
శ్రీనగర్: సీనియర్ రాజకీయనాయకుడు, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా (82) కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ద్వారా మంగళవారం తెలియజేశారు. తండ్రికి పాజిటివ్ రావడంతో తానూ ఐసోలేషన్‌లోకి వెళ్లానని, తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించు కోవాల్సిందిగా సూచించారు. ఫరూక్ కోవిడ్ బారిన పడటంపై ప్రధాని మోదీ స్పందిం చారు. ఆయన త్వరగా కోలుకోవాలని, కుటుంబమంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తు న్నట్లు మోదీ పేర్కొన్నారు. తిరిగి స్పందించిన ఒమర్ అబ్దుల్లా మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ఫరూక్ అబ్దుల్లా ఈ నెల 2న కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు.