జమ్ము కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లానే: ఫరూఖ్‌ అబ్దులా | Farooq Abdullah says Omar Abdullah to be Jammu Kashmir cm | Sakshi
Sakshi News home page

జమ్ము కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లానే: ఫరూఖ్‌ అబ్దులా

Published Tue, Oct 8 2024 2:37 PM | Last Updated on Tue, Oct 8 2024 4:00 PM

Farooq Abdullah says Omar Abdullah to be Jammu Kashmir cm

శ్రీనగర్‌:  జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జమ్ము కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ పార్టీల కూటమి దూసుకుపోతోంది. ఇప్పటివరకు వరకు ఏడు స్థానాల్లో గెలుపు నమోదు చేసుకొని 45 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆధిక్యంలో మ్యాజిక్‌ దాటి ముందుకు వెళ్లుతోంది. దీంతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా నివాసం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నాయి. 

ఈ సందర్భంగా జమ్ము కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. ‘‘ ప్రజలు వారి తీర్పును ఇచ్చారు. జమ్ము కశ్మీర్‌​ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లానే అవుతారు. పదేళ్ల తర్వాత ప్రజలు మాకు తమ అవకాశం ఇచ్చారు. మేము ప్రజల అంచనాలను అందుకోవాలని దేవుడిని  ప్రార్థిస్తున్నా. 

 

ఇక.. ఇక్కడ ‘పోలీసుల రాజ్యం ఉండదు. ప్రజల రాజ్యం ఉంటుంది. మేము జైలులో ఉన్న అమాయకులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.. హిందువులు, ముస్లింల మధ్య విశ్వాసాన్ని పెంపొందించుతాం. ఇక.. హర్యానాలో కాంగ్రెస్‌ గెలవకపోవడం బాధాకరం. ఇక్కడ పార్టీలో అంతర్గత వివాదాల కారణంగానే ఇలాంటి ఫలితం వచ్చినట్లు భావిస్తున్నా’ అని అన్నారు.

ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించడం లేదనే విషయం ఈ ఫలితాల ద్వారా అర్థమైందని మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. బుడ్గామ్‌ నియోజకవర్గంలో ఒమర్‌ అబ్దుల్లా ఘన విజయం సాధించారు.

చదవండి: హర్యానాలో ఆప్‌ ఓటమికి 10 కారణాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement