సాక్షి, అమరావతి: విద్యా సంవత్సరం ముగిసినా ఇంతవరకు ఏపీ సర్కార్ ఉపాధ్యాయ బదిలీల వ్యవహారంపై ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతి ఇవ్వడం లేదని సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే చోట విధులు నిర్వహించిన వారికి బదిలీలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరితో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, దివ్యాంగులు, వితంతువులు వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆయా టీచర్లను బదిలీ చేయనున్నారు. ఈ బదిలీ ప్రక్రియ మే 5వ తేదీ నుంచి జూన్ 4 వరకు నెల రోజులపాటు కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రెండో టెట్‌ను మే 4న, జూలై 6న డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ ఖాళీగా ఉన్న 10,351 టీచర్ల పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించనున్న ఏపీ సర్కార్.. టెట్ పరీక్షలను ఆగస్టు 23 నుంచి 30 వరకు నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment