ఎట్టకేలకు ఏఎంసీ పోస్టుల భర్తీ
Published Fri, Oct 21 2016 9:52 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
ఆచంట: ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న ఆచంట, పెనుగొండ ఏఎంసీల నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది. ఈమేరకు మార్కెటింగ్ శాఖ కమీషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆచంట ఏఎంసీ ఛైర్మన్‌గా ఉప్పలపాటి సురేష్‌బాబు, వైఎస్ ఛైర్మన్‌గా రుద్రరాజు సీతారామరాజు(రవిరాజు), పెనుగొండ ఏఎంసీ ఛైర్మన్‌గా సానబోయిన గోపాలకష్ణ, వైఎస్ ఛైర్మన్‌గా బడేటి బ్రహ్మజీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలో ఈరెండు పాలకవర్గాలకు సబంధించి ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్నది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ల తర్వాత కీలకమైన నామిటేటెడ్ పోస్టులు భర్తీకావడంపై పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది. పెనుగొండ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింది. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఎంపిక చేసిన అభ్యర్థులనే ప్రకటించంటం పట్ల పట్ల ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement