హైదరాబాద్ : నగరంలోని ఎల్బీ నగర్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి కేజీ వెండి, 21 తులాల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.