బీబీసీ చైర్మన్‌గా భారతీయుడు | Dr Samir Shah Becomes First Indian-Origin Chairman Of BBC | Sakshi
Sakshi News home page

బీబీసీ చైర్మన్‌గా భారతీయుడు

Published Fri, Feb 23 2024 5:28 AM | Last Updated on Fri, Feb 23 2024 5:55 AM

Dr Samir Shah Becomes First Indian-Origin Chairman Of BBC - Sakshi

లండన్‌: బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్‌ సమీర్‌ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్‌ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జని్మంచారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం గడించిన సమీర్‌ గతంలో బీబీసీ నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. బీబీసీలో సమకాలీన, రాజకీయ వ్యవహారాల విభాగం చీఫ్‌గానూ పనిచేశారు.

బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3 ఈవారమే సంబంధిత ఎంపిక ప్రక్రియకు ఆమోదముద్ర వేయడంతో గురువారం ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి నాలుగో తేదీ నుంచి నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే సమీర్‌ దాదాపు రూ.1.68 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. బ్రిటన్‌ టెలివిజన్‌ రంగానికి చేసిన విశేష కృషికిగాను 2019లో దివంగత బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2 సమీర్‌ను కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌తో సత్కరించారు. 1998 నుంచి సొంతంగా జ్యూపిటర్‌ టీవీని ఈయన నడుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement