
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (2016 నవంబర్‌లో డీమోనిటైజేషన్) తర్వాత బ్యాంకు ఖాతాల్లో రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసిన గృహిణులకు సంబంధించి ఎటువంటి పరిశీలన అవసరం లేదని ఆదాయపన్ను విభాగం అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీ ఏటీ) ఆగ్రా బెంచ్ స్పష్టం చేసింది. ఆ ఆదాయాన్ని అసెస్సీ ఆదాయంగా పరిగణించరాదని పేర్కొంది. ఈ ఆదేశాలు ఇదే మాదిరి అన్ని కేసులకూ వర్తిస్తుందని తేల్చింది.
గ్వాలియర్‌కు చెందిన గృహిణి ఉమా అగర్వాల్ 2016–17 ఏడాదికి రూ.1,30,810 ఆదాయంగా పేర్కొం టూ ఐటీ రిటర్ను దాఖలు చేశారు. డీమోనిటైజేషన్ తర్వాత రూ.2,11,500 పెద్ద నోట్లను డిపాజిట్ చేశారు. దీంతో ఈ కేసును పరిశీలన కోసం ఆదాయపన్ను శాఖ తీసుకుంది. భర్త, పిల్లలు, బంధువులు ఇవ్వగా పొదుపు చేసుకున్న మొత్తం ఇదంటూ ఆమె ఆదాయపన్ను శాఖ పరిశీలన అధికారికి వివరించారు. కానీ, దీన్ని ఆదాయపన్ను శాఖ అంగీకరించలేదు. వివరణలేని ధనంగా తేల్చింది. దీనిపై అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆమె ఆశ్రయించారు.
చదవండి: జేపీ ఇన్‌ఫ్రాటెక్ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు?!
Comments
Please login to add a commentAdd a comment