
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడు అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయాడు. ఏసీపీ తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా పరీక్షల కోసం నిందితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అశోక్‌రెడ్డిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్‌రాజ్ రెడ్డి, ఏ 2 సాయికృష్ణారెడ్డిలు పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, అశోక్‌రెడ్డి ఆర్‌ఎక్స్ 100 సినిమా నిర్మాత అన్న సంగతి తెలిసిందే.
(చదవండి: శ్రావణి కేసు: ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!)
Comments
Please login to add a commentAdd a comment