mahashtra
-
మహారాష్ట్రలో ట్రక్కు బీభత్సం.. 10 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధులే జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి నాలుగు వాహనాలు ఢీకొట్టి దాబాలోకి (హోటల్) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పది మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం పది గంటలకు పలాస్నర్ గ్రామ సమీపంలోని ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి ధులేకు వెళ్తుండగా.. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పింది. దీంతో ముందుగా హైవేపై బస్టాప్ సమీపంలో ఉన్న రెండు బైక్‌లు, ఒక కారు, మరొక కారును ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కకు ఎగిరిపడింది. అంతటితో ఆగకుండా పక్కన ఉన్న దాబాలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. 20 మందికిపైగా గాయపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. భాదితుల్లో బస్టాప్‌లో వేచిచూస్తున్న ప్రయాణికులు సైతం ఉన్నారని, క్షతగాత్రులను ధులే, సిర్పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు విచారణ చేపట్టినట్లు చెప్పారు. చదవండి: సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వానికి ఊరట.. -
మళ్లీ లాక్డౌన్.. 3 కోట్ల మందికి ముప్పు?
సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంతకుముందు విధించిన లాక్‌డౌన్‌తోనే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. జనజీవనం స్థంభించిపోయింది. ప్రజలు ఆర్థికంగా నష్టపోయి పేదరికంలో కూరుకుపోయారు. ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి వస్తోంది. ఫ్యాక్టరీలు తెరుచుకోవడంతో చాలా మందికి ఉపాధి దొరుకుతోంది. కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్డౌన్ విధిస్తే తమ పరిస్థితి ఏంటని తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈసారి మళ్లీ లాక్డౌన్ విధిస్తే రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల మంది ఉపాధికి ముప్పు పొంచి ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 19 లక్షల సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలుండగా 6 వేల భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటిలో సుమారు మూడు కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. దీంతో మళ్లీ లాక్డౌన్ విధిస్తే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు. మొదటిసారి విధించిన లాక్‌డౌన్‌తో 10 లక్షల కార్ఖానాలు, వ్యాపారాలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే ఆ అవన్నీ తెరుచుకొని పరిస్థితి కుదుటపడుతోంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్డౌన్ విధిస్తే ఆ ఫ్యాక్టరీలు, వ్యాపారాలు పూర్తిగా మూతపడే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నారు. ముంబై ఉప నగరాలతో పాటు థానే, నవీముంబైలలో పెద్ద ఎత్తున చిన్న, పెద్ద, మధ్య తరహా కంపెనీలు సుమారు 10 లక్షల వరకు ఉంటాయి. ఈ కంపెనీల్లో సుమారు 80 లక్షల మంది కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీటిలో నిత్యావసర సేవల్లోని కార్మికులు మినహా మిగతా కార్మికులు, సిబ్బంది అందరు లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలా ఇళ్లకు పరిమితి అయిన వారి సంఖ్య సుమారు 72 లక్షల వరకు ఉంటుంది. ఈ కార్మికుల్లో సుమారు 12 నుంచి 15 శాతం మంది ఉద్యోగాలు పోయాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే ఈ కార్యాలయాలు, కంపెనీలు తెరుచుకుని పరిస్థితి అదుపులోకి వస్తుంది. దీంతో చాలామంది ఉపాధి పొందుతున్నారు. అయితే అంతలోనే మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయనే వార్తలతో ఈ కంపెనీలు, ఉద్యోగులు తీవ్ర భయాందోళనలో పడిపోయారు. ఈ విషయంపై ఎస్ఎంఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చంద్రకాంత్ సాలుంకే మీడియాతో మాట్లాడారు. లాక్డౌన్ కారణంగా ఇప్పటి వరకు సుమారు 25 నుంచి 30 శాతం చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే మళ్లీ లాక్డౌన్ విధిస్తే మాత్రం చాలా మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడనుంది. అదేవిధంగా ఆయా పరిశ్రమలు, కంపెనీలలో పనులు చేసే సిబ్బంది ఆర్థికంగా దెబ్బతింటారని చెప్పారు. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం! మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ విధించకుండా ఆదేశాలు జారీ చేయాలని హర్షల్ మిరాశీ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. లాక్డౌన్ విధిస్తే మళ్లీ ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. దీంతో లాక్డౌన్ విధించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరినట్టు తెలిసింది. అయితే సుప్రీంకోర్టులో కాకుండా హైకోర్టులో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని ఆయనకు సుప్రీంకోర్టు సూచించినట్టు సమాచారం. -
కేంద్ర నిర్ణయంపై భగ్గుమన్న శివసేన
ముంబై : అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(ఐఎఫ్ఎస్సీ) ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌లోని గాంధీనగర్‌కు మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మహరాష్ట్ర ప్రభుత్వం మండి పడింది. దేశ ఆర్థిక రాజధానిగా పరిగణిస్తున్న ముంబై నుంచి ఐఎఫ్ఎస్సీని గుజరాత్‌కు తరలించడం సరికాదని అభిప్రాయపడింది. 'సబ్ కా సాథ్... సబ్ కా వికాస్' అంటే ఇది కాదని విమర్శించింది. (చదవండి : కరోనా : మహారాష్ట్ర సంచలన నిర్ణయం) శనివారం శివసేన ఎంపీ అర్వింద్ సావంత్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రాజధానిగా పరిగణించబడుతున్న ముంబై నుంచి ఐఎఫ్ఎస్సీని గుజరాత్‌కు తరలించడం సరైన నిర్ణయం కాదన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అనే మోదీ నినాదానికి వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. గుజరాత్ లో ఫైనాన్షియల్ సెంటర్ పెట్టడానికి తాము వ్యతిరేకం కాదని... కానీ, మహారాష్ట్రకు ఇంకేం మిగిలిందనే విషయంపైనే తాము ఆందోళన చెందుతున్నామని సావంత్ చెప్పారు. ఆర్థిక రాజధాని అనే మాటకు అర్థం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. ఐఎఫ్ఎస్సీ ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌కు తరలించడంపై ఎన్సీపీ నేత శరత్ పవర్ కూడా తప్పబట్టారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలకు నిరాశను కలిగించిందని వ్యాఖ్యానించారు. -
20 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై తన ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా రాష్ట్రంలో 20 రోజుల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. థానే జిల్లాలోని కల్యాణ్ టౌన్‌కు చెందిన 20 రోజుల శిశువు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. (చదవండి : భారత్‌లో పంజా విసురుతున్న కరోనా) శిశువుతో పాటు మరో ఆరుగురికి కూడా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 162కే చేరింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందినట్లు మున్సిపాలిటీ ఆరోగ్య అధికారి డా. రాజు తెలిపారు.మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఇప్పటివరకు 9,915 కరోనా కేసులు నమోదుకాగా, మొత్తం 432 మంది మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,050కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 1074 మంది మృతి చెందారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చిగురుటాగులా వణుకుతోన్న మహారాష్ట్ర
ముంబై : కరోనా మహమ్మారి ధాటికి మహారాష్ట్ర చిగురుటాగులా వణుకుతోంది.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా1761కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా మరో 134 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో ఇప్పటికి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1895కి చేరింది. ఆదివారం నమోదైన 134 కేసుల్లో ముంబైలో 113, పుణేలో 4, మీరా భయందర్‌లో 7, నావి ముంబైలో 2, తానే, వాసై విరార్,రైగా, అమరావతి, భివాండి, పింప్రీ-చిన్చ్వడ్‌లో ఒక్కో ఒక్కో పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా బారినపడి మహారాష్ట్రంలో ఇప్పటి వరకు 127 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,356 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 1,035 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 273 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. -
ప్రశాంత్ కిషోర్ చేతిలో ఠాక్రే వారసుడు
సాక్షి, ముంబై: రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరొందిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కోసం రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంలో తెరవెనుక ఆయన కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అలాగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీయూ మహాకూటమి గెలపు వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన సలహాదారుడిగా పనిచేశారు. దీంతో దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఆయనను తమ పార్టీకి వ్యూహకర్తగా ఉండాలంటూ స్వాగతిస్తున్నాయి. బెంగాల్లో మమత బెనర్జీతో ఇప్పటికే ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఇవన్నీ వారంతా వారి పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రశాంత్ కోరుతున్నారు. కానీ అందుకు భిన్నంగా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మాత్రం ప్రశాంత్ కిషోర్ వద్ద ఓ కీలక ప్రతిపాదన ఉంచారని తెలుస్తోంది. త్వరలో మహారాష్ట్రలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందేకు కృషి చేస్తూనే.. తన కుమారుడు ఆదిత్య ఠాక్రేను సమర్ధవంతమైన రాజకీయనేతగా తయారుచేయాలని ఆయన వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రశాంత్ సూచనలతో రానున్న అసెంబ్లీ ఎన్నికలల్లో ఆదిత్యను బరిలోకి దింపేందుకు ఠాక్రే సిద్ధమయ్యారు. అంతే కాదు మహారాష్ట్ర సీఎం పీఠంపై కూడా శివసేన కన్నేసింది. ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆదిత్యాను మరింత తీర్చిదిద్దే బాధ్యతను ప్రశాంత్ కిషోర్‌పై పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వారిద్దరి మధ్య భేెటీ జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎవరూ కూడా అధికారిక ప్రకటన చేయలేదు. -
‘కాళేశ్వరం’ సర్జ్‌పూల్‌లో కొనసాగుతున్న పరిశీలన
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కొనసాగుతున్న ట్రయల్‌రన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి ప్యాకేజీ–6 కాల్వలకు నీటిని విడుదల చేసిన ఇంజనీర్లు, టన్నెళ్ల ద్వారా వస్తున్న నీటితో నందిమేడారం పంప్‌హౌజ్‌లోని సర్జ్‌పూల్‌ను నింపుతున్నారు. 138 మీటర్ల లోతైన సర్జ్‌పూల్‌ను క్రమంగా నీటితో నింపుతూ లీకేజీలను గమనిస్తున్నారు. ఇప్పటివరకు సర్జ్‌పూల్ లెవల్ని 16 మీటర్ల వరకు నింపినట్లు ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ప్రతి గంటకు 0.6 మీటర్ల మేర నీరు సర్జ్‌పూల్‌లో నిండుతోందని తెలిపారు. ఇప్పటివరకు ఎలాం టి నీటి లీకేజీలు లేవని స్పష్టంచేశారు. 138 మీటర్ల లెవల్‌కు నీటి మట్టాలు చేరిన వెంటనే పంప్‌హౌజ్‌లోని మోటార్లను రన్ చేయనున్నారు. ఈ మోటార్ల ద్వారా వెట్ రన్ నిర్వహించనున్నారు. ఈ నెల 24న వెట్‌రన్‌ను నిర్వహించే అవకాశాలున్నట్లు ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. సర్జ్‌పూల్ నింపే ప్రక్రియను ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్‌లు పర్యవేక్షిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శుక్రవారం మహారాష్ట్ర నీటి పారదుల శాఖ ఇంజనీర్ల బృందం పరిశీలించింది. -
మహారాష్ట్రను విభజించే ధైర్యమా?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర విభజన గురించి ప్రతిపక్ష పార్టీలు తనపై చేస్తున్న ఆరోపణలను ప్రధాని నరేంద్రమోదీ విస్పష్టంగా తిప్పికొట్టారు. తాను ప్రధానిగా ఉన్నంతకాలం ఏ శక్తి కూడా మహారాష్ట్రను విడదీయడం కానీ, మహారాష్ట్ర నుంచి ముంబైని వేరుచేయడం కానీ చేయలేదని తేల్చి చెప్పారు. ‘ఛత్రపతి శివాజీకి చెందిన ఈ గడ్డను విభజించే ధైర్యమున్నవాడు ఈ భూమ్మీద ఎవరైనా పుట్టాడా?’ అంటూ మిన్నంటిన సభికుల హర్షధ్వానాల మధ్య ప్రశ్నించారు. మహారాష్ట్రను విడదీసి ముంబై రాజధానిగా ప్రత్యేక విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే రహస్య ఎజెండాతో బీజేపీ పనిచేస్తోందంటూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఎంఎన్ఎస్లు ప్రచారం చేస్తుండటంపై మోదీ తీవ్రంగా స్పందించారు. గత దశాబ్ద కాలంగా పత్తి, ఉల్లిగడ్డల ధరలపై ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేసిన కాంగ్రెస్.. తాజాగా ఈ కొత్త అబద్ధాన్ని ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ముంబైలేని మహారాష్ట్ర అసంపూర్ణమని వ్యాఖ్యానిస్తూ.. ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందేందుకు బీజేపీయేతర పార్టీలు ఈ తరహా వదంతులను ప్రచారం చేస్తున్నాయన్నారు. ధూలే, జల్గావ్, నాగపూర్‌లతో సహా పలు ప్రచార ర్యాలీల్లో మంగళవారం మోదీ పాల్గొన్నారు. ధూలేలో మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలో గత 15 ఏళ్ల కాంగ్రెస్, ఎన్సీపీల పాలనలో రాష్ట్రంలో ఒక తరం నాశనమైంది. యువకులకు ఉపాధి లేదు. మహిళలకు రక్షణ లేదు. రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోనూ వారే అధికారంలో ఉన్నారు. రైతు ఆత్మహత్యలకు వారు బాధ్యులు కాదా? వారిని శిక్షించేందుకు ఇప్పుడు సమయం వచ్చింది. మరి శిక్షిస్తారా లేదా?’ అని భారీగా హాజరైన జనసమూహాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. ఉల్లి తిన్న విశ్వాసం: ‘60 ఏళ్ల పాలనలో దేశానికి ఏం చేశారో చెప్పుకోలేని వారు.. 60 రోజుల్లో నేనేం చేశానో చెప్పాలని సిగ్గులేకుండా నన్ను ప్రశ్నిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. ‘మన్మాడ్- ఇండోర్ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేస్తామంటూ అనేక ఎన్నికల్లో వారు విజయం సాధించారు. కానీ ఒక్క అంగుళం పని కూడా చేయలేదు’ అంటూ కాంగ్రెస్ వారిలా తాను తప్పుడు హామీలు ఇవ్వబోనన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. ‘ధులే, నందుర్బార్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తాం. నేను బాల్యం నుంచి ఉల్లి తింటున్నాను. మాకు ఉల్లి అందించిన ఈ ప్రాంతవాసులను నిరాశపరచను. పూర్తిమెజార్టీతో రాష్ట్రంలో అధికారం వచ్చిన వెంటనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉల్లి రైతుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం’ అని స్థానిక రైతులకు హామీ ఇచ్చారు. నిరుపేదల గుడిసెలను సందర్శించి ఫొటోలు దిగిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశిస్తూ.. ‘నిరుపేదల ఇళ్లు సందర్శించానని చెప్పుకునేందుకు ఫొటోలేం నా దగ్గర లేవు. కానీ నేను పుట్టిందే పేద కుటుంబంలో’ అని చురకలంటించారు. ఐదేళ్ల పాలన పూర్తి అయిన తరువాత తానిచ్చిన ప్రతీ హామీపై ప్రజలకు సమాధానం చెబుతామని మోదీ తెలిపారు. గడ్కారీపై బూటు దాడికి యత్నం సాక్షి, ముంబై: కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కారీపై బూటు దాడికి విఫలయత్నం జరిగింది. సోమవారం మహారాష్ట్రలోని పుణేలో కోత్రోడ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. గడ్కారీని సభ నిర్వాహకులు పూలు చల్లుతూ ఆహ్వానిస్తుండగా, భరత్ కరాడ్(37) అనే వ్యక్తి తన బూటును ఆయనపై విసిరేందుకు యత్నించాడు. ఇది గమనించిన బీజేపీ కార్యకర్తలు అతన్ని చితకబాదారు. కరాడ్ ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నట్లు సమాచారం.