శ్రీనగర్: జమాత్ ఏ ఇస్లామీ (జేఈఐ) సంస్థ ఆస్తులతో పాటు దాన్ని నిర్వహించే నాయకుల నివాసగృహాలను సైతం కశ్మీర్ అధికార వర్గా లు శనివారం సీల్ చేశాయి. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలతో పాటు వేర్పాటువాద ఉ ద్యమానికి మద్దతునిస్తోందన్న ఆరోపణలతో గురువారం కేంద్రం జేఈఐపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో నగరవ్యాప్తంగా జేఈఐ ఆస్తులతో పాటు, దాన్ని నిర్వహించే నా యకులు, కార్యకర్తలకు సంబంధించిన ఇళ్లను శుక్రవారం రాత్రి సీల్ చేసినట్లు పోలీసులు తెలి పారు. అలాగే జేఈఐ నాయకుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు వెల్లడించారు. జేఈఐ నిషేధంపై కశ్మీర్ కు చెందిన పార్టీలు కేంద్రాన్ని తప్పుబట్టాయి.
ఇది ప్రతీకార చర్య: మెహబూబా
ప్రతీకార చర్యల్లో భాగంగానే జేఈఐపై కేంద్రం నిషేధం విధించిందని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ముఫ్తీ మెహబూబా ఆరోపించారు. కేం ద్రం నిర్ణయం కారణంగా ఇక్కడ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ‘రాష్ట్రం లో కేంద్రం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. కేంద్రం నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. అరెస్టు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. మీకు శివసేన, జన్‌సంఘ్, ఆరెస్సెస్ లాంటి సంస్థలున్నాయి. ఓ రకమైన మాంసాన్ని తిం టున్నారని వారు మనుషులను చంపుతున్నా పట్టించుకోరు. చర్యలుండవు. అదే పేదవారికి సాయం చేసేందుకు స్కూళ్లు నిర్వహిస్తున్న జే ఈఐపై మాత్రం నిషేధం విధిస్తారు’అని ఆమె పార్టీ కార్యాలయంలో ఆరోపించారు.
‘జమాత్ ఏ ఇస్లామీ’ ఆస్తుల సీజ్
Published Sun, Mar 3 2019 5:23 AM | Last Updated on Sun, Mar 3 2019 5:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment