శ్రీనగర్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ దూరమవుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్ని కల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగు తుందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గురువారం ప్రకటించారు.
కొద్దిసేపటికే పార్టీ నేత, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా అలాందేమీ లేదంటూ ప్రకటించారు. ఇండియా కూటమిలోనే కొనసాగుతామని జమ్మూకశ్మీర్‌లోని ఎంపీ స్థానాల్లో పోటీపై భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కశ్మీర్ లోని అతిపెద్ద పార్టీ అయిన ఎన్‌సీ ఇండియా కూటమితోపాటు ప్రాంతీయ గుప్కార్(పీఏజీడీ) అలయెన్స్‌లోనూ కీలకంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment