![Shaji K V took charge as NABARD Chairmanfrom Dec 7 Govt informs to Parliament - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/13/naabard.jpg.webp?itok=-WypwjE9)
న్యూఢిల్లీ: నాబార్డ్ చైర్మన్‌గా షాజి కేవీ ఈ నెల 7న బాధ్యతలు స్వీకరించినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల అదనపు కార్యదర్శి సుచీంద్ర మిశ్రా అదనపు బాధ్యతల కింద చూస్తుండగా, ఆయన నుంచి స్వీకరించినట్టు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కరాడ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు ఇచ్చారు. (మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్)
కరోనా తర్వాత, 2020 ఏప్రిల్ నుంచి 2022 నవంబర్ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాల ఏర్పాటుకు బ్యాంకులు రూ.12 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 86,996 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఏటీఎంలలో మోసాలు 2019-20లో రూ.116 కోట్ల మేర ఉంటే, 2020-21లో రూ.76 కోట్లకు తగ్గినట్టు చెప్పారు.
ఇవీ చదవండి: టెక్ మహీంద్రా నుంచి క్లౌడ్ బ్లేజ్‌టెక్ ప్లాట్‌ఫాం
వింటర్ జోరు: హీటింగ్ ఉత్పతుల హాట్ సేల్!
ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి
Comments
Please login to add a commentAdd a comment