mehabooba mufhi
-
ముఫ్తీ పాస్‌పోర్ట్‌పై ఆదేశాలివ్వలేం
శ్రీనగర్: తనకు పాస్‌పోర్ట్‌ను జారీ చేయాలని అధికారులను ఆదేశించా లన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తిని జమ్మూకశ్మీర్ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. మెహబూబా ముఫ్తీకి పాస్‌పోరŠుట్ట జారీ చేయకూడదని పోలీస్ వెరిఫికేషన్ నివేదిక సిఫారసు చేసినందువల్ల పాస్‌పోర్ట్ అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని న్యాయమూర్తి జస్టిస్ అలీ మొహమ్మద్ మాగ్రే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్ట్‌ను జారీ చేయాలని తాను ఆదేశించలేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసు కునేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేద న్నారు. ‘పోలీస్ వెరిఫికేషన్ నివేదిక వ్యతిరేకం గా వచ్చినందున మీకు పాస్‌పోర్ట్ జారీ చేయలేమ’ని రీజనల్ పాస్‌పోర్ట్ అధికారి మార్చి 26న మెహ బూబా ముఫ్తీకి లేఖ రాశారు. దీనిపై ముఫ్తీ స్పం దిస్తూ.. ‘కశ్మీర్లో నెలకొందని చెబుతున్న సాధారణ స్థితికి ఇదే ఉదాహరణ’ అని వ్యాఖ్యానించారు. ‘నాకు పాస్‌పోర్ట్ జారీ చేయడం భారతదేశ భద్ర తకు ప్రమాదకరమని సీఐడీ నివేదిక ఇచ్చిందని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రికి పాస్‌పోర్ట్ ఉండటం దేశ సార్వభౌమత్వానికి భంగకరమట’ అని ఆమె ట్వీట్ చేశారు. -
‘వారికీ ట్రంప్ గతే’
శ్రీనగర్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే బీజేపీని కూడా ప్రజలు ఇంటిబాట పట్టిస్తారని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. అమెరికాలో ఏం జరిగిందో చూడండి..బీజేపీకీ అదే గతి పడుతుందని సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్‌పై మెహబూబా ముఫ్తీ ప్రశంసలు కురిపించారు. ఎన్నికల్లో సరైన దృక్పథంతో ముందుకు వెళ్లిన తేజస్వి యాదవ్‌ను అభినందిస్తున్నానని చెప్పారు. జమ్ము కశ్మీర్లో భూముల కొనుగోలుకు భారతీయులందరినీ అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. తమ వనరులను తెగనమ్మేందుకు సిద్ధమయ్యారని, కశ్మీరీ పండిట్లకు భారీ వాగ్ధానాలు చేసిన బీజేపీ ఇప్పుడు వారికి ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. చదవండి : ఇకపై కశ్మీర్లో భూములు కొనొచ్చు.. జమ్ము కశ్మీర్‌ను బీజేపీ అమ్మకానికి పెట్టిందని దుయ్యబట్టారు. జమ్ము కశ్మీర్లో యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వారు ఆయుధాలు చేబూనడం మినహా మరో మార్గం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో ఇతర రాష్ట్రాల ప్రజలు ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఘటనలపై మెహబూబా స్పందిస్తూ త్రివర్ణ పతాకం కోసం వేలాది మంది ప్రాణాలొడ్డుతున్నారని, భారత్-పాకిస్తాన్ల మధ్య శాంతికి జమ్ముకశ్మీర్ వారథిగా మారాలని ఆకాంక్షించారు. ఆర్టికల్ 370 హిందువులు లేదా ముస్లింలకు సంబంధించిన అంశం కాదని, ఇది జమ్ము కశ్మీర్ స్వతంత్రతకు చిహ్నంగా చూడాలని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో ప్రజలు వారి భవిష్యత్ పట్ల ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. -
గుప్కార్ అలయెన్స్ చైర్మన్‌గా ఫరూఖ్
శ్రీనగర్: కశ్మీర్లో ఇటీవల ఏర్పడిన ఏడు పార్టీల పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్(పీఏజీడీ)కి చైర్మన్‌గా నేషనల్ కాన్ఫరెన్స్‌కి చిందిన ఫరూఖ్ అబ్దుల్లా, ఉపాధ్యక్షురాలిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఎంపికయ్యారు. ఈ వేదికకు సీపీఎం నేత ఎం.వై.తరీగామీ కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. అధికార ప్రతినిధిగా పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు చెందిన సజ్జాద్ గనీ లోనె వ్యవహరిస్తారు. ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఈ కూటమి జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా పునరుద్ధరణకోసం పోరాడుతుందని, ఇది బీజేపీ వ్యతిరేక వేదిక అని, ఇది జాతి వ్యతిరేక వేదిక కాదని ఆయన అన్నారు. ఈ కూటమి పాత కశ్మీర్ జెండాని తమ పార్టీ చిహ్నంగా ఎంపిక చేసుకుంది. ఈ కూటమిలో సీపీఐ కశ్మీర్ నేత ఏఆర్ ట్రుక్రూ చేరారు. కూటమికి కాంగ్రెస్ దూరంగా ఉంది. దుర్గానాగ్ దేవాలయాన్ని దర్శించిన ఫరూఖ్ అబ్దుల్లా ఫరూఖ్.. దుర్గాష్టమి, మహానవమి సందర్భం గా పురాతన దుర్గానాగ్ దేవాలయాన్ని సందర్శించారు. మానవాళికి మంచి జరగాలని, శాంతి చేకూరాలని ప్రార్థనలు చేసినట్లు ఫరూఖ్ తెలిపారు. దేవాలయానికి ఎంతో ప్రాశçస్త్యం ఉంది. ‘హిందూ సోదర, సోదరీమణులకు ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. పండగ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చా’ అని అన్నారు. కశ్మీర్ నుంచి వెళ్ళిపోయిన కశ్మీరీ పండిట్లు తొందరగా తమ ప్రాంతాలకు తిరిగిరావాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. దుర్గానాగ్ దేవాలయం 700 సంవత్సరాల పురాతనమైనది. 2013లో ఈ దేవాలయ ప్రాంగణంలో శివలింగాన్ని ప్రతిష్టించారు. -
‘ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడమే’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని అధికారులు పొడిగించిన క్రమంలో రాజకీయ నేతలను అక్రమంగా నిర్బంధిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామాన్ని నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత గత ఏడాది ఆగస్ట్ 5 నుంచి మెహబూబా ముఫ్తీ నిర్బంధంలో ఉన్నారు. మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని జమ్ము కశ్మీర్ అధికారులు మరో మూడు నెలలు పొడిగించారు. గృహ నిర్బంధం నుంచి మెహబూబా ముఫ్తీని విడుదల చేయాలని కోరుతూ రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. మరోవైపు మెహబూబా నిర్బంధం పొడిగింపును కాంగ్రెస్ నేత పీ చిదంబరం తప్పుపట్టారు. ఇది పౌరుల రాజ్యాంగ హక్కులను నిరాకరించడమేనని అన్నారు. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, 61 సంవత్సరాల మహిళ ప్రజా భద్రతకు ఎలా ముప్పుగా పరిణమించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెను నిర్బంధం నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక మెహబూబా ముఫ్తీ అక్రమ నిర్బంధంపై రాహుల్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాంగ్రెస్‌కు చురకలు వేశారు. కాంగ్రెస్ హయాంలో షేక్ అబ్ధుల్లాను ఎలా నిర్బంధించారో రాహుల్‌కు ఎవరైనా గుర్తుచేయాలని కోరారు. గతంలో రాహుల్ ముత్తాత, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 2000 కిలోమీటర్ల దూరంలోని తమిళనాడులో షేక్ అబ్దుల్లాను 12 ఏళ్ల పాటు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి కాంగ్రెస్ నేతకు ఎవరైనా చెప్పాలని జితేంద్ర సింగ్ చురకలు వేశారు. చదవండి : ‘అప్పుడు వాజ్‌పేయిని, అడ్వాణీని విమర్శించలేదు’ -
అడిగానని శిక్షించరు కదా!
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు. తననెందుకు గృహనిర్బంధంలో ఉంచారో వివరించాలని ఆమె ఆ లేఖలో కోరారు. ‘‘దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది. కశ్మీరీలు మాత్రం కనీస మానవ హక్కులు కూడా లేకుండా బోనులోని జంతువుల్లా ఉండిపోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా ప్రాథమిక హక్కుల గురించి ఇలా ప్రశ్నల్ని లేవనెత్తినందుకు నన్ను శిక్షించవద్దనీ, నాపై నేరం మోపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను’’ అని ఆ లేఖను ముగించారు ఇల్తిజా. కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ముందు రోజు అక్కడి కొన్ని ప్రధాన రాజకీయ కుటుంబాల వారిని ఇల్లు కదలకుండా చేసింది ప్రభుత్వం. వారిలో మెహబూబా ముఫ్తీ కూడా ఒకరు. మెహబూబాకు ఇద్దరు కూతుళ్లు. అమిత్‌షాకు ఇప్పుడీ ఉత్తరం రాసిన ఇల్తిజా ఒకరు. ఇర్తికా ఇంకొకరు. -
నివురుగప్పిన నిప్పులా జమ్మూకశ్మీర్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ : ఓవైపు భారీగా బలగాల మోహరింపు.. మరోవైపు కేంద్రం మౌనంతో జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. జమ్మూకశ్మీర్‌లో శాశ్వతనివాసం, స్వయంప్రతిపత్తికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను కేంద్రం రద్దుచేయబోతోందన్న వదంతుల నేపథ్యంలో ప్రతిపక్షాలు గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో శనివారం భేటీ అయ్యాయి. ఉగ్రముప్పు ఉన్నప్పటికీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన భద్రతాసిబ్బంది కళ్లుగప్పి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఇంటికి వెళ్లారు. కేంద్రం తీసుకునే ఎలాంటి చర్యనైనా కలసికట్టుగా ఎదుర్కొందామని కోరారు. అనంతరం ఇతర కశ్మీరీ నేతలతో కలిసి గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో భేటీ అయ్యారు. దీంతో జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఎలాంటి రాజ్యాంగ నిబంధనల్ని సవరించడం లేదనీ, వదంతుల్ని నమ్మవద్దని మాలిక్ రాజకీయ నేతలు, మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అనిశ్చితిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా, ఈ విషయంలో కశ్మీరీ ప్రజలకు పార్లమెంటు హామీ ఇవ్వాలని ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. రంగంలోకి ఐఏఎఫ్ విమానాలు.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరగొచ్చన్న ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పాలనా యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. పలువురు పర్యాటకుల్ని, అమర్నాథ్ యాత్రికులను ప్రత్యేక వాహనాల్లో శ్రీనగర్ విమానాశ్రయానికి తరలించాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం నాటికి 20,000 నుంచి 22,000 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే ఉగ్రహెచ్చరికల నేపథ్యంలో గుల్మార్గ్, పెహల్గామ్ వంటి పర్యాటక ప్రాంతాల నుంచి 6,126 మంది పర్యాటకులను శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 5,829 మందిని 32 విమానాల్లో శనివారం తమ స్వస్థలాలకు తరలించారు. భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన విమానాల్లో మరో 387 మందిని గమ్యస్థానాలకు చేర్చారు. ఈ సందర్భంగా పలు విమానయాన సంస్థలు టికెట్ల రీషెడ్యూల్, రద్దుపై విధించే అదనపు చార్జీలను ఆగస్టు 15 వరకూ ఎత్తివేశాయి. టికెట్లను రద్దుచేసుకుంటే అదనపు చార్జీలు విధించబోమని రైల్వేశాఖ చెప్పింది. మరోవైపు భారత పర్యటనలో భాగంగా జమ్మూకశ్మీర్‌కు వెళ్లవద్దని తమ పౌరులను బ్రిటన్, జర్మనీ దేశాలు హెచ్చరించాయి. భద్రతా సిబ్బందిని సంప్రదించాకే కశ్మీర్లో పర్యటించాలనీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆస్ట్రేలియా తమ పౌరులకు స్పష్టం చేసింది. అవన్నీ వదంతులే.. నమ్మొద్దు: గవర్నర్ మాలిక్ జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను రద్దు చేయబోతోందని చెలరేగుతున్న వదంతులపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో గవర్నర్ స్పందిస్తూ..‘ఆర్మీ హెచ్చరికల తీవ్రతను దృష్టిలో ఉంచుకునే అమర్నాథ్ యాత్రను తక్షణం నిలిపివేయాల్సి వచ్చింది. ఇక నాకు తెలిసినంతవరకూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల్ని సవరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడంలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలకు కొందరు ఇతర కారణాలను ఆపాదిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో అనవసరంగా భయాందోళన చెలరేగుతుంది’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై వచ్చే వదంతుల్ని, పుకార్లను నమ్మవద్దనీ, ప్రశాంతంగా ఉండాలని రాజకీయ నేతలు, వారి మద్దతుదారులకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ విజ్ఞప్తి చేశారు. ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ రద్దు: వీహెచ్‌పీ ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో పూంఛ్ జిల్లాలో ఈ నెల 6 నుంచి పది రోజుల పాటు సాగనున్న ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ను రద్దు చేసుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ప్రకటించింది. ఈ విషయమై వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు లీలాకరణ్ శర్మ మాట్లాడుతూ..‘అమర్నాథ్ యాత్రామార్గంలో అమెరికా తయారీ స్నైపర్ తుపాకీ, మందుపాతర లభ్యంకావడం, మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భక్తుల భద్రత రీత్యా బుద్ధ అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నాం. అలాగే కుల్గామ్ జిల్లాలో కౌశర్నాగ్ యాత్ర, కిష్త్వర్ జిల్లాలో మచైల్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కూడా ఆపేస్తున్నాం’ అని చెప్పారు. మోదీ ప్రకటన చేయాలి: ప్రతిపక్షాలు అమర్నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేయడంతో దేశ ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోదీ ఉభయసభలను ఉద్దేశించి ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏల కొనసాగింపు విషయంలో తమకు పార్లమెంటు నుంచి హామీ కావాలని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. భారత్‌లో విలీనం సందర్భంగా జమ్మూకశ్మీర్‌కు ఇచ్చిన హామీలు కాలాతీతమైనవని వ్యాఖ్యానించారు. ప్రజలను భయపెడుతున్నారు: బీజేపీ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ విమర్శించింది. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీంద్ర రైనా మాట్లాడుతూ..‘రాజకీయ నేతలు ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ పార్టీలన్నీ కేంద్రానికి సహకరించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ కారణంగా రాష్ట్రంలో ప్రశాంతత అనేది కరువైంది. ఆగస్టు 15న లోయలోని అన్ని పంచాయతీల్లో మువన్నెల జెండాను ఎగురవేస్తాం’ అని ప్రకటించారు. భద్రతా సిబ్బందికి ముఫ్తీ షాక్ పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ భద్రతా సిబ్బందికి షాక్ ఇచ్చారు. ఉగ్రముప్పు ఉన్నందున ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని హెచ్చరించినప్పటికీ ఆమె శుక్రవారం రాత్రి సిబ్బంది కళ్లు కప్పి గుప్కార్ రోడ్డులోని ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటికి చేరుకున్నారు. కశ్మీరీల హక్కుల్ని కాపాడుకునేందుకు చేతులు కలుపుదామని కోరారు. అయితే తన ఆరోగ్యం బాగోలేనందున కుమారుడు ఒమర్ అబ్దుల్లాతో ఈ విషయాన్ని చర్చించాలని ఫరూక్ సూచించారు. ఒమర్ ఆదివారం నిర్వహించే అఖిలపక్ష భేటీకి రావాలని కోరారు. దీంతో ముఫ్తీ పీపుల్స్ కాన్ఫరెన్స్ అధినేత సజ్జద్ లోనే, జేకేపీఎం అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్‌తో భేటీ అయ్యారు. అనంతరం వీరంతా రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాజ్యాంగం ఏం చెబుతోంది? జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లడఖ్ పేరిట మూడు ముక్కలుగా చేయడం అసాధ్యం కాదని కొందరు రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల మేరకు పాకిస్తాన్ పక్కనే ఉన్న రాష్ట్రాల సరిహద్దులు మార్చవచ్చని అంటున్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను మరో అధికరణ 368(1) ద్వారా సవరించవచ్చు. ఇందుకోసం తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కనీసం సగం రాష్ట్రాలు ఇందుకు ఆమోదం తెలిపితే, ఆర్టికల్ 370 రద్దవుతుంది. ఇది జరిగిన వెంటనే జమ్మూకశ్మీర్ సరిహద్దుల్ని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఇప్పటికే ఉన్న రాష్ట్రాలకు సరికొత్తగా సరిహద్దుల్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్త రాష్ట్రాలకు సరిహద్దుల్ని నిర్ణయించవచ్చు. కానీ దీనికి ఆర్టికల్ 370 అడ్డుపడుతున్న నేపథ్యంలో ఈ అధికరణాన్ని తొలగించడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు అంటున్నారు. ఈ విషయమై లోక్‌సభ మాజీ కార్యదర్శి సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఆర్టికల్ 370 అన్నది తాత్కాలిక నిబంధనే తప్ప ప్రత్యేకమైన నిబంధన కాదు. మన రాజ్యాంగంలో తాత్కాలిక, పరివర్తన, ప్రత్యేకమైన అనే నిబంధనలున్నాయి. వీటిలో తాత్కాలికమన్నది అత్యంత బలహీనమైనది’ అని తెలిపారు. 35ఏ ఎందుకంత ప్రాముఖ్యం? ► జమ్మూకశ్మీర్ సంస్థానాధీశుడు మహారాజా హరి సింగ్ 1927, 1932లో జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర పరిధిలోని అంశాలు, ప్రజల హక్కులను నిర్వచించారు. ఇదే చట్టాన్ని వలస వచ్చిన వారికీ వర్తింపజేశారు. ► కశ్మీర్ పగ్గాలు చేపట్టిన షేక్ అబ్దుల్లా 1949లో భారత ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలి తంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేరింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. ఆ రాష్ట్రంపై భారత ప్రభుత్వ అధికారాలు.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార రంగాలకే పరిమితమయ్యాయి. ► షేక్ అబ్దుల్లా, నెహ్రూ మధ్య కుదిరిన ఢిల్లీ ఒప్పందం ప్రకారం 1954లో రాష్ట్రపతి ఉత్త ర్వుల మేరకు జమ్మూకశ్మీర్‌కు సంబంధించి 35ఏతోపాటు మరికొన్ని ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు. ►1956లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దాని ప్రకారం.. 1911కు పూర్వం అక్కడ జన్మించిన, వలస వచ్చిన వారే కశ్మీర్ పౌరులు. అంతేకాకుండా, 1911కు ముందు పదేళ్లకు తక్కువ కాకుండా అక్కడ ఉంటున్న వారికే స్థిరాస్తులపై హక్కుంటుంది. జమ్మూకశ్మీర్ నుంచి వలసవెళ్లిన వారు, ఇంకా పాకిస్తాన్ వెళ్లిన వారు కూడా రాష్ట్ర పౌరులుగానే పరిగణిస్తారు. శ్రీనగర్–నిట్ క్లాసులు బంద్ శ్రీనగర్‌లోని ప్రఖ్యాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో తరగతుల్ని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు సంస్థ రిజిస్టార్ తెలిపారు. తరగతులు ప్రారంభమయ్యే విషయమై తాము త్వరలోనే సమాచారం అందజేస్తామని వెల్లడించారు. శ్రీనగర్ జిల్లా యంత్రాంగం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రకటనను జిల్లా కలెక్టర్ షాíß ద్ ఖండించారు. ‘శ్రీనగర్–నిట్‌ను మూసివేయాల్సిందిగా మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రకరకాల వదంతులు చెలరేగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సూచించాం’ అని కలెక్టర్ షాహిద్ అన్నారు. నిత్యావసర దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఏటీఎంల ముందు ప్రజలు క్యూకట్టారు. శ్రీనగర్‌లో పెట్రోల్‌బంక్ వద్ద స్థానికుల పడిగాపులు -
‘జమాత్ ఏ ఇస్లామీ’ ఆస్తుల సీజ్
శ్రీనగర్: జమాత్ ఏ ఇస్లామీ (జేఈఐ) సంస్థ ఆస్తులతో పాటు దాన్ని నిర్వహించే నాయకుల నివాసగృహాలను సైతం కశ్మీర్ అధికార వర్గా లు శనివారం సీల్ చేశాయి. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలతో పాటు వేర్పాటువాద ఉ ద్యమానికి మద్దతునిస్తోందన్న ఆరోపణలతో గురువారం కేంద్రం జేఈఐపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో నగరవ్యాప్తంగా జేఈఐ ఆస్తులతో పాటు, దాన్ని నిర్వహించే నా యకులు, కార్యకర్తలకు సంబంధించిన ఇళ్లను శుక్రవారం రాత్రి సీల్ చేసినట్లు పోలీసులు తెలి పారు. అలాగే జేఈఐ నాయకుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు వెల్లడించారు. జేఈఐ నిషేధంపై కశ్మీర్ కు చెందిన పార్టీలు కేంద్రాన్ని తప్పుబట్టాయి. ఇది ప్రతీకార చర్య: మెహబూబా ప్రతీకార చర్యల్లో భాగంగానే జేఈఐపై కేంద్రం నిషేధం విధించిందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ మెహబూబా ఆరోపించారు. కేం ద్రం నిర్ణయం కారణంగా ఇక్కడ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ‘రాష్ట్రం లో కేంద్రం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. కేంద్రం నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. అరెస్టు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. మీకు శివసేన, జన్‌సంఘ్, ఆరెస్సెస్ లాంటి సంస్థలున్నాయి. ఓ రకమైన మాంసాన్ని తిం టున్నారని వారు మనుషులను చంపుతున్నా పట్టించుకోరు. చర్యలుండవు. అదే పేదవారికి సాయం చేసేందుకు స్కూళ్లు నిర్వహిస్తున్న జే ఈఐపై మాత్రం నిషేధం విధిస్తారు’అని ఆమె పార్టీ కార్యాలయంలో ఆరోపించారు. -
రాష్ట్రపతి పాలనలోకి జమ్మూకశ్మీర్
న్యూఢిల్లీ: రాజకీయ సందిగ్ధత కారణంగా గత ఆరు నెలలుగా గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ తాజాగా రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. బుధవారం అర్ధరాత్రి నుంచి కశ్మీర్‌ను రాష్ట్రపతిపాలనలోకి తెస్తూ రాష్ట్రపతి కోవింద్ అధికార ప్రకటన వెలువరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివేదించిన నేపథ్యంలో సోమవారం మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం రాష్ట్రపతిపాలనకు పచ్చజెండా ఊపింది. జూన్‌లో కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని అధికార పీడీపీ సర్కారుకు బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో రాజకీయసంక్షోభం మొదలైంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మద్దతు తమకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని ఆ తర్వాత గవర్నర్‌ను పీడీపీ కోరింది. అదే సమయంలో బీజేపీ, మరికొందరు ఇతర సభ్యుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని సజ్జద్ లోన్ నేతృత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ సైతం గవర్నర్‌ను కలిసింది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేసే సామర్థ్యం రెండు కూటములకు లేవని భావిస్తూ గవర్నర్ అసెంబ్లీని రద్దుచేశారు. -
అసెంబ్లీ రద్దు.. గవర్నర్ అనూహ్య నిర్ణయం
శ్రీనగర్: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న జమ్మూకశ్మీ ర్ రాజకీయాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య గవర్నర్ సత్యపాల్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేశారు. అంతకుముందు.. కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించి, రాష్ట్రంలో బద్ధ శత్రువులైన పీడీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్‌లు ఒక్కటై, కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్, ఎన్సీతో కలసి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేస్తానంటూ పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ గవర్నర్ మాలిక్‌కు లేఖ కూడా రాశారు. మరోవైపు, ఈ కూటమిని అడ్డుకునే లక్ష్యంతో.. బీజేపీ, 18 మంది ఇతరుల మద్దతుతో తాను కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనని పీపుల్స్ కాన్ఫెరెన్స్ నేత సజ్జాద్ లోన్ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పీడీపీకి 28, కాంగ్రెస్‌కు 12, ఎన్సీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీకి 44 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ఈ కూటమికి 55 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా, అసెంబ్లీలో బీజేపీకి 25 మంది, పీపుల్స్ కాన్ఫెరెన్స్‌కు ఇద్దరు, సీపీఎంకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో జూన్ 19న రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉండేందుకు అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచారు. ‘ఇతరుల’ మద్దతుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫెరెన్స్ కూడా తమకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని గవర్నర్‌కు రాసిన లేఖలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. మరోవైపు, ఇద్దరు ఎమ్మెల్యేల పీపుల్స్ కాన్ఫెరెన్స్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తమకు 25 సభ్యుల బీజేపీతో పాటు 18కి పైగా ఇతర సభ్యుల మద్దతుందని ఆ పార్టీ నేత సజ్జాద్ లోన్ గవర్నర్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం సంచలనం సృష్టించింది. గవర్నర్ నిర్ణయం నిర్ణయం నేపథ్యంలో.. ఎన్నికల ప్రకటనకు ముందే రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని తక్షణమే అమలులోకి తెచ్చే అవకాశంపై యోచిస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. బేరసారాలకు అవకాశం ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగే అవకాశం ఉండటం, విరుద్ధ భావజాలాలున్న పార్టీలు స్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచలేవన్న నమ్మకంతోనే అసెంబ్లీని రద్దుచేయాల్సి వచ్చిందని రాజ్‌భవన్ నుంచి ప్రకటన వెలువడింది. మెజారిటీని నిరూపించుకునేందుకు ఒకటి కన్నా ఎక్కువ వర్గాలు ముందుకు రావడం ప్రభుత్వ నిలకడపై ప్రభావం చూపుతుందని మరొక కారణంగా పేర్కొంది. మరోవైపు, కాంగ్రెస్– పీడీపీ–ఎన్సీ కూటమి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని బీజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్ గుప్తా ఆరోపించారు. దుబాయిలో పాకిస్తాన్ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఈ మూడు పార్టీల నేతలు కలిశారన్నారు. కలవరపడ్డ బీజేపీ: ముఫ్తీ కశ్మీర్లో మహాకూటమి ఏర్పాటు ఆలోచన బీజేపీని కలవరపాటుకు గురిచేసిందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. తన లేఖను స్వీకరించలేకపోయిన గవర్నర్ కార్యాలయంలోని ఫ్యాక్స్ మిషన్ అసెంబ్లీ రద్దు ఉత్తర్వుల్ని మాత్రం వెంటనే జారీచేసిందని ఎద్దేవా చేశారు. -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: కశ్మీర్లో భద్రతా బలగాలు భారీ ఎన్కౌంటర్ చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిపిన ఎన్కౌంటర్లో జమ్మూ కశ్మీర్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌జేకే) చీఫ్ దావూద్ అహ్మద్ సోఫీ సహా నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ పోలీసు, మరో పౌరుడు మృతిచెందారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పలు హత్య కేసు లు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన ఘటనల్లో సోఫీ కీలక నిందితుడని తెలిపారు. వచ్చే వారం (జూన్ 28 నుంచి) అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ భద్రతాబలగాలకు నైతిక బలాన్నిచ్చింది. మరోవైపు, పుల్వామా జిల్లాలోని త్రాల్ మార్కెట్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ ఘటనలో తొమ్మిది మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. తెల్లారేసరికి ఆపరేషన్ పూర్తి శుక్రవారం తెల్లవారుజామునే ఈ ఆపరేషన్ మొదలుపెట్టిన భద్రతా బలగాలు.. తెల్లారేసరికి పనిపూర్తి చేశాయి. ఉగ్రవాదులు దాక్కున్నారన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా అర్థరాత్రే బలగాలు చేరుకున్నాయి. అయితే.. తెల్లవారాకే మృతుల్లో దావూద్ సోఫీ ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన ముగ్గురిని ఐఎస్‌జేకే సభ్యులైన ఆదిల్ రెహమాన్ భట్, మహ్మద్ అష్రఫ్ ఇటూ, మాజిద్ మంజూర్ దార్లుగా గుర్తించినట్లు కశ్మీర్ రేంజ్ ఐజీ స్వయం ప్రకాశ్ పాణి వెల్లడించారు. ‘ఈ ఆపరేషన్ విజయవంతమైంది. రాష్ట్ర పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సమన్వయంతో పని పూర్తిచేశారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో ఖిరం గ్రామానికి వెళ్లిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ ఓ ఇంట్లో దాక్కున్నారు. ఇంటిని చుట్టుముట్టిన బలగాలు ఆపరేషన్ పూర్తి చేశాయి’ అని ఆయన వెల్లడించారు. భారత్‌కు ఐఎస్ ముప్పు! ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఐఎస్ ప్రభావం భారత్‌లో పెద్దగా లేదని.. మన ప్రభుత్వం మొదట్నుంచీ చెబుతోంది. కశ్మీర్‌లోనూ మిగిలిన ఉగ్రవాద సంస్థలతో పోలిస్తే.. ఐఎస్ ప్రభావం అసలేమాత్రం లేదని చెప్పుకొస్తోంది. కానీ కొంతకాలంగా కశ్మీర్లో ఐఎస్ జెండాలు కనబడుతున్నాయి. రాళ్లు రువ్విన ఘటనల చిత్రాల్లో యువకుల చేతిలో ఐఎస్ జెండాలు కనిపిస్తూనే ఉన్నాయి. అనంత్‌నాగ్‌లో శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌తో ఐఎస్ లోయలో ఐఎస్ ప్రభావం ఉన్నట్లు సుస్పష్టమైంది. జమ్మూకశ్మీర్ కోసం ఐఎస్ ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటుచేసుకున్నట్లు తేలింది. ఏ++ కేటగిరీ (ఉగ్రవాదుల స్థాయిని బట్టి భద్రతా బలగాలు ఇచ్చే రేటింగ్) ఉన్న జేకేఐఎస్ చీఫ్ దావూద్ సోఫీని హతమార్చటం ద్వారా.. లోయలో విస్తరించేందుకు ఐఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తుందనేది సుస్పష్టమైంది. హిట్ లిస్ట్‌తో ఆర్మీ ఆపరేషన్ కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భద్రతా బలగాలు ‘ఆపరేషన్ ఆలౌట్’ను ప్రారంభించాయి. బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటుచేసుకుని.. ఒక్కో ఉగ్రవాద సంస్థను, అందులోని ముఖ్యనేతలను పక్కాగా టార్గెట్ చేస్తూ 22మందితో జాబితాను సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ (11 మంది), లష్కరే తోయిబా (7), జైషే మహ్మద్ (2), అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్, జేకేఐఎస్ల నుంచి ఒక్కొక్కరు ఈ జాబితాలో ఉన్నారు. జేకేఐఎస్ చీఫ్ హతంతో ఈ జాబితా 21కి చేరింది. భద్రతను సమీక్షించిన విజయ్ జమ్మూకశ్మీర్ గవర్నర్ సలహాదారుగా నియమితుడైన రిటైర్డు ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్ కశ్మీర్ లోయలోని భద్రతా పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం ఉదయమే ఆయన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. అటు, గవర్నర్ రూల్ అమల్లోకి రావడంతో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ భేటీలో నేషనల్ కాన్ఫరెన్స్ తరపున ఒమర్ అబ్దుల్లా, పీడీపీ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిలావర్ మిర్ సహా.. వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ గవర్నర్‌ను కలిసి.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జూన్ 28 నుంచి 60 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్రలో యాత్రికుల వాహనాలకు ట్రాకింగ్ చిప్స్‌ను అమర్చనున్నట్లు జమ్మూ రేంజ్ ఐజీ ఎస్డీ సింగ్ పేర్కొన్నారు. ఈ సాంకేతికతతో యాత్రికులు, వారి వాహనాల భద్రతను నిరంతరం పర్యవేక్షించవచ్చు. ఉగ్రవాదుల్ని సత్యాగ్రహంతో ఎదుర్కోవాలా?: జైట్లీ న్యూఢిల్లీ: సామాన్య పౌరుల మానవహక్కుల్ని పరిరక్షించేందుకు ఉగ్రవాదుల పట్ల కఠిన వైఖరిని అవలంబించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. చంపడానికి, చావడానికి సిద్ధమై వస్తున్న ఉగ్రవాదుల్ని సత్యాగ్రహంతో ఎదుర్కోవాలా? అని ప్రశ్నించారు. కశ్మీర్లో సైనిక ఆపరేషన్లలో ఉగ్రవాదుల కంటే అమాయక ప్రజలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ వ్యాఖ్యానించడంపై జైట్లీ మండిపడ్డారు. ‘ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు చావడానికి సిద్ధంగా ఉంటాడు. అతను ఇతరుల్ని చంపడానికీ వెనుకాడడు. అలాంటివాళ్లు ఎదురుపడినప్పడు వారిని సత్యాగ్రహంతో ఎదుర్కోమంటారా? ఉగ్రవాది చంపడానికి ముందుకొస్తుంటే భద్రతాబలగాలు అతడిని చర్చలు జరిపేందుకు ఆహ్వానించాలా?’ అని ప్రశ్నించారు. మావోయిస్టుల మద్దతున్న మానవహక్కుల సంఘాలు వేర్పాటువాదం, హింసను ప్రోత్సహిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇలాంటి గ్రూపుల్ని కాంగ్రెస్ గతంలో వ్యతిరేకించినా జేఎన్‌యూ, హెచ్‌సీయూలో దేశవ్యతిరేక నినాదాలు ఇచ్చినవారితో చేతులు కలిపేందుకు రాహుల్ గాంధీకి ఎలాంటి ఇబ్బంది లేదని విమర్శించారు. కశ్మీరీల తొలి ప్రాధాన్యం స్వాతంత్య్రమే కాంగ్రెస్ నేత సోజ్ వివాదాస్పద వ్యాఖ్యలు న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలకు ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే అవకాశమిస్తే వారు స్వతంత్రంగా ఉండేందుకే మొగ్గుచూపుతారని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమనీ, పార్టీకి దానితో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో సోజ్ మాట్లాడుతూ.. ‘కశ్మీరీలు పాకిస్తాన్లో విలీనం కావాలనుకోవడం లేదని ముషార్రఫ్ చెప్పారు. ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే అధికారం కశ్మీరీలకు ఇస్తే వారు స్వతంత్ర కశ్మీర్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తారన్నారు. ఆయన చెప్పింది అప్పటికీ, ఇప్పటికీ నిజమే. నేను కూడా అదే చెప్పాను. కానీ కశ్మీర్‌కు స్వాతంత్య్రం రావడం అన్నది అసాధ్యమని నాకూ తెలుసు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్నివర్గాల నుంచి తీవ్రనిరసన వ్యక్తమైంది. దీంతో సోజ్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఖండించారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగంగా ఉందనీ, భవిష్యత్‌లోనూ ఉంటుందనీ స్పష్టం చేశారు. త్వరలో మార్కెట్లోకి రానున్న తన పుస్తకం అమ్మకాలను పెంచుకునేందుకే సోజ్ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారని సూర్జేవాలా విమర్శించారు. కాగా సోజ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ కాంగ్రెస్‌ను డిమాండ్ చేసింది. -
ఆర్టికల్ 370ని ఎవరూ ముట్టలేరు: మెహబూబా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని ఎవరూ ముట్టలేరని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. ఆ ఆర్టికల్‌ను రద్దు చేసే ప్రసక్తే ఉండబోదని స్పష్టంచేశారు. 'రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఎవరూ తొలగించలేరన్నది అందరికీ తెలుసు. దీనర్థం మాది పైచేయి.. బీజేపీది కిందిచేయి అయిందని కాదు' అని ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు.