఉంది. కావాలనే పరీక్షలు నిర్వహించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, డీఎస్సీలో అభ్యర్థుల సంఖ్యను తగ్గించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీఎడ్ కాలేజీల్లో చోటుచేసుకున్న అవకతవకల కారణంగానే పరీక్షలు వాయిదా వేసినట్టు ప్రభుత్వం చెబుతుండగా, కాలేజీ యాజమాన్యాలు చేసిన తప్పులకు తమను బాధ్యులను చేయటం ఎంతవరకు న్యాయమని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఒక ప్రభుత్వ డీఎడ్ కాలేజీ దూబచర్లలో ఉండగా మరో 17 డీఎడ్ కాలేజీలు ఉన్నాయి. మరో ఐదు కాలేజీలకు కొత్తగా అనుమతులు వచ్చినట్టు చెబుతున్నారు. వీటి నుంచి1 ప్రతి ఏడాది సుమారు 2500 మంది వరకూ అభ్యర్థులు డీఎడ్ కోర్సు పూర్తిచేసి బయటకు వస్తున్నట్టు అంచనా. ఎలాగూ ప్రభుత్వమే తప్పులు చేసింది కాబట్టి దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించాలని, సర్టిఫికెట్లు పరీక్ష నాటికి సమర్పిస్తామని అభ్యర్థులు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. దరఖాస్తు చేయనివ్వండి పరీక్షలు ఆలస్యం కావటంతో ఇప్పుడు డీఎస్సీకి దరఖాస్తు చేయలేని స్థితిలో ఉన్నాం. రెండవ సంవత్సరంలో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను. కానీ మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాను. అక్టోబర్‌లో పరీక్ష నిర్వహించి ఉంటే ఇప్పుడు ధీమాగా దరఖాస్తు చేసేవాడిని. పేద కుటుంబం నుంచి వచ్చాను. మరో డీఎస్సీ అసలు పెడతారో లేదో తెలీదు. మళ్లీ అవకాశం ఉంటుందో లేదో. డీఎస్సీ పరీక్ష మే9న నిర్వహిస్తారు. ప్రస్తుతానికి మాకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఇస్తే బాగుంటుంది. అధికారులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. - తోటకూరి రాటాలు, డీఎడ్ అభ్యర్థి ప్రభుత్వానికి నివేదిస్తాం డీఎడ్ అభ్యర్థులకు పరీక్షలు ఆలస్యం అయ్యాయి. ప్రభుత్వం నుంచి అదేశాలు జారీ కావాల్సి ఉంది. అయితే జిల్లాలోని అభ్యర్థులు ఒక వినతిపత్రం సమర్పిస్తే దాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాను. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అవకాశం ఇస్తుందేమో చూడాలి. - డి.మధుసూదనరావు, డీఈవో -
104 సేవలకు డీజిల్ బ్రేక్
రాజాం రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో సంచార వైద్యసేవలు అందిస్తున్న 104 వాహనాలు సర్కారు నిర్లక్ష్యం వల్ల ఒక్కొక్కటి గా మూలన చేరుతున్నాయి. ఇప్పటికే ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా జీతాల్లేవు. తాజాగా డీజిల్ బిల్లులూ భారీగా పెండింగులో పడిపోవడంతో ఈ వాహనాలు నిలిచిపోతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన 104 సేవలను జిల్లాలో 20 వాహనాలతో గ్రామీణ ప్రాంతాలకు అందిస్తున్నారు. కాగా డీజిల్ కొరతతో రాజాం నియోజకవర్గానికి చెందిన 2, శ్రీకాకుళానికి చెందిన 2, పాతపట్నం, సీతంపేటల్లో ఒక్కో వాహనం నిలిచిపోయాయి. రాజాం వాహనాలకు సంబంధించి గతంలో డీజిల్ బిల్లు రూ.20 వేలకు చేరగానే ప్రభుత్వం మంజూరు చేసేసేది. ప్రస్తుతం ఈ బకాయి రూ.70 వేలు దాటడంతో బంక్ యజమాని డీజిల్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో వాహనాలు ఆగిపోయింది. ఇదే తరహాలో శ్రీకాకుళం వాహనాలు 15 రోజులుగానూ, సీతంపేట, పాతపట్నం వాహనాలు వారం రోజులుగానూ క్లస్టర్ ఆస్పత్రుల వద్ద నిలిచిపోయాయి. దీంతో ఈ వాహనాల ద్వారా సేవలు పొందుతున్న దీర్ఘకాలిక రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా 104 వాహనాల్లో పని చేస్తున్న సిబ్బందికి 3నెలలుగా జీతాల్లేవు. జిల్లాలో 120 మంది వరకు పని చేస్తుండగా ఆగస్టు నుంచి ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇక్కట్లుకు గురవుతున్నారు. దీనిపై 104 ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జె.సింహాచలం మాట్లాడుతూ ప్రభుత్వం 104 వాహన సేవలు పట్ల, ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో తక్షణం స్పందించి డీజిల్, జీతాల బకాయిలు చెల్లించాలని ఆయన కోరారు.