ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : టీడీపీ ప్రభుత్వం రాయలసీమను ఎడారి ప్రాంతంగా మారుస్తోందని రాయలసీమ విద్యార్థి,యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ సుబ్బరాయుడు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు జిల్లాలోఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన హక్కు చట్టంలో జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్రం విyì పోయి 4 సంవత్సరాలు కావస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. జిల్లాకు ఉర్దూ యూనివర్సిటీని కేటాయించి, ఇతర ప్రాంతాలకు తీసుకుపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం జిల్లాను అన్ని విధాలుగా అబివృద్ది చేసి మూతపడిన పరిశ్రమలను తెరిపించేదుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌వైఎఫ్ నాయకులు పుల్లయ్య, శివారెడ్డి , రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.