అసభ్యకర సందేశాలు పంపుతున్న వ్యక్తి అరెస్ట్
శ్రీనగర్ కాలనీ (హైదరాబాద్): ఓ మహిళ పట్ల అభ్యకరంగా వ్యవహరిస్తున్న యువకుడ్ని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిమ్స్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తున్న మహిళకు చింతల్‌బస్తీకి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు అసభ్యకరంగా సంక్షిప్త సందేశాలను పంపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
దీంతో ఆమె పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.