Krishnakumar
-
పిడుగుపాటుకు ముగ్గురు బలి
దమ్మపేట/హుజూరాబాద్ రూరల్/లోకేశ్వరం: భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో పిడుగుల కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. భద్రాద్రిజిల్లా దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీ పరిధి బూర్గుగుంపు గ్రామానికి చెందిన కట్టం నాగశ్రీ (21), సున్నం అనూష (23) మరికొందరితో కలిసి జగ్గారం శివారు అరటి తోటలో కూలి పనికి వెళ్లారు. మధ్యాహ్నం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో త్వరగా పనులు ముగించుకొని బయలుదేరిన క్రమంలో వారు నిల్చున్న చోటే పిడుగు పడింది.దీంతో నాగశ్రీ, అనూష ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. సీతమ్మ, ఊకే రత్తమ్మ, కల్లూరి రాజమ్మ తీవ్ర అస్వస్థతకు గురికాగా సత్తుపల్లి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. మరోఘటనలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన రైతు కంకణాల కృష్ణకుమార్ (33) పిడుగుపాటుతో మృతిచెందాడు. కృష్ణకుమార్ తన పాడి గేదెలను తీసుకొని గ్రామ శివారులోని మైదానంలో మేపుతుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురికావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పిడుగుపాటుకు కాడెడ్లు మృతి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాయాపూర్ కాండ్లీకి చెందిన రైతు ఆరె లింగురాం పటేల్‌కు చెందిన కాడెడ్లు, లేగదూడ సోమవారం రాత్రి పిడుగుపాటుతో మృతిచెందాయి. లింగురాం తనకున్న ఐదెకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా పంటలు సాగుచేశాడు. సోమవారం ఉదయం కాడెడ్లను చేను వద్దకు తీసుకెళ్లాడు. పనులు పూర్తయ్యాక సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటిపక్కనే వాటిని కట్టేసి రాత్రి నిద్రపోయాడు. అర్ధరాత్రి పిడుగు పడటంతో కాడెడ్లతోపాటు లేగదూడ మరణించాయి. ఆర్ఐ బాలకిషన్ పంచనామా నిర్వహించారు. -
బీపీసీఎల్ చైర్మన్‌గా కృష్ణకుమార్ బాధ్యతలు
న్యూఢిల్లీ: బీపీసీఎల్ నూతన చైర్మన్, ఎండీగా జి.కృష్ణకుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు వరకు సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2025 ఏప్రిల్ వరకు బీపీసీఎల్ చైర్మన్, ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. గత డిసెంబర్లో ప్రభుత్వరంగ సంస్థల నియామక మండలి కృష్ణకుమార్‌ను ఈ పదవికి ఎంపిక చేయడం గమనార్హం. బీపీసీఎల్ చైర్మన్, ఎండీగా అరుణ్‌కుమార్ సింగ్ గతేడాది అక్టోబర్‌తో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి సంస్థ చైర్మన్ బాధ్యతలను ఫైనాన్స్ డైరెక్టర్ వెస్టా రామకృష్ణ గుప్తా చూశారు. ఎన్ఐటీ తిరుచ్చిరాపల్లి నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, జమ్నాలాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ను కృష్ణకుమార్ పూర్తి చేశారు. -
ప్రభుత్వ ఉద్యోగి అదృశ్యం
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపిం చకుండా పోయిన సంఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి లో జరిగింది. ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే పి. రాజగోపాల్రావు కుమారుడు పిసివి కృష్ణకుమార్ (27).జిహెచ్ఎంసి పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్లో ఏఈగా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళాడు, తిరిగి రాలేదు. సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వస్తుంది. దీంతో తల్లిదండ్రులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
10 లక్షల మంది విద్యార్థుల వద్దకు డెల్ ఆరంభ్
♦ పీసీ ఆవశ్యకతపై అవగాహన ♦ డెల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణకుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ డెల్ ఆరంభ్ పేరుతో భారీ కార్యక్రమానికి భారత్‌లో శ్రీకారం చుట్టింది. పర్సనల్ కంప్యూటర్ (పీసీ) వాడకం వల్ల విద్యార్థులకు ఒనగూరే ప్రయోజనాలను తెలియజేయడమే ఈ కార్యక్రమ ఉద్ధేశం. ఇందులో భాగంగా 2016లో దేశవ్యాప్తంగా 75 చిన్న పట్టణాల్లోని 5,000 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 లక్ష మంది ఉపాధ్యాయులు, 2 లక్షల మంది తల్లిదండ్రులకు డెల్ అవగాహన కల్పిస్తుంది. ఆరంభ్ ద్వారా 10 లక్షల మంది విద్యార్థులను చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం. పీసీ ద్వారా మరింత ఉత్తమంగా బోధన ఎలా చేయవచ్చో ఉపాధ్యాయులకు కంపెనీ శిక్షణ ఇస్తుంది. వీరు పిల్లల తల్లిదండ్రులకు పీసీ వాడకం, ఉపయోగాలపై అవగాహన కల్పిస్తారని డెల్ ఇండియా కంజ్యూమర్, స్మాల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ పి.కృష్ణకుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. రెండేళ్లలో 14 శాతానికి.. పీసీ విస్తరణ భారత్‌లో ప్రస్తుతం 9-10 శాతానికే పరిమితమైంది. అదే బ్రెజిల్లో 60 శాతం, చైనాలో 40 శాతం, పొరుగున ఉన్న చిన్న దేశమైన శ్రీలంకలో 12 శాతం గృహాల్లో పీసీలు ఉన్నాయి. భారత్‌లో అధిక జనాభా ఉన్నప్పటికీ పీసీల వాడకం చాలా తక్కువగా ఉందని కృష్ణకుమార్ వ్యాఖ్యానించారు. నెట్వర్క్/బ్రాడ్‌బ్యాండ్ పరిమితంగా ఉంది. ఇది పూర్తి స్థాయిలో విస్తరిస్తే పీసీ వినియోగం అధికమవుతుంది. ఇంటర్నెట్ను తొలిసారిగా మొబైల్లోనే ఆస్వాదిస్తున్నారు. అయితే కంటెంట్ సృష్టించాలంటే మాత్రం పీసీ ఉండాల్సిందే. జనాభాలో 43 శాతం విద్యార్థులున్నారు. పీసీ ప్రయోజనాలను వీరికి వివరిస్తాం. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేక వాయిదా స్కీమ్ ద్వారా పీసీలను విక్రయిస్తామని ఆయన చెప్పారు.