British Broadcasting Corporation (BBC)
-
బీబీసీ చైర్మన్‌గా భారతీయుడు
లండన్: బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్ సమీర్ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జని్మంచారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం గడించిన సమీర్ గతంలో బీబీసీ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందించారు. బీబీసీలో సమకాలీన, రాజకీయ వ్యవహారాల విభాగం చీఫ్‌గానూ పనిచేశారు. బ్రిటన్ రాజు చార్లెస్–3 ఈవారమే సంబంధిత ఎంపిక ప్రక్రియకు ఆమోదముద్ర వేయడంతో గురువారం ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి నాలుగో తేదీ నుంచి నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే సమీర్ దాదాపు రూ.1.68 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. బ్రిటన్ టెలివిజన్ రంగానికి చేసిన విశేష కృషికిగాను 2019లో దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 సమీర్‌ను కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్‌తో సత్కరించారు. 1998 నుంచి సొంతంగా జ్యూపిటర్ టీవీని ఈయన నడుపుతున్నారు. -
బీబీసీపై రూ.10 వేల కోట్ల పరువు నష్టం కేసు
న్యూఢిల్లీ: ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో డాక్యుమెంట్ రూపొందించిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)పై ఓ ప్రభుత్వేతర సంస్థ ఢిల్లీ హైకోర్టులో రూ.10 వేల కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ డాక్యుమెంట్లో ప్రధాని మోదీ, భారత న్యాయవ్యవస్థపై తప్పుడు ఆరోపణలతో బీబీసీ భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వాల ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపించింది. గుజరాత్‌కు చెందిన జస్టిస్ ఆన్ ట్రయల్ అనే సంస్థ వేసిన పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. బీబీసీ (యూకే)తోపాటు బీబీసీ(ఇండియా)కు సమన్లు ఇచ్చింది. సెప్టెంబర్ 25న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. పిటిషన్‌దారు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. నష్ట పరిహారంతోపాటు తమ సంస్థకు ఇతర ఆదాయ మార్గాలు లేనందున కోర్టు ఫీజులు తదితరాల కోసం రూ.10 వేల కోట్లు చెల్లించాలని కోరారు. -
కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలిచింది
సాక్షి, ముంబై : బాలీవుడ్లో విలక్షణ నటుడిగా నవాజుద్దీన్ సిద్ధిఖీ మంచి పేరుంది. 1999లో అమీర్‌ఖాన్ సర్పరోష్ లో చిన్నపాత్ర ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధిఖీ ఓ మారుమూల పల్లెటూరి నుంచి వచ్చాడన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. థియేటర్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టి కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను ఆయన ఎదుర్కున్నాడు. తన ఎదుగుదలలో తల్లి పాత్ర చాలా కీలకం అని ఆయన చాలాసార్లు చెప్పుకునేవారు. అందుకేనేమో బీబీసీ ప్రపంచంలో అత్యంత స్ఫూర్తిదాయక, ప్రభావశీలురైన మహిళల జాబితాలో మెహరున్నీసా సిద్ధిఖీకి చోటుదక్కింది. ‘ఓ మారుమూల పల్లెటూరిలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఓ మహిళ కష్టాలను ధైర్యంగా ఎదుర్కుని నిలిచింది’ అంటూ తన తల్లితో కలిసి దిగిన ఓ ఫోటోను నవాజుద్దీన్ షేర్ చేశాడు. బీబీసీ 2017కి గానూ విడుదల చేసిన ఈ టాప్–100 ప్రభావవంతమైన జాబితాలో ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీరాజ్, సామాజిక వేత్త ఊర్వశి సాహ్ని, మహిళా ఉద్యమ కార్యకర్త నిత్యా తుమ్మలచెట్టికి చోటు దక్కింది. వచ్చే నెల ‘బీబీసీ 100 విమెన్ చాలెంజ్’ పేరుతో భారత్‌లోని వివిధ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వీళ్లు సాధించిన విజయాల గురించి చర్చించనున్నారు. -
లైవ్‌లో చూడటం తగ్గిపోతోంది...!
ధోరణి నేటి యువత గురించి బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) వారి ఆందోళన ఇది. ప్రస్తుత తరంలో లైవ్ టీవీ చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని బీబీసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది కేవలం తమ ఛానల్ప్రసారాల విషయంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా యువతలో లైవ్ ప్రసారాల మీద ఆసక్తి తగ్గిపోతోందని బీబీసీ విశ్లేషిస్తోంది. ఎక్కువ ఆసక్తిని రేకెత్తించే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, ఇష్టమైన క్రీడా ప్రసారాలను తప్పిస్తే... ఫలానా ప్రోగ్రామ్‌లను తప్పనిసరిగా లైవ్‌లో చూడాలనే కోరిక వ్యక్తం చేసేవాళ్లు తగ్గిపోతున్నారని తమ అధ్యయనంలో తేలిందని బీబీసీ వాళ్లు ప్రకటించారు. ఎందుకలా.. అంటే ఎవరి పనిలో వారు బిజీగా ఉండటం ఒక కారణం అయితే.. లైవ్‌లో చూడలేకపోయిన కార్యక్రమాన్ని మళ్లీ చూడటానికి అనేక అవకాశాలు ఉండటం మరో కారణం అని బీబీసీ అధ్యయనకర్తలు విశ్లేషించారు. ఇంటర్నెట్ పుణ్యమా అన్ని టీవీ ఛానళ్లూ, మీడియా సంస్థలు వెబ్‌తో అనుసంధానం అయ్యాయి. తమ కార్యక్రమాలను వీడి యోల రూపంలో స్టోర్ చేసి ఉంచుతున్నాయి. అలాంటి కార్యక్రమాలను వీక్షించడానికి అధునాతన గాడ్జెట్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో దేన్ని ఎప్పుడైనా చూసుకోవచ్చనే భావన ఏర్పడింది. ప్రత్యేకించి 16 నుంచి 24 యేళ్ల మధ్య వారు దాదాపుగా ఈ అభిప్రాయానికి వచ్చేశారట! దీంతో ఇంతకుముందులా లైవ్ కవరేజిపై గొప్ప ఆసక్తి ఏమీ లేదని అధ్యయనకర్తలు అంటున్నారు. అయితే మధ్యవయసు వారిలో మాత్రం ప్రత్యక్ష ప్రసారాలపై ఆసక్తి యథావిధిగా కొనసాగుతోందని బీబీసీ పేర్కొనడం గమనార్హం. ప్రత్యక్ష ప్రసారాలపై ఆసక్తిని తగ్గించుకొన్న కుర్రతరం ఆ సమయాన్ని ఫోన్‌ను ఆపరేట్చేయడానికో, నిద్రకో కేటాయిస్తోందని కూడా అధ్యయనకర్తలు వివరించారు. ఏదైనా సంచలన విషయం సంభవించినా... ఆ విషయం గురించి తెలిస్తే... అందుకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్నెట్లో చూడటానికి అవకాశం ఉండటం, యూట్యూబ్‌లో వీడియోల రూపంలో వీక్షించడానికి అవకాశం ఉండటంతో... ప్రత్యక్ష ప్రసారాలపై ఆసక్తి తగ్గిపోతోంది. ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించడానికి కూడా వీలు లేదని అధ్యయనకర్తలు అభిప్రాయపడటం విశేషం. -
బీబీసీకి తొలి మహిళా అధిపతి
లండన్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన న్యూస్ కార్పొరేషన్‌ను పర్యవేక్షిస్తున్న బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)కు తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. రోనా ఫెయిర్‌హెడ్(53)ను కొత్త చైర్‌పర్సన్‌గా బీబీసీ ట్రస్ట్ శనివారం ప్రకటించింది. లార్డ్ పాటెన్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. పాటెన్ అనారోగ్య కారణాలతో గత మే నెలలో బీబీసీ బాధ్యతల నుంచి వైదొలిగారు. రోనా ఇప్పటివరకు పలు ప్రముఖ కంపెనీల బోర్డుల్లో అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు.