సాక్షి, హైదరాబాద్: ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, బెంగళూరుతో ముడిపడ్డ భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పంజాగుట్ట పోలీసులు చేధించారు. పెద్ద ఎత్తున 4.75 గ్రాముల 10 ఎక్స్టెసీ మాత్రలు, 5.18 గ్రాముల ఎండీఎంఏ, 109 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముంబాయికి చెందిన రోమి, పాలస్తీనా చెందిన సయీద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
కీలక నిందితుడితో పాటు దేశంలో అక్రమంగా ఉంటూ హైదరాబాద్‌లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న పాలస్తీనా శరణార్థిని అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తెచ్చి కస్టమర్లకు సయూద్ విక్రయిస్తున్నారు.
గోవా, బెంగళూరు, ముంబైలలో ఉంటూ దేశవ్యాప్తంగా 14 మంది స్మగర్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇందులో ఏడుగురు నైజీరియన్లు ఉన్నట్లు నిందితులు వెల్లడించారు. హైదరాబాద్‌కి చెందిన 31 మంది వినియోగదారుల పేర్లు నిందితుల నుంచి పోలీసులు రాబట్టారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా మరికొందర్ని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి: Liquor Case: కవితకు జైలా? బెయిలా?
Comments
Please login to add a commentAdd a comment