
దినేష్ రెడ్డితో పోలీసుల దురుసు ప్రవర్తన
మాజీ డీజీపీ, మల్కాజ్గిరి లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దినేష్ రెడ్డిపై ఎల్బీ నగర్ పోలీసులు బుధవారం దురుసుగా ప్రవర్తించారు. ఎల్బీనగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.... ఎందుకు వారికి అనుమతించడం లేదని దినేష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు.ఆ క్రమంలో మాజీ డిజీపీ దినేష్ రెడ్డితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. దాంతో ఆ పార్టీ ఏజెంట్పై పోలీసులు దాడికి దిగారు. దాడికి దిగిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోకి ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న సంగతి తెలిసిందే.