హైదరాబాద్ : ఎల్బీ నగర్లో ఇద్దరు నకిలీ పోలీసులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో పలువురు వ్యక్తులను ఈ నకిలీ పోలీసులు బెదిరించి బలవంతంగా నగదు వసూళ్లు చేస్తున్నారు. దీంతో స్థానికులు, బాధితులు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.