J&K: ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఒమర్‌ అబ్దుల్లా | Omar Abdullah unanimously elected as leader of NC legislature party | Sakshi
Sakshi News home page

J&K: ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఒమర్‌ అబ్దుల్లా

Published Thu, Oct 10 2024 3:29 PM | Last Updated on Thu, Oct 10 2024 4:20 PM

Omar Abdullah unanimously elected as leader of NC legislature party

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్‌ నేషనల్ కాన్ఫరెన్స్‌  ​-కాంగ్రెస్‌ కూటమి ఘన విజయం సాధించింది. తాజాగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ శాసనసభాపక్షనేతగా ఎన్సీ నేత, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గురువారం ఎన్సీ సీనియర్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా వెల్లడించారు. ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఎన్నికైన అనంతరం మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా  మీడియాతో మాట్లాడారు.

‘‘ఈరోజు నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. అందులో నేను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడ్డాను. పార్టీ ఎమ్మెల్యేలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.

అదేవిధంగా 4 స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఎన్సీ ప్రభుత్వాన్ని ఏర్పాటు తమ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఎన్సీ 42 ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు నలుగురిని కలుపుకొని మొత్తం 46 మంది  ఎమ్మెల్యేలను కలిగి ఉన్నాం. కాంగ్రెస్‌ నుంచి మద్దతు లేఖ అందిన వెంటనే మేము జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని రాజ్‌భవన్‌కు వెళ్తాం’ అని అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement