
కేజ్రీవాల్ సతీమణి స్వచ్ఛంద పదవీ విరమణ
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత(51) ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్) నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖలో ఆమె 22 ఏళ్లు పనిచేశారు. ఢిల్లీలో ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కమిషనర్‌గా చివరి బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ ఏడాది మొదట్లోనే వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేయగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఇప్పుడు అధికారికంగా ఆదేశాలు జారీచేసింది. జులై 15 నుంచి ఈ విరమణ అమలులోకి వస్తుంది. కేంద్రానికి, ఆప్ ప్రభుత్వానికి మధ్య వివాదం నేపథ్యంలో బాధితురాల్ని అవుతానన్న భయంతోనే సునీత ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.