
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ రెండో అతిపెద్ద బ్యాంక్ ‘ఐసీఐసీఐ’ తాజాగా నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నియామకానికి కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ హోదాలో ఉన్న ఎం.కె.శర్మ పదవీ కాలం జూన్ 30తో ముగియనుండటంతో బ్యాంక్ ఈ ప్రక్రియను షురూ చేసింది. ఇండిపెండెంట్ డైరెక్టర్ల నుంచి ఒకరిని లేదా బయటి వారిని ఈ పోస్టులో నియమించనుంది.
కాగా శర్మ స్థానాన్ని ఇండిపెండెంట్ డైరెక్టరుగా ఉన్న బ్యాంక్ బరోడా మాజీ సీఎండీ ఎం.డి.మాల్యాను భర్తీ చేసే అవకాశముందని సమాచారం. మాల్యా గతనెల 29న ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా చేరారు.
ఉదయ్ చితేల్, దిలీప్ చోక్సి, నీలం ధావన్, రాధాకృష్ణన్ నాయర్, వి.కె.శర్మ (ఎల్‌ఐసీ చైర్మన్), లోక్ రంజన్ (కేంద్ర ప్రభుత్వ నామినీ డైరెక్టర్) వంటి వారు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నారు. వీడియోకాన్ గ్రూప్‌కు రుణ మంజూరీ విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, ఎండీ చందా కొచర్ క్విడ్‌ప్రొకో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై బ్యాంక్ స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది కూడా.
Comments
Please login to add a commentAdd a comment