హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్లో పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శీనయ్య అనే దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 18 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. శీనయ్య బిటెక్ చదివి దొంగతనాలు చేస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు వెల్లడించారు.