సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఎక్కడ డ్రగ్స్ పార్టీలు జరిగినా టాలీవుడ్ నటులతో లింక్ పెడుతూ వార్తలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్‌పారీ్టలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి.
నటుడు శ్రీకాంత్, నటి హేమ వీరిలో ఉన్నారనే ప్రచారం జరగ్గా..దానిపై వారు వివరణ ఇచ్చారు. 2018లోనూ తెలంగాణ ఎక్సైజ్‌శాఖ అధికారులు దర్యాప్తు చేసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెలుగు చిత్రపరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటులు రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, చార్మి, ముమైత్ ఖాన్ సహా పలువురిని ఎక్సైజ్ శాఖ అధికారులు రోజుల తరబడి విచారించడం సంచలనం సృష్టించింది.
గతేడాది తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేసిన ఓ కేసులో నటుడు నవదీప్‌తో పాటు షాడో, రైడ్ చిత్రాల నిర్మాత ఉప్పలపాటి రవి, డియర్ మేఘ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి, మోడల్ శ్వేత, మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ దేవరకొండ విఠల్ రావు కుమారుడు సురేశ్‌రావు తదితరుల పేర్లు బయటికి వచ్చాయి. తాజాగా బెంగళూరు పార్టీలో శ్రీకాంత్, హేమ ఉన్నారనే వార్తలు రావడం సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment