సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగి
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం జూన్1తో ముగియడంతో ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్‌పర్సన్ పదవి ఖాళీగా ఉంది. కొత్త చైర్‌పర్సన్ ఎంపిక కోసం డిసెంబర్ 18న సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రపతి నియమించారు.
చైర్మన్ రామసుబ్రమణియన్‌తోపాటు సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగి (రిటైర్డ్)లను నియమిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్సీ తెలిపింది. కనూంగో గతంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) చైర్ పర్సన్‌గా పనిచేశారు. గతంలో హక్కుల సంఘానికి అధిపతులుగా పనిచేసిన మాజీ సీజేఐలలో హెచ్‌ఎల్ దత్తు, కేజీ బాలకృష్ణన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment