
దుర్గానాగ్ దేవాలయంలో ఫరూఖ్
శ్రీనగర్: కశ్మీర్‌లో ఇటీవల ఏర్పడిన ఏడు పార్టీల పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏజీడీ)కి చైర్మన్‌గా నేషనల్ కాన్ఫరెన్స్‌కి చిందిన ఫరూఖ్ అబ్దుల్లా, ఉపాధ్యక్షురాలిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఎంపికయ్యారు. ఈ వేదికకు సీపీఎం నేత ఎం.వై.తరీగామీ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. అధికార ప్రతినిధిగా పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు చెందిన సజ్జాద్ గనీ లోనె వ్యవహరిస్తారు. ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఈ కూటమి జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా పునరుద్ధరణకోసం పోరాడుతుందని, ఇది బీజేపీ వ్యతిరేక వేదిక అని, ఇది జాతి వ్యతిరేక వేదిక కాదని ఆయన అన్నారు. ఈ కూటమి పాత కశ్మీర్ జెండాని తమ పార్టీ చిహ్నంగా ఎంపిక చేసుకుంది. ఈ కూటమిలో సీపీఐ కశ్మీర్ నేత ఏఆర్ ట్రుక్రూ చేరారు. కూటమికి కాంగ్రెస్ దూరంగా ఉంది.
దుర్గానాగ్ దేవాలయాన్ని దర్శించిన ఫరూఖ్ అబ్దుల్లా
ఫరూఖ్.. దుర్గాష్టమి, మహానవమి సందర్భం గా పురాతన దుర్గానాగ్ దేవాలయాన్ని సందర్శించారు. మానవాళికి మంచి జరగాలని, శాంతి చేకూరాలని ప్రార్థనలు చేసినట్లు ఫరూఖ్ తెలిపారు. దేవాలయానికి ఎంతో ప్రాశçస్త్యం ఉంది. ‘హిందూ సోదర, సోదరీమణులకు ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. పండగ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చా’ అని అన్నారు. కశ్మీర్ నుంచి వెళ్ళిపోయిన కశ్మీరీ పండిట్‌లు తొందరగా తమ ప్రాంతాలకు తిరిగిరావాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. దుర్గానాగ్ దేవాలయం 700 సంవత్సరాల పురాతనమైనది. 2013లో ఈ దేవాలయ ప్రాంగణంలో శివలింగాన్ని ప్రతిష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment