కొత్త చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి
తాజాగా ప్రతిపాదించిన ఎఫ్‌ఎస్‌ఐబీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నూతన చైర్మన్‌గా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టిని ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) శనివారం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్న దినేష్ కుమార్ ఖరా స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీనివాసులు తెలుగువారు కావడం విశేషం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు ఆయన స్వస్థలం. ఎస్‌బీఐలో ప్రొబేషనరీ అధికారిగా 1988లో కెరీర్ ప్రారంభించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్‌ఎస్‌ఐబీ.. ఎస్‌బీఐ కొత్త చైర్మన్ కోసం జూన్ 29న ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి శ్రీనివాసులు పేరును ఖరారు చేసింది. ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫార్సుపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment