‘రాయల్‌’ దొంగ అరెస్టు | Royal Enfield Vehicle Thief Arrested In Hyderabad, More Details Inside | Sakshi
Sakshi News home page

‘రాయల్‌’ దొంగ అరెస్టు

Published Sat, Jul 20 2024 11:27 AM | Last Updated on Sat, Jul 20 2024 12:06 PM

Royal Enfield vehicle thief arrested

మోతీనగర్‌: జల్సాలకు అలవాటు పడి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్ముతున్న ఓ దొంగను అల్లాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సామల వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..అల్లాపూర్‌లో ఓ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనం దొంగతనం జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ క్రమంలో శుక్రవారం అల్లాపూర్‌ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా..గోల్కొండకు చెందిన సయ్యద్‌ సాహిల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనానికి సంబంధించిన పేపర్లు పరిశీలించారు. అనుమానాస్పదంగా వ్యవహరించడంతో విచారించగా తాను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకుకున్నాడు. 

జగద్గిరిగుట్ట, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, జంజారాహిల్స్, మధురానగర్, అల్లాపూర్, పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పలు రాయల్‌æఎన్‌ఫీల్డ్‌ వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దొంగ నుంచి 5 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాలు, ఒక సెల్‌ఫోన్‌ను రికవరీ చేశారు. ఈ మేరకు సయ్యద్‌ సాహిల్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement