హైదరాబాద్ : నగరంలోని ఎల్‌బీ నగర్ చౌరస్తాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అడ్డుకుంటున్నారు. ప్రైవేటు టావెల్స్ బస్సులు అక్రమంగా ప్రయాణికులను రవాణా చేస్తూ ఆర్టీసీ ఆదాయానికి నష్టం కలిస్తున్నాయని వారు ఆరోపించారు. దీంతో ఎల్ బీ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న ఎంప్లాయిస్ యూనియన్ నాయకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.