న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రూ.2 కోట్లకు పైగా నష్టపరిహారం ఇవ్వాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. మనీష్ గౌతమ్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఢిల్లీలోని రోహిణి మార్గ్‌లో 2019 మే 31న రోడ్డు పక్కన నడుస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొంది.
ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన గౌతమ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆ మర్నాడు జూన్ 1న మరణించారు. అయితే బాధితుడు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అందుకే నష్టపరిహారం ఇవ్వాల్సిన పని లేదని ఇన్సూరెన్స్ కంపెనీ చేసిన వాదనలను ట్రిబ్యునల్ న్యాయమూర్తి తోసిపుచ్చారు. గౌతమ్ కుటుంబ సభ్యులకు 2 కోట్ల 50 వేల రూపాయలు చెల్లించాల్సిందేనని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment