వ్యభిచార గృహంపై దాడి.. నలుగురు యువతుల అరెస్ట్‌ | LB Nagar SOT Police Raids On Brothel, Arrested 5 Members | Sakshi

వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురి అరెస్టు 

Jun 22 2021 10:58 AM | Updated on Jun 22 2021 11:02 AM

LB Nagar SOT Police Raids On Brothel, Arrested 5 Members - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నాగోలు: గుట్టుచప్పుడు కాకుండా హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న అయిదుగురిని సోమవారం రాత్రి ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఆరెస్టు చేవారు. ఎల్‌బీనగర్‌ నుంచి సరూర్‌నగర్‌ పాత రోడ్డులోని హోటల్‌ ఏబీ7 రెసిడెన్సీలో కొన్నాళ్ల నుంచి కూకట్‌పల్లికి చెందిన ముత్తవరపు శివ, సలీం ఇద్దరు గుట్టుచప్పడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బాలాపూర్‌ గుర్రంగూడలో ఉండే కొమ్మోల్ల ప్రశాంత్‌ వారి కింది సబ్‌ ఆర్గనైజర్‌గా పని చేస్తున్నాడు.

సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం రాత్రి హోటల్‌పై దాడి చేసి నలుగురు యువతులను, సబ్‌ ఆర్గనైజర్‌ ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని ఎల్‌బీనగర్‌ పోలీసులకు అప్పగించారు. ప్రధాన నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సెల్‌ఫోన్లు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: లాడ్జీలో వ్యభిచారం.. యువతి, ఆర్గనైజర్ల అరెస్ట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement