శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పాదనపై ట్రిబ్యునల్ తీర్పును తెలంగాణ ప్రభుత్వం గౌరవించాల్సిందేనని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి విద్యుత్ ఉత్పాదనపై ట్రిబ్యునల్ తీర్పును తెలంగాణ ప్రభుత్వం గౌరవించాల్సిందేనని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
నదీ జలాల వినియోగ విధానాలలో తాగునీటికే ప్రాధాన్యత ఉందన్న వాస్తవాన్ని కేసీఆర్ గ్రహించాలని రఘువీరా హితవు పలికారు. రాయలసీమలో తాగునీరు లేక ప్రజలు చనిపోయే పరిస్థితి ఉందని ఆయన అన్నారు.