
న్యూఢిల్లీ: బీపీసీఎల్ నూతన చైర్మన్, ఎండీగా జి.కృష్ణకుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు వరకు సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2025 ఏప్రిల్ వరకు బీపీసీఎల్ చైర్మన్, ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. గత డిసెంబర్‌లో ప్రభుత్వరంగ సంస్థల నియామక మండలి కృష్ణకుమార్‌ను ఈ పదవికి ఎంపిక చేయడం గమనార్హం.
బీపీసీఎల్ చైర్మన్, ఎండీగా అరుణ్‌కుమార్ సింగ్ గతేడాది అక్టోబర్‌తో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి సంస్థ చైర్మన్ బాధ్యతలను ఫైనాన్స్ డైరెక్టర్ వెస్టా రామకృష్ణ గుప్తా చూశారు. ఎన్‌ఐటీ తిరుచ్చిరాపల్లి నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, జమ్నాలాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌ను కృష్ణకుమార్ పూర్తి చేశారు.